Video : యూట్యూబ్ ద్వారా బాతు పిల్లల్ని కాపాడారు... ఇదెలా జరిగిందంటే...

Viral News : ఒక్కోసారి ఎంతో కష్టమైన విషయాలు కూడా చిన్న ఐడియా ద్వారా తేలిగ్గా మారతాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఘటన.

Krishna Kumar N | news18-telugu
Updated: June 22, 2019, 7:12 AM IST
Video : యూట్యూబ్ ద్వారా బాతు పిల్లల్ని కాపాడారు... ఇదెలా జరిగిందంటే...
క్షేమంగా బయటపడిన బాతు పిల్లలు (Image : youtube/AP)
  • Share this:
అమెరికా... కొలరాడోలోని... లిటిల్‌టన్‌లో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ కాల్ వచ్చింది. అది ఇల్లు తగలబడుతోందని కాదు. బాతు పిల్లలు డ్రైనేజీలో పడిపోయాయని. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు వెళ్లారు. రోడ్డు పక్కన ఓ డ్రైనేజీలో ఐదు బాతు పిల్లలు పడిపోయాయి. వాటిలో కొన్ని అక్కడి డ్రైనేజీ గొట్టంలోకి వెళ్లిపోయాయి. వాటిని ఎలా కాపాడాలో అర్థంకాలేదు ఫైర్ సిబ్బందికి. అప్పుడే సిబ్బందిలో ఒకరికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. వెంటనే మొబైల్‌లో యూట్యూబ్ ఓపెన్ చేశాడు. అందులో... తల్లి బాతు పిల్లల్ని రమ్మని పిలిచే వీడియోని ప్లే చేశాడు. అంతే... ఆ వీడియోలో వాయిస్ విని... తమ తల్లి తమను పిలుస్తోందని భావించి... డ్రైనేజీలో ఉన్న ఐదు బాతు పిల్లలు బయటకు వచ్చాయి. అలా వాటిని కాపాడారు. వాటిని శుభ్రం చేసి... అక్కడికి దగ్గర్లోనే ఉన్న తల్లిబాతుకి అప్పగించారు. గ్రేట్ కదా.



ఇవి కూడా చదవండి :

Viral Video : పాటలు పాడుతున్న సీల్ చేపలు...

నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్... ఇక రెండు వారాలు వర్షాలే...వర్షాలు

టీడీపీని చరిత్రలో కలిపేస్తారా... బీజేపీ ప్లాన్ అదేనా?
First published: June 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading