Alien Creatures : స‌ముద్రంలోనూ ఏలియ‌న్‌లు..! వేట‌గాడి వ‌ల‌లో వింత‌చేప‌లు!!.. మీరూ చూడండి..

వలకు చిక్కిన వింత చేప(Image credit : Intagram)

Alien Creatures : ఏలియ‌న్ల‌ను ఇప్ప‌టిదాకా గ్ర‌హాంత‌ర‌జీవులుగానే భావిస్తున్నాం. అయితే అవి స‌ముద్ర‌జ‌లాల్లోనూ ఉన్నాయా? అంటే ఉన్నాయోమోన‌నే నుమానం క‌లిగిస్తున్నాయికొన్ని జీవులు. ముఖ్యంగా కొన్ని చేప‌లు ఏలియ‌న్ త‌ర‌హాలో ఉండ‌టంఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:

ఏలియ‌న్ల‌ను ఇప్ప‌టిదాకా గ్ర‌హాంత‌ర‌జీవులుగానే భావిస్తున్నాం. అయితే అవి స‌ముద్ర‌జ‌లాల్లోనూ ఉన్నాయా? అంటే ఉన్నాయోమోన‌నే అనుమానం క‌లిగిస్తున్నాయికొన్ని జీవులు. ముఖ్యంగా కొన్ని చేప‌లు ఏలియ‌న్ త‌ర‌హాలో ఉండ‌టంఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. స‌హ‌జంగా స‌ముద్రంలో మ‌న‌కు తెలియ‌ని అనేక‌ర‌కాల జీవులు ఉంటాయి. చేప‌లు కూడా ర‌క‌ర‌కాల‌వి ఉంటాయి. కొన్ని భ‌యంక‌రంగానూ, మ‌రికొన్ని త‌మాషాగానూ ఉంటాయి. అప్ప‌డప్పుడు అవి వ‌ల‌ల‌కు చిక్కి మ‌న కంట‌ప‌డుతుంటాయి. ఇలా ఏలియ‌న్ పోలిన ఓ చేప ర‌ష్యాలో మ‌త్స్య‌కారుడి వ‌ల‌లో చిక్క‌డం సంచ‌ల‌నంగా మారింది. అచ్చం ఏలియ‌న్ పోలిక‌ల‌తో క‌నిపిస్తున్న ఈ చేప నెటిజ‌న్ల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ర‌ష్యా ఉత్త‌ర‌తీరంలోని బారెంట్స్ స‌ముద్రంలో ఫెడ‌ర్టోత్స‌వ్ అనే మత్సకారుడికిఈ చేప చిక్కింది. అత‌డు దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్ప‌డది నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. ఈ చేపను చూసిన కొంతమంది నెటిజన్లు.. ‘స‌ముద్రంలోనూ ఏలియ‌న్ త‌ర‌హా జీవులున్నాయ‌న్న‌మాట’ అనికామెంట్లు పెడుతున్నారు.


ఫెడ‌ర్టోత్స‌వ్ వ‌ల‌కు ఇలా వింత‌చేప‌లు చిక్క‌డం ఇదే మొద‌టి సారి కాదు. ఇలాంటి అరుదైన సంద‌ర్భాలు అతి వేట‌లో ఎన్నో ఉన్నాయి.ర‌ష్యాకు చెందిన ఈ మ‌త్స్య‌కారుడు స‌ముద్రంలో దాదాపు 3వేల అడుగుల‌కుపైగా లోతులో చేప‌ల‌ను వేటాడ‌గలడు. అందుకే అత‌ని వ‌ల‌కు అసాధార‌ణ‌మైన‌, అద్భుత‌మైన చేప‌లు చిక్కుతుంటాయి. అత‌ను వాటిని ఫోటోలుగా తీసి సామాజిక మాధ్య‌మాల‌లో షేర్ చేస్తాడు.ఇత‌ను సాధార‌ణంగా కాడ్, హాడాక్ మాకేరెల్ల లాంటి సాధార‌ణ చేప‌ల ర‌కాలు ప‌ట్టుకుంటాడు. ఈ ప్ర‌య‌త్నంలోనే ఏలియన్​ను పోలిన చేపలు చిక్కాయి.









కొన్నిసార్లు చేప‌ల‌ను ప‌ట్ట‌డానికి దాదాపు మూడువేలఅడుగుల‌లోతులో వ‌ల వేస్తుంటాడు. ఇలా ఒంటిక‌న్ను చేప‌, దెయ్యం సొర‌చేప‌లు, గ‌డ్డ‌మున్న స‌ముద్ర దెయ్యం, అంగ్ల‌ర్ లాంటి వింత చేప‌లు అత‌ని వ‌ల‌కు చిక్కిన సంద‌ర్భాలు ఉన్నాయి. అతను వాటిని త‌న‌ కెమెరాలో బంధించ‌డం అల‌వాటుచేసుకున్నాడు. త‌న ఊహ‌ల‌కు అతీత‌మైన జీవులు స‌ముద్రంలో ఉన్నాయ‌నే విష‌యం అర్థమ‌య్యాక ఫెడ‌ర్టోత్స‌వ్ వాటిని ఫోటోలు తీయ‌డం ప్రారంభించి సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు. నెటిజ‌న్ల నుంచి పెద్ద ఎత్తున అప్లాజ్ రావ‌డం కూడా ఫెడ‌ర్టోత్స‌వ్‌కు ఉత్సాహాన్నిస్తోంది.కొన్నిసార్లు అత‌ను ప‌ట్ట‌కునే చేప‌లు చాలా భ‌యానకంగా క‌నిపిస్తాయి."అన్ని రకాల చేపలు తమదైన రీతిలో అందంగా ఉన్నాయి. అవి 'భయానకంగా' లేదా 'అగ్లీ'గా ఉన్నాయని నేను చెప్పలేను. ప్రజలు అసాధారణమైన సముద్ర జీవుల పట్ల చాలా ఆసక్తి కలిగి ఉన్నారు." అని ఫెడ‌ర్టోత్స‌వ్ చెప్పిన‌ట్టు డైలీ స్టార్ పేర్కొంది.నిజానికి నేను వేట‌కు వెళ్ళిన‌ప్పుడ‌ల్లా ఏదో ఒక అసాధార‌ణ‌మైన చేప‌ను తీసుకువ‌స్తాన‌ని ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతుంటారు. కానీ ఇది అరుదుగా మాత్ర‌మే జ‌రుగుతుందంటున్నాడుఫెడ‌ర్టోత్స‌వ్‌.
Published by:Veera Babu
First published: