ఆఫర్స్ అంటే అందరికీ ఇష్టమే. తక్కువ ధరకే వస్తువులు దొరుకుతున్నాయంటే ఎగబడిమరీ కొంటారు. ఎంత దూరమైనా వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. సాధారణంగా కొత్త షాప్‌లు పెట్టినప్పుడు.. ఇలాంటి ఆఫర్లు పెడుతుంటారు. తమ షాప్ గురించి అందరికీ తెలియాలని.. ప్రచారం కోసం ఇలా చేస్తుంటారు. రూపాయికే చికెన్ బిర్యానీ.. 50 రూపాయలకే షర్ట్.. 1000కే ఫోన్.. ఇలాంటి ఆఫర్లను ఎన్నో చూశాం. వాటిని కొనేందుకు జనాలు పెద్ద ఎత్తున ఎగబడిన ఘటనలు టీవీల్లో చూశాం. క్షణాల్లోనే స్టాక్ అయిపోతుంది.. ఆ జనాలతో తొక్కిసలాట కూడా జరిగిన సందర్భాల గురించి చాలసార్లు విన్నాం. తాజాగా మలేషియాలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. రెండు రూపాయలకే కిలో చేపలు.. అని ఓ సూపర్ మార్కెట్ పెట్టడంతో.. కస్టమర్లు ఎగబడ్డారు. గుంపులు గుంపులుగా లోపలికి చొచ్చుకెళ్లారు. ఆ చేపలను దక్కించుకునేందకు కొట్టుకున్నంత పనిచేశారు.
Corona Alert:వామ్మో మళ్లీ కోరలు చాస్తోంది..చైనాలో కరోనా విజృంభణ
ఇటీవల మలేషియాలోని కెలాంతన్‌లో ఓ కొత్త సూపర్ మార్కెట్ ప్రారంభమయింది. ప్రారంభ ఆఫర్ కింద పలు వస్తువులపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించారు. ఆ జాబితాలో చేపలు కూడా ఉన్నాయి. మన కరెన్సీలో రెండు రూపాయలకే కిలో చేపలు అని ఆఫర్ పెట్టారు. దాని గురించి పట్టణ ప్రజలందరికీ తెలిసింది. సూపర్ మార్కెట్ ఎప్పుడు తెరుస్తారా? అని వందలాది మంది జనం ఎదురుచూశారు. ఉదయం తెరవగానే.. కస్టమర్లంతా ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చారు. నేరుగా ఫిష్ సెక్షన్‌లోకి వెళ్లి.. పోటీ పడి మరీ చేపలను తీసుకున్నారు. మళ్లీ ఇలాంటి ఆఫర్ రాదని...అందిన కాడికి చేపలను బ్యాగుల్లో వేసుకున్నారు. సంచులకు సంచులు నింపుకున్నారు. ఒకరి చేతుల్లోంచి మరొకరు లాక్కోవడంతో గొడవలు కూడా జరిగాయి. చేపల కోసం కొందరైతే కొట్టుకున్నారు.
శోభనం గదిలో వధూవరులు.. అంతలోనే పోలీసుల ఎంట్రీ.. గోడ దూకి భర్త పరార్
చేపల ఆఫర్ వల్ల సూపర్ మార్కెట్లో రచ్చ రచ్చ జరిగింది. కేవలం 10 నిమిషాల్లో చేపలన్నీ అమ్ముడపోయాయి. ఒక్కటి కూడా మిగల్లేదు. కొందరు సంచులకు సంచులు నింపుకెళ్తే.. మరికొందరికి మాత్రం ఒక్కటి కూడా దొరకలేదు. వారంతా నిరాశగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. జనాల ఎగబడడం చూసి.. సూపర్ మార్కెట్ నిర్వాహకులు ఆఫర్‌ను నిలిపివేశారు. మళ్లీ ఇలాంటి ఆఫర్ పెట్టాలంటేనే భయపడుతున్నారు. బొరాక్ డైలీ అనే ఫేస్‌బుక్ పేజీ నిర్వాహకులు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
దానిపై నెటిజన్లు ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. ఆఫర్ ఉందని..మరీ ఇంతలా కక్కుర్తి పడాలా..? వామ్మో ఏంటీ జనాలు అని కొందరు కామెంట్ చేశారు. ఎక్కువ చేపలు దక్కిన వారు ఇవాళ పండగ చేసుకుంటారు అని మరో నెటిజన్ సరదాగా అభిప్రాయపడ్డాడు. మరికొంత మంది మాత్రం కరోనా గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటి వల్లే కరోనా విజృంభించేది.. అని విమర్శించారు. ఒక్కరు కూడా భౌతిక దూరం పాటించలేదని.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముందుగా సూపర్ మార్కెట్ నిర్వాహకులపై కేసు పెట్టాలని.. ఆఫర్లను ప్రకటించి.. జనాలు గుమిగూడేలా చేస్తున్నారని.. పలువురు నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: International news, Malaysia, Trending video, Viral Video