హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Humaira Asghar: నేను ఎక్కడున్న మంటలు.. టిక్ టాక్ స్టార్ పై నెటిజన్ల ఫైర్..

Humaira Asghar: నేను ఎక్కడున్న మంటలు.. టిక్ టాక్ స్టార్ పై నెటిజన్ల ఫైర్..

టిక్ టాక్ స్టార్

టిక్ టాక్ స్టార్

Pakistan: పాకిస్థానీ టిక్ టాక్ స్టార్ కు నెట్టింట చేదు అనుభవం ఎదురైంది. ఆమెను నెటిజన్లు ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

కొంత మంది టిక్ టాక్ లు, ప్రాంక్ ల (Tiktok) పేరిట కొంత మంది అతిగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరు చేస్తున్న వీడియోలు సరదాగా, నవ్వుతెప్పిస్తుంటే మరికొందరు మాత్రం కాస్త ఎక్స్ ట్రాలు (Prank) చేస్తున్నారు. ప్రాంక్ ల పేరిట అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు కావాలని టిక్ టాక్, ప్రాంక్ లంటూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఎన్నో వీడియోలు వివాదాస్పదంగా మారాయి. కొన్ని చోట్ల ప్రాంక్ ల మూలంగా ప్రాణాలు కోల్పోయిన అనేక సంఘటనలు వార్తలో నిలిచాయి. అయితే, ప్రాంక్ పేరిట ఒక పాక్ స్టార్ చేసిన వీడియో  ప్రస్తుతం నెట్టింట ట్రోలింగ్ కు గురౌతుంది.


పూర్తి వివరాలు.. పాకిస్థాన్ కు (Pakistan) చెందిన హుమైరా అస్గర్ సిల్వర్ (Humaira Asghar) ఈ మధ్య కాలంలో ఒక ప్రాంక్ వీడియో తీశారు. దానిలో ఆమె అడవిలో నడుచుకుంటూ వస్తున్నట్లు ఆమె వెనుకాల మంటలు ఆమెను ఫాలో అవుతున్నట్లు సెట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త (tiktok video) వివాదాస్పదమైంది. ప్రస్తుతం మంటలు హీట్ ను పుట్టిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అడవులను కాల్చావా అంటూ కామెంట్ లు పెడుతున్నారు. ఆమెకు సోషల్ మీడియాలో లకలాది మంది ఫాలోవర్లు ఉన్నారు.

ప్రస్తుతం పాక్ లో 51 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఆమె ముందర నడుస్తుంటే మంటలు ఆమె వెనుకాల వచ్చేలా సెట్టింగ్ చేశారు. ప్రస్తుతం ఈ టీక్ టాక్ వీడియోను నెట్టింట తెగ వివాదస్పదంగా మారింది. కొందరు ఇలాంటి పిచ్చిపనులు మానుకోవాలని చెప్పారు. దీనిపై పర్యావరణ కార్యకర్తలు కూడా స్పందించారు. టిక్ స్టార్ వెనుకాల బకెట్ పట్టుకుని ఉండాలా అంటూ కామ్ంట్లు పెడుతున్నారు.

First published:

Tags: Pakistan, Tik tok, Viral Video

ఉత్తమ కథలు