Home /News /trending /

FIT PEOPLE DRINK MORE ALCOHOL THAN THOSE WHO DO NOT EXERCISE SAYS STUDY GH VB

Fitness and Alcohol: ఫిట్‌గా ఉన్నవారే ఎక్కువగా తాగుతారట.. ఆ పరిశోధనలో ఏం తేలిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Fitness and Alcohol: మద్యానికి బానిసైన వారిని సరైన మార్గంలో పెట్టి, తాగుడు మానిపించేందుకు ఫిట్‌నెస్‌ అవసరాన్ని వారికి తెలియజేయాలని పరిశోధకులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఫిట్ గా ఉండేవారు ఆల్కహాల్ తక్కువగా తీసుకుంటారని వివరించేందుకు ట్రై చేశారు.

ఇంకా చదవండి ...
ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టిపెట్టేవారు ఆల్కహాల్‌కు దూరంగా ఉంటారనే భావన మనలో ఉంది. అందుకే తాగుడుకు బానిసైన వారి దృష్టిని ఫిట్‌నెస్‌పైకి మళ్లిస్తే, వారు ఆల్కహాల్‌ మానేస్తారని భావించారు అమెరికాలోని టెక్సాస్ పరిశోధకులు. అయితే బాగా ఫిట్‌గా ఉండేవారే ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకుంటున్నట్లు వారు గుర్తించారు. దీంతో ఆశ్చర్యపోవడం పరిశోధకుల వంతైంది.

వివరాల్లోకి వెళ్తే.. మద్యానికి బానిసైన వారిని సరైన మార్గంలో పెట్టి, తాగుడు మానిపించేందుకు ఫిట్‌నెస్‌ అవసరాన్ని వారికి తెలియజేయాలని పరిశోధకులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఫిట్ గా ఉండేవారు ఆల్కహాల్ తక్కువగా తీసుకుంటారని వివరించేందుకు ట్రై చేశారు. దీనిపై చేపట్టిన పరిశోధనల్లో.. శారీరక శ్రమ లేని వారితో పోలిస్తే ఫిట్ గా ఉన్న వ్యక్తులే అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వారిని ఆశ్చర్యపరిచింది.

Child Policy: జనాభా నియంత్రణపై యూటర్న్.. దంపతులకు బేబీ లోన్లు.. ఎక్కువ మందిని కంటే పన్ను రాయితీ..


టెక్సాస్, డల్లాస్‌లోని కూపర్ సెంటర్ లాంగిట్యూడినల్ స్టడీస్ సంస్థకు చెందిన పరిశోధకులు సుమారు 38 వేల మంది ఆరోగ్యకరమైన వ్యక్తులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వీరిలో 20 నుంచి 86 ఏళ్ల మధ్య వయసున్న వివిధ రకాల వ్యక్తులు ఉన్నారు. ఈ ఫలితాల్లో వ్యాయామం లాంటి మంచి అలవాటున్న వ్యక్తులు అనారోగ్యాన్ని కలిగించే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ సైకలాజికల్ సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు లైసెన్సింగ్ ఎఫెక్ట్‌గా అభివర్ణించారు. ఈ అధ్యయనాన్ని మెడికల్ అండ్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఎక్స్ ర్సైజ్ అనే జర్నల్‌లో ప్రచురించారు.

Copper Box: అది కేవలం రాగి పెట్టె అనుకుంటే పొరపాటే.. తెరిచిచూస్తే.. మతి పోవాల్సిందే..! వివరాలిలా..


అధ్యయనం ఫలితం ప్రకారం శారీరక శ్రమ లేనివారితో పోలిస్తే ఎక్కువ ఫిట్‌నెస్‌ కలిగిన వ్యక్తులు దాదాపు 1.4 నుంచి 1.6 రెట్లు అధికంగా ఆల్కహాల్ తీసుకున్నట్లు తేలింది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తల బృందం మీడియా వేదికగా బహిరంగ పరిచింది. ఈ విధంగా విరుద్ధ ఫలితాలు రావడం తమను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. ఫిట్ గా ఉంటే మద్యం తీసుకునే శాతం తగ్గుతుందని తాము భావించామని, అయితే తమ అభిప్రాయం తప్పని తేలిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై మరింత విచారణ చేయాల్సి ఉందని వెల్లడించారు.

Tourist Places: 2022లో టూర్లకు వెళ్లాలనుకుంటున్నారా..? భారత్‌లో ఉన్న టాప్-10 బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే..


కూపర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, అధ్యయన సహా రచయిత కీర షూవెల్ కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. కొన్నిసార్లు ఆరోగ్యకరమైన ప్రవర్తనలు ఎల్లప్పుడూ సరైన క్రమంలో ఉండకపోవచ్చని, పేషెంట్-డాక్టర్ ఎన్ కౌంటర్ ప్రతిసారి ఆరోగ్యకరమైన ప్రవర్తనతోనే సంబంధాన్ని కలిగి ఉండాలని స్పష్టం చేశారు.

ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎలా ఎర్పరచుకోవాలనే విషయంపై రోగులతో కలిసి హెల్త్ ప్రొఫెషనల్స్ మాట్లాడేందుకు ఆ స్టడీ ఉపయోగపడనుంది. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా తోడ్పాటుకు ప్రయత్నించింది. అంతేకాకుండా రోగుల తమ ఫిజికల్ యాక్టివిటిని పెంచుకునేందుకు ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించాలని సూచించింది.
Published by:Veera Babu
First published:

Tags: Alcohol, Fitness

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు