నగరంలో రోబో రెస్టారెంట్... ఆర్డర్ చేస్తే భోజనం తెచ్చే చిట్టీ ‘అమీజాక్సన్’...

నగరంలో తొలి రోబో రెస్టారెంట్ ఏర్పాటు... ఒక్కో ‘బేరర్ రోబో’ని రూ. 5 లక్షలు ఖర్చు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 9, 2019, 7:22 PM IST
నగరంలో రోబో రెస్టారెంట్... ఆర్డర్ చేస్తే భోజనం తెచ్చే చిట్టీ ‘అమీజాక్సన్’...
రెస్టారెంట్‌లో రోబో
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 9, 2019, 7:22 PM IST
‘రోబో’ సినిమాలో ‘హాలో... ఐ యామ్ చిట్టీ... డేటా 1 జెటా బైట్...’ అంటూ చిట్టీ పలికే మాటలు చూసి ఆశ్చర్యపోయాం. జపాన్, అమెరికా లాంటి ఫుల్లీ డెవలప్డ్ దేశాల్లో అయితే ఇలాంటి రోబోలు ఉంటాయోమో గానీ... ఇక్కడ వాటిని చూడాలంటే కూడా కష్టమే అనే చాలామందిలో ఉంటుంది. అయితే ఇప్పుడు రోబోని చూడాలంటే విదేశాలకే వెళ్లాల్సిన అవసరం లేదు. మొన్న చెన్నైకి వచ్చిన రోబో రెస్టారెంట్... ఇప్పుడు నగరంలో కూడా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని అల్కాజర్ మాల్‌లో ‘రోబో రెస్టారెంట్’ ప్రారంభమైంది. ఈ రోబోటిక్ రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే... రోబోలే వచ్చి ఫుడ్ వడ్డిస్తాయి. ఇవి ఆడ రోబోలు అని తెలిసేందుకు వీలుగా వీటి మెడలకు చీరలను కూడా చుట్టారు రెస్టారెంట్ నిర్వాహకులు. నిజానికి చీర కడదామనే భావించినా... రోబోలు నడిచేందుకు అడ్డుగా పడుతుండడంతో వాటిపైన శాలువాలా వేశారు.

ఇప్పటికే పొరుగురాష్ట్రం తమిళనాడు రాజధాని చెన్నై, కోయంబత్తూర్‌లో రెండు రోబో రెస్టారెంట్స్ ఉన్నాయి. అవి సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పుడు హైటెక్ సిటీలో రోబో రెస్టారెంట్ ఏర్పాటుచేశారు ముగ్గురు యువకులు. ప్రసిద్ సేతియా, మణికంఠ గౌడ్, మణికంఠ యాదవ్ అనే ముగ్గురు స్నేహితులు కలిసి నగరంలో ఈ తొలి రోబో రెస్టారెంట్ ఏర్పాటుచేశారు. ఇందులో ఉన్న ఒక్కో ‘బేరర్ రోబో’ని రూ. 5 లక్షలు ఖర్చు బెట్టి తీసుకొచ్చారు. ఈ రోబో రెస్టారెంట్‌కు వచ్చే రియాక్షన్‌ను బట్టి... హైటెక్ టెక్నాలజీతో రూపొందిన రోబోలను తీసుకువస్తామని చెబుతున్నారు ఈ రెస్టారెంట్ నిర్వాహకులు. ‘రోబో రెస్టారెంట్’లో చిట్టీ... ఆడరోబోలు కాబట్టి ‘2.0’లో అమీ జాక్సన్ వచ్చి వడ్డించే భోజనం రుచి చూసేందుకు నగరవాసులు క్యూ కడుతున్నారు...

వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...

హైదరాబాద్‌లో రోబో రెస్టారెంట్... 

First published: February 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...