Income Tax: గుడ్ న్యూస్...ఐటీ రిటర్నుల గడువు పెంపు..ఎప్పటివరకంటే?

పన్ను చెల్లించలేకపోతున్నారా... గుడ్ న్యూస్... ఇక టెన్షన్ అక్కర్లేదు...

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తాము అర్థం చేసుకున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పన్ను చెల్లింపులకు సంబంధించి కొత్త విషయం చెప్పింది.

  • Share this:
    ప్రపంచంతోపాటూ... దేశంలో కూడా కరోనా ఎంత తీవ్రంగా ఉందో... అందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో... పన్నులు చెల్లించడం, ITRలను ఫైలింక్ చెయ్యడం ఇవన్నీ తలనొప్పి వ్యవహారాలే. ముఖ్యంగా... ఇంట్లోంచీ బయటకు వెళ్తే... ఎవరి నుంచి కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి. అందువల్ల ఈ సంక్షోభ సమయంలో ఆదాయ పన్ను శాఖ (IT Dept.) పన్ను చెల్లింపుదారులకు ఓ మంచి విషయం చెప్పింది. ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) ఫైలింగ్‌ గడువును పెంచింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్‌ ఫైలింగుల గడువును 2020 నవంబర్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఐటీ శాఖ శనివారం తన ప్రకటనలో తెలిపింది. కాబట్టి పన్ను చెల్లింపుదారులు... నవంబర్ 30 వరకూ ఉన్న టైమును ఉపయోగించుకొని... ఆ లోగా వీలు చూసుకొని రిటర్న్ ఫైల్ చేసుకునే ఛాన్స్ ఉంది.


    నవంబర్ అంటే... మరో 4 నెలల సమయం. ఈ లోగా ఇండియాలో రికవరీ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి... కొత్తగా నమోదయ్యే కేసులు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే... అక్టోబర్ లేదా నవంబర్ టైమ్‌లో కరోనా తగ్గే ఛాన్స్ ఉంటుంది అనుకుంటే... అప్పుడే రిటర్న్ ఫైల్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఆగస్టులోనే వ్యాక్సిన్ వస్తే... అప్పడు ఇక కరోనా గోలే ఉండదు. ప్రస్తుతానికి మాత్రం ఊరట లభించింది అనుకోవచ్చు.
    Published by:Krishna Kumar N
    First published: