హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఆ డ్రెస్ వేసుకుందని..మాజీ మిస్ క్రొయేషియాకి భారీ జరిమానా,జైలు శిక్ష?

ఆ డ్రెస్ వేసుకుందని..మాజీ మిస్ క్రొయేషియాకి భారీ జరిమానా,జైలు శిక్ష?

మాజీ మిస్ క్రొయేషియా ఇవానా నోల్

మాజీ మిస్ క్రొయేషియా ఇవానా నోల్

FIFA World Cup 2022: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉన్న అంశం ఏదైపా ఉందంటే అది ఖతార్ లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్. ఈ ఫుట్ బాల్ మ్యాచ్ లు చూసేందుకు వివిధ దేశాల నుంచి ఖతార్ కి చేరుకుంటున్నారు అభిమానులు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

FIFA World Cup 2022 : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉన్న అంశం ఏదైనా ఉందంటే అది ఖతార్ లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్(Fifa world cup 2022). ఈ ఫుట్ బాల్ మ్యాచ్ లు చూసేందుకు వివిధ దేశాల నుంచి ఖతార్ కి చేరుకుంటున్నారు అభిమానులు. చిన్న చిన్న జట్లు కూడా తమ అద్భుత ప్రదర్శనతో పెద్ద టీమ్ లను ఓడిస్తుండం అభిమానులకు మంచి మజా ఇస్తోంది. ఖతార్ గ్రాండ్ ఈవెంట్ కూడా ప్రతిచోటా ప్రశంసలు అందుకుంటుంది. కానీ ఖతార్ లో ఉన్న కఠినమైన నియమాలు, నిబంధనలను అంగీకరించడానికి చాలా మంది సిద్ధంగా లేరు. ఈ క్రమంలో మాజీ మిస్ క్రొయేషియా, మోడల్ ఇవానా నోల్ వార్తల్లో నిలిచారు. అందుకు కారణం ఆమె అభ్యంతరకరమైన డ్రెస్ వేసుకుని మ్యాచ్ చూసేందుకు వెళ్లడమే. ఇప్పుడు ఆమెపై ఖతార్ అధికారులు చర్యలు తీసుకోవచ్చని సమాచారం.

మొరాకోతో క్రొయేషియా ప్రారంభ మ్యాచ్ కోసం ఇవానా అల్-బైట్ స్టేడియంకు వెళ్లింది. ఆమె తన దేశం యొక్క ఐకానిక్ ఎరుపు, తెలుపు నమూనాలో ధరించింది. కానీ ఖతార్ చట్టం ప్రకారం, ఈ దుస్తులు సరిగ్గా లేవు. ఇది నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని, మోడల్‌కు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Amazing: చేపలకు ట్రాన్స్ లోకేషన్.. 10 వేల చేపలు సేఫ్ .. ఎక్కడో తెలుసా..?

"పురుషులు, మహిళలు బహిరంగంగా రెచ్చగొట్టే దుస్తులను ధరించడం మానుకోవాలని, స్థానిక సంస్కృతి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలని భావిస్తున్నాం" అని ఖతార్ టూరిజం అథారిటీ ప్రపంచ కప్‌కు ముందు తెలిపింది. "సాధారణంగా పురుషులు,మహిళలు తమ భుజాలు, మోకాళ్లు కప్పబడి ఉండేలా చూసుకోవాలని సిఫార్సు చేశారు, కానీ మోడల్ ఇవానా అన్ని నిబంధనలను ఉల్లంఘించింది. మర్యాద చట్టాలను ఉల్లంఘించినందుకు నోల్ మరింత తీవ్రమైన జరిమానాలను కూడా ఎదుర్కోవలసి ఉంటుందని తెలుస్తోంది. FIFA ప్రపంచ కప్ సమయంలో ఆమె బహిర్గతమయ్యే దుస్తులు ధరించినందుకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఆమెపై పలువురు విమర్శలు గుప్పించారు.

First published:

Tags: FIFA, FIFA World Cup 2022

ఉత్తమ కథలు