హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Bird flu: చైనాలో బర్డ్‌ఫ్లూ బారిన పడిన వ్యక్తి.. ప్రపంచంలో మొదటి కేసుగా నిర్ధారణ..

Bird flu: చైనాలో బర్డ్‌ఫ్లూ బారిన పడిన వ్యక్తి.. ప్రపంచంలో మొదటి కేసుగా నిర్ధారణ..

మళ్లీ బర్డ్ ఫ్లూ... సెకండ్ వేవ్

మళ్లీ బర్డ్ ఫ్లూ... సెకండ్ వేవ్

ప్రపంచంలో మొదటిసారి H10N3 స్ట్రెయిన్ బర్డ్ ఫ్లూ మనుషులకు సోకిందని అధికారులు ధ్రువీకరించారు. జెంజియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల వ్యక్తి ఈ వైరస్ బారిన పడ్డాడు.

కరోనా వైరస్‌ ఎక్కడ పుట్టిందనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌లోనే దీన్ని తయారు చేశారనే వాదనలకు ఆధారాలు లభిస్తున్న నేపథ్యంలో.. ఆ దేశంలో మనుషులకు సోకిన మరో కొత్త వైరస్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో ఒక వ్యక్తి మొదటిసారి బర్డ్‌ఫ్లూ బారిన పడినట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ మంగళవారం తెలిపింది. ప్రపంచంలో మొదటిసారి H10N3 స్ట్రెయిన్ బర్డ్ ఫ్లూ మనుషులకు సోకిందని అధికారులు ధ్రువీకరించారు. జెంజియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల వ్యక్తి ఈ వైరస్ బారిన పడ్డాడు. ప్రస్తుతం రోగి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యాధికారులు తెలిపారు. అయితే పౌల్ట్రీ ఉత్పత్తుల నుంచి మనుషులకు సోకే అవకాశం ఉన్న ఈ కొత్త రకం బర్డ్ ఫ్లూ.. మరో మహమ్మారిలా మారే ప్రమాదం చాలా తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

బాధితుడికి H10N3 స్ట్రెయిన్‌ బర్డ్‌ ఫ్లూ సోకినట్లు మే 28న నిర్ధారణ అయింది. ఇంతకు ముందు ప్రపంచ దేశాల్లో ఎక్కడా ఈ వైరస్ మనుషులకు సోకలేదు. అయితే బాధితుడికి వైరస్ ఎలా సోకిందనే వివరాలను మాత్రం చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించడలేదు. H10N3 అనేది పౌల్ట్రీ పరిశ్రమలో వ్యాపించే వైరస్. ఇన్‌ఫెక్షన్ సోకిన కోళ్లు, ఇతర పక్షులకు దగ్గరగా ఉండే మనుషులకు ఇది వ్యాపించే అవకాశం ఉంది. కానీ దీని తీవ్రత మరీ ఎక్కువగా ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది పెద్ద ఎత్తున వ్యాప్తి చెందే ప్రమాదం చాలా తక్కువని విశ్లేషిస్తున్నారు.

అయితే చైనాలో మరో కొత్త వైరస్‌ బయట పడిందనే వార్త ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. దీనిపై మీమ్స్, జోక్స్‌తో హడావుడి చేస్తున్నారు నెటిజన్లు. ట్విట్టర్‌లో ఈ వార్తపై వస్తున్న కొత్త ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. కరోనా తరువాత మరో కొత్త వైరస్ వస్తుందనే భయంతో.. తనను తాను ఒక మహిళ పూడ్చి పెట్టుకుంటున్నట్లు ఒక మీమ్ తయారు చేశారు. ‘చాలు.. ఇక చాలు..’ అనే అర్థంతో రూపొందించిన ఫన్నీ మీమ్ వైరల్ అవుతోంది. ‘ఒక మహమ్మారి వ్యాపిస్తున్నప్పుడు.. మరో మహమ్మారి రావద్దని దేవుడు రూల్ పెట్టాలి’ అని ఒక వ్యక్తి ట్వీట్ చేశారు.

‘మీకు ఇంకా సరిపోలేదా’ అనే అర్థం వచ్చేలా చేసిన హిందీ ట్వీట్‌.. ఈ వార్త విని దెయ్యాలు పండగ చేసుకుంటున్నట్లు తెలిపే మీమ్.. ‘మీ దగ్గర ఇంకా ఎన్ని వైరస్‌లు ఉన్నాయి?’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాను అడుగుతున్నట్లు రూపొందించిన మీమ్‌.. వంటివి ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నాయి. వీటిని ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో సైతం షేర్ చేస్తూ, జోక్స్ పేలుస్తున్నారు నెటిజన్లు.

https://twitter.com/Mr_Stark_/status/1399648908154859520?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1399648908154859520%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.freepressjournal.in%2Fviral%2Fsaans-toh-lene-do-first-case-of-bird-flu-reported-in-china-twitterati-are-fed-up

https://twitter.com/shiivam_in/status/1399662113140842500?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1399662113140842500%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.freepressjournal.in%2Fviral%2Fsaans-toh-lene-do-first-case-of-bird-flu-reported-in-china-twitterati-are-fed-up

https://twitter.com/TheStenoBoii/status/1399660763992653825?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1399660763992653825%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.freepressjournal.in%2Fviral%2Fsaans-toh-lene-do-first-case-of-bird-flu-reported-in-china-twitterati-are-fed-up

https://twitter.com/RashfordTen/status/1399645764381515776?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1399645764381515776%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.freepressjournal.in%2Fviral%2Fsaans-toh-lene-do-first-case-of-bird-flu-reported-in-china-twitterati-are-fed-up

https://twitter.com/iamandy1987/status/1399662797240164356?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1399662797240164356%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.freepressjournal.in%2Fviral%2Fsaans-toh-lene-do-first-case-of-bird-flu-reported-in-china-twitterati-are-fed-up

చైనాలో ఇప్పటి వరకు వివిధ రకాల ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ జాతులు బయటపడ్డాయి. ఇవి మనుషులకు అరుదుగా సోకుతాయి. సాధారణంగా పౌల్ట్రీ పరిశ్రమల్లో పనిచేసేవారికి ఇవి వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. H5N8, H5N6 రకం బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్లు వివిధ రకాల పక్షులకు, పౌల్ట్రీల్లో పెంచే కోళ్లకు ప్రాణంతకంగా మారుతాయి. ఇవి మనుషులకు వ్యాపించే అవకాశాలు తక్కువే. అయినప్పటికీ.. మరో కొత్త రకం వైరస్ చైనాలో వెలుగు చూసిందనే వార్త మాత్రం క్షణాల్లో వైరల్ అయింది.

First published:

Tags: Bird Flu

ఉత్తమ కథలు