హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Shocking Video: పిల్లలు టపాసుల్లో భాస్వరాన్ని కాగితంలో పోసి మ్యాన్‌హోల్‌పై ఉంచి.. అగ్గిపుల్ల వెలిగించగానే..

Shocking Video: పిల్లలు టపాసుల్లో భాస్వరాన్ని కాగితంలో పోసి మ్యాన్‌హోల్‌పై ఉంచి.. అగ్గిపుల్ల వెలిగించగానే..

వీడియోలోని దృశ్యాలు

వీడియోలోని దృశ్యాలు

సోషల్ మీడియాలో తాజాగా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను చూస్తే చిన్నారులు త్రుటిలో అపాయం నుంచి తప్పించుకున్నారు.

సూరత్: సోషల్ మీడియాలో తాజాగా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను చూస్తే చిన్నారులు త్రుటిలో అపాయం నుంచి తప్పించుకున్నారు. సూరత్‌లోని యోగి చౌక్ ప్రాంతంలో ఉన్న తులసి దర్శన్ సొసైటీలో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. దీపావళి పండుగ దగ్గరకు వస్తుండటంతో టపాసులు పేల్చుతూ పిల్లలు సందడి చేస్తున్నారు. కానీ.. ఈ సరదానే సూరత్‌లో ముగ్గురు పిల్లలను ప్రాణాపాయంలో పడేసింది. టపాసుల్లో వాడే భాస్వరం మండే స్వభావం కలిగిందన్న సంగతి తెలిసిందే.

సూరత్‌లో ఓ ఇంట్లో ఆడుకుంటున్న నలుగురు చిన్నారులు టపాసుల్లో ఉండే భాస్వరాన్ని రోడ్డుపై ఉన్న మ్యాన్‌హోల్‌పై ఓ కాగితం ఉంచి దానిపై పోశారు. ఆ కాగితాన్ని అంటించేందుకు అగ్గిపుల్ల వెలిగించారు. అంతే.. ఒక్కసారిగా ఆ మ్యాన్‌హోల్ నుంచి మంటలు ఎగసిపడ్డాయి. అయితే.. పిల్లలు వెంటనే అప్రమత్తం అయి పక్కకు వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఇది కూడా చదవండి: Viral Video: వ్యాక్సిన్ వేయడానికి వెళితే బుట్టలో నుంచి పామును బయటకు తీసి.. ఏం చెప్తాంలే.. మీరే చూడండి..

మ్యాన్‌హోల్ నుంచి మంటలు రావడంతో అగ్నిమాపక బృందం అక్కడికి వచ్చి పరిశీలించింది. ఆ డ్రైనేజ్ లైన్‌లో మ్యాన్‌హోల్ కిందుగా అండర్‌గ్రౌండ్ వంట గ్యాస్ పైప్‌లైన్ ఉందని, అందుకే మంటలు రేగాయని తేల్చారు. ఈ ఘటనలో ఆ చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది.


ఇది కూడా చదవండి: Viral News: తోటలో రిలాక్స్ అవుతున్న వ్యక్తికి చేదు అనుభవం.. విమానం నుంచి మీద పడిన మానవ విసర్జితాలు..

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టపాసులు పేల్చే సమయంలో పిల్లలను ఓ కంట కనిపెట్టాలి. లేకపోతే ఇలాంటి ప్రమాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. గత బుధవారం తమిళనాడులోని ఓ టపాసుల దుకాణంలో మంటలు రేగి ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను ఒక్కసారి చూస్తే.. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. పెద్ద పేలుడు శబ్దం వీడియోలో స్పష్టంగా వినిపించింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు పెను విషాదాలను మిగిల్చాయి. అందువల్ల దీపావళికి టపాసులు కాల్చే సందర్భంలో పిల్లలను ఓ కంట కనిపెట్టడం మేలు.

First published:

Tags: Social Media, Surat, Trending videos, Viral Video, Viral Videos

ఉత్తమ కథలు