Plastic Ban: రెండు కిలోల ప్లాస్టిక్ ఇస్తే.. కిలో బియ్యం ఇస్తారు..

మన దేశంలోనే కాదు.. ఫిలిప్పీన్స్‌లోనూ ప్లాస్టిక్ బ్యాన్ దిశగా జోరుగా అడుగులు పడుతున్నాయి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 1, 2019, 8:12 PM IST
Plastic Ban: రెండు కిలోల ప్లాస్టిక్ ఇస్తే.. కిలో బియ్యం ఇస్తారు..
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 1, 2019, 8:12 PM IST
స్వచ్ఛ భారత్.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టిన ఈ పథకం ఎందరో భారతీయుల్లో చలనం తీసుకొచ్చింది. ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ఆలోచలనను రేకెత్తించింది. ఆ బలంతో మోదీ మరో గొప్ప ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను పారదోలుదాం.. అంటూ పిలుపునిచ్చారు. గాంధీ కలలు కన్న స్వరాజ్యం సాకారం అయ్యేందుకు ఆయన జయంతి రోజునుంచే మనం గొప్ప సంకల్పానికి సిద్ధమవుదామని చెప్పారు. ప్లాస్టిక్‌ రేపర్లు, షీట్లు, క్యారీబ్యాగులు, వాటర్‌ బాటిళ్లు, స్ట్రాలు, ప్లాస్టిక్‌ చెంచాలు, ప్లేట్లు, టీ-జ్యూస్‌ కప్పులు, గ్లాసులు ఇలా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను బ్యాన్ చేద్దామని పిలుపునిచ్చారు. అయితే, మన దేశంలోనే కాదు.. ఫిలిప్పీన్స్‌లోనూ ప్లాస్టిక్ బ్యాన్ దిశగా జోరుగా అడుగులు పడుతున్నాయి.

ఎక్కడ ప్లాస్టిక్ కనిపించినా.. దాన్ని సేకరించి తమకు ఇస్తే దానికి ప్రతిఫలంగా బియ్యం ఇస్తామని ప్రకటించింది అక్కడి ఓ గ్రామపంచాయతీ. గ్రామవాసులు తెచ్చి ఇచ్చే ప్రతి 2 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలకుగాను.. కిలో బియ్యం ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ దెబ్బతో ఆ గ్రామంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలే కనిపించడం మానేశాయి.

First published: October 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...