హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

మోదీ సొంత రాష్ట్రంలో Monkeypox కలకలం.. అప్రమత్తమైన అధికారులు..

మోదీ సొంత రాష్ట్రంలో Monkeypox కలకలం.. అప్రమత్తమైన అధికారులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gujarat: వ్యక్తిలో మంకీపాక్స్ సింప్టమ్స్ కన్పించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే అతడిని ప్రత్యేకంగా ఐసోలేషన్ కు తరలించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Gujarat, India

దేశంలో మంకీపాక్స్ వైరస్ (Monkeypox) క్రమంగా విస్తరిస్తుంది. రోజు రోజుకు కేసులు సంఖ్య పెరుగుతుండటం తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటి దాక కేరళ, ఢిల్లీలో కరోనా కేసులు వెలుగులోనికి వచ్చాయి. తాజాగా, మరో రాష్ట్రం ఆ జాబితాలో వచ్చిచేరిందా అని అధికారులు ఆందోళన చెందుతున్నారు. పీఎం నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో (Gujarat)  ఒక వ్యక్తికి మంకీపాక్స్ సింప్టమ్స్ కన్పించాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జామ్ నగర్ లోని 29 ఏళ్లవ్యక్తికి మంకీపాక్స్ సింప్టమ్స్ ఉండటంతో అధికారులు సీరియస్ గా తీసుకున్నారు.

వెంటనే సదరు వ్యక్తిని ఐసోలేషన్ కు తరలించారు. అతని దగ్గర నుంచి శాంపుల్స్ ను తీసుకుని, ల్యాబ్ కు తరలించారు. అతను విదేశాలకు ప్రయాణం చేయలేదని అధికారులు గుర్తించారు. అయినప్పటికీ.. శరీరంలో తీవ్రమైన జ్వరం, దద్దుర్ల వంటి కోతుల వ్యాధి లక్షణాలను కన్పించాయి. అనుమానాస్పద మంకీపాక్స్ రోగి రక్త నమూనాలను పరీక్షల కోసం అహ్మదాబాద్ బీజే మెడికల్ కాలేజీ ల్యాబొరేటరీకి పంపినట్లు ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి మనోజ్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటివరకు, భారతదేశం తొమ్మిది మంకీపాక్స్ కేసులు వెలుగులోనికి వచ్చాయి. అదే విధంగా.. మంకీపాక్స్ తో ఒక రోగి వ్యాధితో మరణించాడు.

మంకీపాక్స్ గురించి

మంకీపాక్స్ అనేది ఒక వైరల్ జూనోసిస్ (జంతువుల నుండి మానవులకు సంక్రమించే వైరస్) మశూచి రోగులలో గతంలో కనిపించిన లక్షణాలను పోలి ఉంటుంది. అయితే ఇది వైద్యపరంగా తక్కువ తీవ్రతతో ఉంటుంది. ఇది సాధారణంగా రెండు నుండి నాలుగు వారాల పాటు కొనసాగే లక్షణాలతో స్వీయ-పరిమిత వ్యాధి. ఇన్ఫెక్షన్ సాధారణంగా జ్వరం, తలనొప్పి, దద్దుర్లు, గొంతు నొప్పి, దగ్గు మరియు వాపు శోషరస కణుపులతో కనిపిస్తుంది.

ఇదిలా ఉండగా దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఇది కొత్త వ్యాధి కాదని తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని విధాలుగా నిఘా ఉంచామని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో పొందిన అనుభవాలను స్వీకరించడం ద్వారా మంకీపాక్స్ విషయంలో ముందుకు సాగుతున్నామని అన్నారు. మంకీపాక్స్ వైరస్ కరోనా అంత వేగంగా వ్యాపించదని, ఎందుకంటే ఇది సన్నిహితంగా ఉన్నప్పుడు మాత్రమే వ్యాపిస్తుందని మాండవియ చెప్పారు. . మంకీపాక్స్ వ్యాధి భారత్‌లోనూ, ప్రపంచంలోనూ కొత్తది కాదని కేంద్రమంత్రి అన్నారు.

1970 నుండి ప్రపంచంలోని అనేక కేసులు ఆఫ్రికాలో కనిపించాయి. ప్రపంచంలో మంకీపాక్స్ కేసులు తెరపైకి రావడం ప్రారంభించినప్పుడు.. భారత్ దీనిపై ఫోకస్ చేసింది. కేరళలో మొదటి కేసు నమోదు కావడానికి ముందే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేశామని మన్సుఖ్ మాండవియ తెలిపారు. ప్రయాణికుల స్క్రీనింగ్ రిపోర్టు కూడా మాకు పంపాలని అంతర్జాతీయంగా అన్ని ప్రభుత్వాలకు లేఖ రాశామని చెప్పుకొచ్చారు.

First published:

Tags: Gujarat, Monkeypox, Pm modi

ఉత్తమ కథలు