హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Schoolgirls Fight : విద్యార్థినులా,వీధి రౌడీలా..బస్టాండ్ లో జుట్టు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టుకున్నారు

Schoolgirls Fight : విద్యార్థినులా,వీధి రౌడీలా..బస్టాండ్ లో జుట్టు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టుకున్నారు

బస్టాండ్ లో కొట్టుకున్న విద్యార్థినులు

బస్టాండ్ లో కొట్టుకున్న విద్యార్థినులు

Quarrel among schoolgirls turns violent : విద్యార్థులు దేశ భవిష్యత్తుకు ఆశా దీపాలని అంటారు. కానీ ఇటీవల నెట్టింట చక్కర్లు కొడుతున్న కొన్ని వీడియోలో చూస్తుంటే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయం కలగక మానదు.

Quarrel among schoolgirls turns violent :  విద్యార్థులు దేశ భవిష్యత్తుకు ఆశా దీపాలని అంటారు. కానీ ఇటీవల నెట్టింట చక్కర్లు కొడుతున్న కొన్ని వీడియోలో చూస్తుంటే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయం కలగక మానదు. ముఖ్యంగా విద్యార్థులు బస్సులో ఫుట్‌ బోర్డ్‌పై ప్రయాణించడం, టీచర్లపై దాడి చేయడం, గ్రూపులుగా ఏర్పడి గొడవలకు పాల్పడడం వంటి ఘటనలు తమిళనాడులో పెరుగుతున్నాయి. తాజాగా కొందరు విద్యార్థినులు బస్టాండ్‌ వద్ద కొట్టుకున్నారు. బస్టాండ్ ​లోనే విద్యార్థినులు జుట్టు పట్టుకుని పిడిగుద్దులు కురిపించుకున్నారు. అందరూ చూస్తుండగానే ఇదంతా జరిగింది. ఈ సంఘటన తమిళనాడు మధురైలోని పెరియార్​ బస్టాండ్​లో శనివారం సాయంత్రం 4 గంటలకు జరిగింది.

మధురైలోని ఒకే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల యొక్క రెండు మధ్య గత మూడు రోజులుగా గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం పాఠశాల ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు పెరియార్​ బస్టాండ్ విద్యార్థినులు చేరుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థినుల మధ్య వాగ్వాదం జరిగి పెద్ద గొడవకు దారితీసింది. దీంతో బస్టాండ్​ లోనే విద్యార్థినులు జుట్టు పట్టుకుని పిడిగుద్దులు కురిపించుకున్నారు. అయితే అక్కడున్నవారు వీరిని తప్పించడం మానేసి..చోద్యం చూస్తూ ఉండిపోయారు. బస్టాండ్​లో ఉన్న కొందరు వీడియో తీసి సోషల్​ మీడియాలో పెట్టగా ఈ దృశ్యాలు వైరల్​ గా మారాయి.

ALSO READ Shocking: ఒళ్లు గగుర్పొడిచే సంఘటన.. మహిళపై వంతుల వారిగా సాముహిక అత్యాచారం..

మరోవైపు,తమిళనాడులోనే రెండు రోజుల క్రితం కొందరు విద్యార్థులు బస్టాండ్‌ వద్ద కొట్టుకున్నారు. కోయంబత్తూరు సమీపంలోని ఒండిపుదూర్‌లోని బస్టాండ్‌లో ఈ ఘటన జరిగింది. పక్క గొడవ జరుగుతుండగానే మరి కొందరు జోక్యం చేసుకోవడంతో పెద్ద ఘర్షణకు దారి తీసింది. రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఇదంతా జరిగింది. విద్యార్థుల యూనిఫాం ఆధారంగా ప్రభుత్వ స్కూల్‌కు చెందినవారుగా గుర్తించారు. ఇక బుధవారం చెన్నైలోని కొత్త వాషర్‌మెన్‌పేట బస్టాండ్‌ వద్ద కాలేజీ విద్యార్థినుల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో మహిళా విద్యార్థులు జట్లు పట్టుకుని కొట్టుకున్నారు. వెంటనే అక్కడకు వచ్చిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. హెచ్చరించి వారిని వదిలేశారు.

First published:

Tags: School girl, Tamilnadu

ఉత్తమ కథలు