Home /News /trending /

FIFTEEN SHIV TANDAV STOTRAM UNDER A MINUTE 9 YEARS DELHI BOY SETS NEW RECORD SK GH

Shiv Stotram: ఒక్క నిమిషంలో 15 శివ స్తోత్రాలు.. 9 ఏళ్ల బాలుడి అరుదైన రికార్డ్..

ఒక్క నిమిషంలో 15 శివ స్తోత్రాలు.. 9 ఏళ్ల బాలుడి అరుదైన రికార్డ్..

ఒక్క నిమిషంలో 15 శివ స్తోత్రాలు.. 9 ఏళ్ల బాలుడి అరుదైన రికార్డ్..

15 Shiv Stotra in 1 Minute: ఢిల్లీకి చెందిన ఒక బాలుడు ఏకంగా 15 శివ స్తోత్రాలను ఒక నిమిషం లోపు చదివి రికార్డు సాధించాడు. సంస్కృతంలో ఉండే ఈ 15 శ్లోకాలను కేవలం 55 సెకన్లలోనే పూర్తి చేశాడు.

హిందూ దేవుళ్లకు చేసే పూజా కార్యక్రమాల్లో స్తోత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. శివ భక్తులు శివ తాండవ స్తోత్రాలు చదువుతూ లింగానికి అభిషేకాలు, పూజలు చేస్తారు. ఈ సంస్కృత శ్లోకాలను నేర్చుకోవడం, వాటిని గుర్తుపెట్టుకోవడం సాధారణ విషయం కాదు. కానీ ఢిల్లీకి చెందిన ఒక బాలుడు ఏకంగా 15 శివ స్తోత్రాలను ఒక నిమిషం లోపు చదివి రికార్డు సాధించాడు. సంస్కృతంలో ఉండే ఈ 15 శ్లోకాలను కేవలం 55 సెకన్ల, 29 మిల్లీసెకన్లలోనే పూర్తి చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. ఢిల్లీకి చెందిన తొమ్మిదేళ్ల వివాన్ గుప్త ఈ రికార్డు సాధించాడు. ఇంతకు ముందు కూడా అతడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకోవడం విశేషం.

వాయువ్య ఢిల్లీలోని పిటాంపురా ప్రాంతానికి చెందిన వివాన్, బాల భారతి పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నాడు. పెద్దవాళ్లు పూజలు చేసేటప్పుడు చదివే శ్లోకాలపై అతడికి చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. తన నాయనమ్మ శివ పూజ చేస్తున్నప్పుడు చదివే శివతాండవ స్తోత్రాలను వివాన్ చిన్నప్పుడే నేర్చుకున్నాడు. వాటిని రోజూ సాధన చేయడం ప్రారంభించాడు. సాధారణ వ్యక్తుల కంటే వేగంగా సంక్లిష్టమైన పదబంధాలను కంఠస్థం చేయగల సామర్థ్యం వివాన్‌కు ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన అతడి తాత వివాన్‌ను ప్రోత్సహించారు. మరిన్ని శ్లోకాలు నేర్చుకోవడంలో సహాయం చేశాడు.

శివ తాండవ స్తోత్రాలను లంకాధిపతి అయిన రావణుడు రచించాడని చెబుతారు. వీటిలో రావణుడు శివుడి శక్తిని, అందాన్ని ప్రశంసించాడు. ఈ శ్లోకాలను ఒక భక్తుడిలా పాట రూపంలో వర్ణించాడు. ఈ సంస్కృత శ్లోకాల్లోని సంక్లిష్టమైన పదాలను గుర్తుంచుకోవడం కష్టమని భాషా నిపుణులు చెబుతుంటారు. శివ తాండవ స్తోత్రం చదవడం లేదా వినడం ద్వారా భక్తులు అపారమైన శక్తిని, మానసిక బలాన్ని పొందుతారని భక్తులు భావిస్తారు. వివాన్ నాయనమ్మ తమ ఇంట్లో ప్రతిరోజూ ఈ శ్లోకాలు చదువుతూ పూజలు చేసేది. దీంతో అతడికి వీటిపై ఆసక్తి ఏర్పడింది. క్రమంగా వాటిని కంఠస్థం చేసి చెప్పడం ప్రారంభించాడు. తాజాగా నిమిషం లోపు వీటిని చదివి రికార్డు నెలకొల్పాడు.

* మరో రికార్డు కూడా..
వివాన్ వయసు తొమ్మిదేళ్లు. గతంలో ఎనిమిది సంవత్సరాల వయసులో కూడా అతడు ఒకసారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. అతి చిన్న వయసులో ప్రపంచంలోని ఏడు ఖండాలకు ప్రయాణించిన వ్యక్తిగా వివాన్ పేరుతో రికార్డు ఉంది. అతడు 2015లో ఉత్తర అమెరికాకు వెళ్లాడు. అప్పటి నుంచి కేవలం నాలుగేళ్లలోనే ఏడు ఖండాలకు వెళ్లాడు. 2019 జూన్ 6న ఆస్ట్రేలియాలో పర్యటించి, ఏడు ఖండాల ప్రయాణం పూర్తిచేశాడు. అప్పటికి అతడు ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలకు వెళ్లడం విశేషం. ఈ ప్రయాణంలో ఫిన్లాండ్‌లో శాంతా క్లాజ్‌ను కలవడం, ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్‌లో డైవింగ్ చేయడం, టాంజానియాలోని అడవిలో సఫారీని ఆస్వాదించడం వంటి మర్చిపోలేని సంఘటను ఎన్నో ఉన్నాయని వివాన్ వివరించాడు.

Keywords
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Delhi, New Delhi, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు