ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సాంప్రదాయం, ఒక్కో ఆచారం ఉంటుంది. అది భక్తితో చేసిన లేక విశ్వాసంతో చేసిన స్థానికులకు బాగానే ఉంటుంది కాని చూసే వాళ్లకే ఇంత వింత ఆచారం ఏమిటనే సందేహం వ్యక్తమవుతుంది. కర్నాటక(Karnataka)లో ఏటా జరిగే అగ్నికేళీ (Agni Keli)వేడుక కూడా ఇంచు మించు అలాగే అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ దేవరగట్టు బన్నీ ఉత్సవానికి(కర్రల సమరం)ఎంత చరిత్ర ఉందో కర్నాటక రాష్ట్రం మంగుళూరు సమీపంలోని కటిల్ శ్రీదుర్గాపరమేశ్వరి (Kateel Sri Durgaparameshwari) ఆలయంలో జరిగే తూటేదార (Thootedara)వేడుకకు అంతే ప్రాముఖ్యత కలిగి ఉంది. పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారాన్ని ఇప్పటికి భక్తులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ ఉత్సవాల వెనుక దాగివున్న చరిత్ర ఏమిటంటే అత్తూరు(Attoor), కోడెట్టూరు( Kodettoor)లో శతాబ్ధాల నాటి సంప్రదాయం ఇది. కటిల్ శ్రీదుర్గాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఏటా వార్షిక ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగానే దేవతామూర్తిని ప్రసన్నం చేసుకుంటూ నిప్పులు అంటించి ఉన్న తాటిచువ్వల(Burning palm)ను ఓ కట్టగా కట్టి వాటిని రెండు గ్రామాల ప్రజలు ఒకరిపై మరొకరు విసిరివేసుకుంటారు. పరమేశ్వరి అమ్మవారి ఆలయం ముందే ఈ వేడుక జరుగుతుంది. కర్నాటక భాషలో చెప్పాలంటే దీన్ని తూటేదార అని పిలుస్తారు. అన్నీ ప్రాంతాల భక్తులు మాత్రం అగ్నికేళీ అని అంటారు. ఇలా కాలుతున్న తాటి చువ్వలు కట్టిన కాగడాల్లో ఉన్న వాటిని విసిరి వేసుకోవడం వెనుక గొప్ప అర్ధం ఉందని భక్తులు, స్థానికులు, అత్తూరు, కోడెట్టూరు గ్రామానికి చెందిన ప్రజలు చెబుతుంటారు.
ఇదో టైపు బన్నీ ఉత్సవం..
ఇది కూడా ఓ దీపావళి వేడుకలా..అహ్లాదంగా, సంతోషాల మధ్య జరుగుతుంది. ఎలాంటి ఘర్షణలు, విద్వేషాలకు తావు లేకుండా ఒక్కొక్కరు మంటలు ఎగసిపడుతున్న తాటాకు చీపుర్లను ఐదు సార్లు విసిరివేయాలి. ఆ తర్వాత అది చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత భక్తులు తాళపత్రాన్ని అక్కడే వదిలి వెళ్లిపోవాలి. కలర్‌ఫుల్‌గా జరిగే ఈ ఉత్సవంలో ఎలాంటి ప్రమాదాలు, గాయాలు కాకుండా జాగ్రత్తగా వేడుకలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. అగ్నికేళి ఉత్సవం సమయంలో భక్తులు ఎవరూ ఒంటిపై షర్ట్‌లు, శాలువాలు, దుస్తులు ఉంచుకోరు. కేవలం కాషాయం రంగు పంచె క్టుకొని ఈ అగ్నికేళీలో పాల్గొంటారు.
#WATCH | Devotees hurled fire at each other as part of a fire ritual 'Thoothedhara' or ‘Agni Kheli’ to pay reverence to goddess Durga at Sri Durgaparameshwari temple in Kateel, Karnataka (22.04) pic.twitter.com/q4SHMFAGak
— ANI (@ANI) April 23, 2022
అగ్నికేళీ వెనుక గొప్ప అర్ధం..
ఇలా నిప్పుతో చెలగాటం ఆడటం ఏమి ఉత్సవమని స్థానికులను అడిగితే వాళ్లు దీని వెనుక దాగివున్న చరిత్రను చెబుతారు. అమ్మవారి దయ ఉండటం వల్లే ఎలాంటి దుష్టశక్తులు, గుంపులుగా వచ్చే మానవశక్తులను తాటాకు చప్పుళ్లుగా పోలుస్తారు. అందుకే తాటాకు చప్పుళ్లకు మేం భయపడము మాకు పరమేశ్వరి అమ్మవారి దయ, కృప, ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్పడానికే ఈతరహా ఉత్సవాలు నిర్వహిస్తున్నారని అక్కడి జనం చెబుతూ ఉంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hindu festivals, Karnataka