FISH RAIN WHY THE SKY IS RAINING FISH IN SAN FRANCISCO AMERICA HERE IS THE REAL REASON BEHIND THIS SK
Fish Rain: ఆకాశం నుంచి చేపల వర్షం.. మీ ప్రాంతంలో కూడా పడొచ్చు.. దీని వెనక అసలు కథ ఇదే
ప్రతీకాత్మక చిత్రం
Reason behind fish rain: నేషనల్ జియోగ్రాఫిక్ నివేదిక ప్రకారం... ఆకాశం నుంచి చేపలు, కప్పల వర్షం పడడం శాస్త్రీయంగా సాధ్యమే. ఇదేదే వింత కాదు. తప్పుడు ప్రచారం అంతకన్నా కాదు. నిజంగానే ఇలాంటివి జరుగుతుంటాయి.
ఈ ప్రపంచంలో అప్పుడప్పుడూ వింత ఘటనలు జరుగుతుంటాయి. వాటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేయడం తప్ప.. మనకేమీ అర్థం కాదు. దాని వెనక ఉన్న మిస్టరీ ఏంటో తెలియదు. ఇటీవల అమెరికాలో కూడా ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. శాన్ఫ్రాన్సిస్కోలోని (San francisco Fish rain) పలు ప్రాంతాల్లో చేపల వర్షం పడింది. ఆకాశం నుంచి పడుతున్న చేపలను చూసి... అక్కడి ప్రజలు నోరెళ్లపెడుతున్నారు. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో చాలా చోట్ల ఇటీవల చేపల వర్షం కురిసింది. ఉరుములతో కూడిన వర్షంపడే (Fish Rain) సమయంలో.. ఇళ్ల పైకప్పులపై ఆంకోవీ అనే చిన్న చేపలు ఎక్కువగా కనిపించాయి. ఇవి సాధారణంగా సముద్రపు నీటిలో కనిపించే చేపలు. ఐతే కొన్ని రోజులుగా శాన్ఫ్రాన్సిస్కోలోని ఇళ్ల పైకప్పులు, తోటల్లో పడుతున్నాయి. అప్పుడప్పుడు కార్లపైనా కనిపిస్తున్నాయి. వాటిని చూసి అక్కడి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. సముద్రంలో ఉండే చేపలు.. ఇక్కడికి ఎలా వచ్చాయని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలో తుఫాను సమయంలో లేదంటే బాగా వర్షం పడుతున్న సమయంలో... అప్పుడప్పుడు ఆకాశం నుంచి చేపలు పడుతుంటాయి. వడగళ్ల పాటు చేపలు, కప్పలు భూమిపై కురుస్తుంటాయి. ఈసారి శాన్ఫ్రాన్సిస్కోలో పడ్డాయి. సీగల్, పెలికాన్లు వంటి కొన్ని పెద్ద పక్షులు దీనికి కారణమని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. శాన్ ఫ్రాన్సిస్కో సముద్ర ప్రాంతం కాబట్టి ఇక్కడ చేపల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. సీగల్స్ , పెలికాన్ అనే పక్షులు వీటిని తింటాయి. చేపలను తినేందుకు పెద్ద మొత్తంలో ఈ పక్షలు కూడా సముద్రతీరానికి వస్తుంటాయి. సముద్రంలో ఉండే చేపలను వేటాడి తింటాయి. SFGate ప్రకారం.. ఈ పక్షులకు పెద్ద మొత్తంలో చేపలు లభ్యమైనప్పుడు... కొత్త చేపలను పట్టుకునే ప్రయత్నంలో... పాత చేపలను ఈ పక్షులను వదిలించుకుంటాయి. వేరొక ప్రాంతంలో వాటిని పడేస్తాయి. అలా భూభాగంపై అప్పుడు చేపలు కనిపిస్తుంటాయి. చేపల వర్షానికి ఇది కూడా ఒక కారణం. కానీ ఇదే ప్రధానమైనది కాదు. చేపల వర్షం కూడా నిజంగానే కురుస్తుంది. అందువల్లే అప్పుడప్పుడూ పంట పొలాల్లో చేపలు పడుతుంటాయి.
నేషనల్ జియోగ్రాఫిక్ నివేదిక ప్రకారం... ఆకాశం నుంచి చేపలు, కప్పల వర్షం పడడం శాస్త్రీయంగా సాధ్యమే. ఇదేదే వింత కాదు. తప్పుడు ప్రచారం అంతకన్నా కాదు. నిజంగానే ఇలాంటివి జరుగుతుంటాయి. అమెరికాలో మాత్రమే కాదు...మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వార్తలను విన్నాం. చేపల వర్షం కురవడాన్ని టీవీల్లో చూశాం. ఆకాశం నుంచి ఇలాంటి వర్షం పడే ప్రక్రియను.. శాస్త్రీయ పరిభాషలో వాటర్ స్ప్రౌట్స్ అని పిలుస్తారు. వాస్తవానికి ఇది ఒక రకమైన సుడిగాలి. ఇది చెరువు, సరస్సులు వంటి నీటి వనరుల్లో కొంత భాగంలో ఏర్పడుతుంది. నదులు, సరస్సులపై సుడిగాలి ఏర్పడినప్పుడు... అది నీటిలో ఉన్న వస్తువులను తనలోకి లాక్కుంటుంది. అప్పుడు కాస్త తక్కువ బరువున్న చేపలు, కప్పలు సుడిగాలిలోకి వెళ్లిపోతాయి. కేవలం నీటి వనరుల మాత్రమే కాదు.. భూమిపై సుడిగాలులు ఏర్పడినా... అక్కడుండే వస్తువులు, చిన్న చిన్న జీవులను సుడిగాలి తనలోకి లాగేస్తుంది. తుఫాన్ వేగం క్రమంగా తగ్గినప్పుడు ఆ వస్తువులు, జీవులు మళ్లీ నేలపై పడుతాయి. చేపల వర్షం వెనక ఉన్న అసలు కథ ఇదన్న మాట.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.