మాములుగా బస్సుల్లో, రైళ్లలో ప్రయాణికుల మధ్య జరగడం చూస్తుంటాం. ముఖ్యంగా ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న సమయాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం చాలా మందే చూసుంటారు. కానీ ఇద్దరు వ్యక్తులు విమానంలో గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకన్నారు. ఈ ఘటన జరిగింది అగ్రరాజ్యం అమెరికాలో. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రోజులన న్యూ ఓర్లీన్స్ నుంచి ఆస్టిన్ వెళ్తుండగా ఇద్దరు ప్రయాణికుల మధ్య ఈ గొడవ జరిగింది.
ఇందుకు సంబంధించిన వీడియో KXAN YouTube ఛానెల్‌లో షేర్ చేయబడింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇద్దరు ప్రయాణికులు.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పక్కన ఉన్నవారు చెబుతున్న వినిపించుకోకుండా కొట్టుకన్నారు. ఈ క్రమంలోనే ఇతర ప్రయాణికుల మీద కూడా పడిపోయారు. ఇది ఇతరులకు కూడా తీవ్ర ఇబ్బంది కలిగించింది. అయితే వారిని ఆపడానికి చూసినప్పటికీ.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. వారిద్దరు దాడి చేసుకోవడానికే మొగ్గు చూపారు. పక్కన ఉన్నవారు గొడవ ఆపాలని అరిచిన పట్టించుకోలేదు.
అయితే వీరిద్దరి మధ్య సీటు విషయంలో వాగ్వాదం చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది కాస్తా ఒకరిపై ఒకరు దాడి చేసుకునేవరకు వచ్చింది. ఈ ఘటనతో విమానంలోని ఇతర ప్రయాణికులు షాక్ తిన్నారు. వారిద్దరు ఇలా చేయడం మిగతావారికి కూడా ఇబ్బంది కలిగించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flight, USA, Viral Video