రాంగోపాల్‌వర్మ-కేఏ పాల్..! ఈ కాంబినేషన్ వింటేనే ఎనలేని ఆసక్తి కలుగుతోంది కదూ..! ఇద్దరూ వెరైటీ పర్సనాలిటీలే..! ఒకరు ఫిలిం ఫైర్ బ్రాండ్ ఐతే..మరొకరు సోషల్ ఫైర్ బ్రాండ్..! వివాదాస్పద వ్యాఖ్యలు, అంతకు మించిన కాంట్రవర్సీ సినిమాలతో ఇండస్ట్రీలో సెగలు రేపుతారు ఆర్జీవీ. అమెరికా అధ్యక్షుడు నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారంటూ నమ్మలేని మాటలు చెబుతారు కేఏ పాల్. లక్ష్మీస్ ఎన్టీయార్ పేరుతో సినీ రాజకీయా వర్గాల్లో వర్మ ప్రకంపనలు రేపుతుంటే.. ఏపీకి కాబోయే సీఎం తానేనంటూ పాల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరూ ఇద్దరే..ఎవరికి ఎవరు తక్కువేం కాదు..! వేర్వేరు కేటగిరికి చెందిన వారైనా..ఒకే కోవ కిందకు వస్తారు. అలాంటి వీరిద్దరి వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. వర్మ తన కాళ్లు మొక్కాడంటూ ట్వీట్ చేయడం...వామ్మో నేనాపని చేయలేదని వర్మ కౌంటరివ్వడంతో...అంతా వీరిద్దరివైపే చూస్తున్నారు.
సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ముంబైలో కేఏ పాల్ని కలిశారట. ఆ సందర్భంగా ఆర్జీవీ తన కాళ్లు మొక్కాడంటూ కేఏ పాల్ ట్వీట్ చేశారు. ఆర్టీవీ..తన గురువు దాసరి కాళ్లు కూడ పట్టుకోలేదని..అలాంటిది తన పాదాలను తాకాడని పేర్కొన్నారు.
WOW! Humble RGV met me in Mumbai hotel shocked Jyoti & Vivek by touching my feet and told he never did it to his guru Dasari. When my people make me CM of AP In just 4 months we will prove the world we are the best, then the Nation. @RGVzoomin pic.twitter.com/b78u6e2gz6
— Dr KA Paul (@KAPaulOfficial) January 15, 2019
కేఏ పాల్ ట్వీట్ చూపి షాక్ తిన్న ఆర్జీవీ..ట్విటర్లో తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తాను పాల్ కాళ్లు ముట్టుకోలేదని..గట్టిగా పట్టుకొని వెనక్కి లాగుదామని మాత్రమే ప్రయత్నించానని సెటైర్ వేశాడు. పాల్ తల నేలకేసి కొట్టుకొంటే..అప్పుడైనా బుర్ర సెట్ అవుతుందని భావించినట్లు కామెడీ కౌంటరిచ్చారు.
ప్రభువా ! 🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) January 15, 2019
నేను పాల్ కాళ్ళు ముట్టుకోలేదు..జస్ట్ పట్టుకుని గట్టిగా లాగితే వెనక్కి పడి తల నేల కేసి కొట్టుకుని తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా ..కాని మీరు హర్ట్ అవుతారేమోనని వదిలేసా🙏🙏🙏 https://t.co/80akfXjZ2L
వర్మ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వీరిద్దరిది అద్భుతమైన కాంబినేషన్ అని ఒకరు ట్వీట్ చేస్తే..మీకు సరైన పోటీదారుడు దొరికాడంటూ మరొకరు అభిప్రాయపడ్డారు. కేఏ పాల్ కామెడీ పీక్‌లో ఉందంటూ ఇంకొకరు సెటైర్ వేస్తున్నారు. మొత్తంగా ఆన్లైన్లో ఇప్పుడు వీరిద్దరి గురించే ఫన్నీ ఫన్నీగా చర్చ నడుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ka paul, Ram Gopal Varma