Video : వేటగాళ్లతో ఆటాడుకున్న చేప... చుక్కలు చూపించిందిగా...

చేపలు పట్టడమంటే మాటలా... చాకచక్యంగా వల వెయ్యాలి. జాగ్రత్తగా పట్టుకోవాలి. తేడా వస్తే... చేప తప్పించుకుంటుంది. అలాంటి ఓ భారీ చేపకోసం నానా తిప్పలు పడ్డారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 12, 2019, 9:54 AM IST
Video : వేటగాళ్లతో ఆటాడుకున్న చేప... చుక్కలు చూపించిందిగా...
భారీ చేప కోసం వేట (Image : Youtube - BlacktipH)
  • Share this:
వరల్డ్ ఆర్మ్ రెజ్లింగ్ చాంపియన్, మాజీ స్పెషల్ ఫోర్సెస్ అధికారి డెవన్ లార్రాట్... ఓ భారీ చేపను పట్టుకోవడానికి ఆపసోపాలు పడాల్సి వచ్చింది. ఆయనతోపాటూ... వరల్డ్ ఛాంపియన్ పవర్ లిఫ్టర్, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ లయనే నార్టన్,... ఫిట్‌నెస్ ఫ్రీక్, సోషల్ మీడియా సెలెబ్రిటీ జుజిముఫు... వీళ్లంతా కలిసి... ఓ భారీ చేపను పట్టుకోవాలని డిసైడయ్యారు. బోటులో బయల్దేరారు. అనుకున్నట్లే ఓ భారీ చేప వలకు తగిలింది. కానీ... దాన్ని పట్టుకోవడమే కష్టమైపోయింది. ఛాలెంజ్ ఏంటంటే నీటిలో దిగకుండా "మాన్‌స్టర్ గోలియత్" చేపను పట్టుకోవడమే. ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగ్ పర్సన్లు వాళ్లు... అందువల్ల వాళ్లకు చేప ఈజీగా లొంగిపోవాలి. అలాంటిది ఆ చేప... చూసుకుందాం రా నీ ప్రతాపమో... నా ప్రతాపమో అన్నట్లు... గిలగిలా కొట్టుకుంటూ... మొత్తం బోటునే తిరగేసేసేంత హంగామా చేసింది. చేపను పట్టడమేమోగానీ... చెమటలు పట్టేశాయి. అంతలా చుక్కలు చూపించింది. చివరకు చేపనైతే పట్టారుగానీ... దాని కంటే... రెజ్లింగ్‌లో తలపడటమే ఈజీ అని అనుకునేలా చేసిందా మొండి బండ చేప.


First published: August 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>