FEMALE FAN MEETING TOLLYWOOD HERO VIJAYDEVARAKONDA VIDEO GOING VIRAL ON SOCIAL MEDIA SNR
Vijay Devarakonda: లేడీ డాక్టర్ వీపుపై విజయ్ దేవరకొండ ఫోటో టాటూ .. ఇద్దరూ కలిసున్న వీడియో వైరల్
(Photo Credit:Twitter)
Vijaydeverakonda: ఆ టాలీవుడ్ యంగ్ హీరోకి లెక్కలేనంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలైతే అతడ్ని గుండెల్లో దాచుకుంటారు. అందుకే ఓ వీరాభిమాని అతని ఫోటోను వీపుపై టాటుగా వేయించుకొని డైరెక్ట్‌గా అతనికి చూపించడానికి వచ్చింది. ఇప్పుడు ఆ హీరో వీడియోనే వైరల్ అవుతోంది.
అబ్బాయిలకు హీరోయిన్లు అంటే ఇష్టం. అదే అమ్మాయిలకు హీరోలంటే పిచ్చి. అదేంటి పిచ్చి అని పచ్చిగా అంటున్నారేంటని ఆశ్చర్యపోకండి. అసలు జరిగింది చెబితే మీరు యస్ అంటారు. టాలీవుడ్ క్రేజీ హీరో , ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్(Female fan following) కలిగిన స్టార్ విజయ్‌దేవరకొండ(Vijay Devarakonda)కు అభిమానులకు కొదవే లేదు. లేడీ ఫ్యాన్స్ కూడా అంతే పెద్ద సంఖ్యలో ఉన్నారు. విజయ్‌దేవరకొండకు అత్యంత వీరాభిమాని ఒకరు ఉన్నారు. ఆమె స్వయంగా హీరోని కలవడానికి హీరోపై ఆమెకు ఉన్న అభిమానాన్నిచూపించడానికి నేరుగా అతని ఆఫీస్‌కి వెళ్లారు. ఆమె పేరు డాక్టర్ చెర్రి(Dr. Cherry). ఒక్క చెర్రీనే కాదు మరో అభిమాని డాక్టర్ సోనాలి(Dr. Sonali)అనే ఫ్రెండ్‌ని తీసుకొని టాలీవుడ్(Tollywood)అర్జున్‌రెడ్డి(Arjun Reddy) ఆఫీస్‌కి వెళ్లారు.
లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ..
అక్కడ యంగ్ హీరో విజయదేవరకొండను చూసిన క్షణంలో ఇద్దరు అమ్మాయిలు ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు. హీరోనే స్వయంగా వాళ్లతో మాట్లాడటం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఫోటో దిగుదామా అని పలకరిస్తుంటే డాక్టర్ చెర్రి తన సంతోషాన్ని ముఖంలో చూపించింది. అంతే కాదు వీపుపై వేయించుకున్న విజయ్‌దేవరకొండ పేరు, ఫోటోని టాటును చూపించింది. ఇద్దరు సూపర్స్ ఫ్యాన్స్ అంటూ హగ్ చేసుకున్న విజయ్‌దేవరకొండ వారికి డైరెక్టర్ పూరి జగన్నాథ్, చార్మితో పాటు లైగర్ మూవీ యూనిట్ సభ్యులను పరిచయం చేశారు.
"SUPER FAN MOMENT" - Some FANS convey their affection in a most personal way and High Respect when they ink their Star on their Body
వైరల్ అవుతున్న వీడియో ..
అటుపై హ్యాపీగా హీరో విజయ్‌దేవరకొండతో సోఫోలో కూర్చొని మాట్లాడుకున్నారు. తర్వాత ఫోటోలు దిగారు. ఒక యంగ్ హీరోకి ఈ రేంజ్లో ఫ్యాన్స్ ఉండటం కొత్తేమి కాకపోయినా ..విజయ్‌దేవరకొండ మాత్రం డాక్టర్ చెర్రీ సూపర్ ఫ్యాన్ అంటూ ఈ వీడియోని లైగర్ టీమ్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఈయంగ్ హీరోకి అమ్మాయిలు సోషల్ మీడియాలో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
రౌడీ కాదు హీరో ..
సహజంగా టాలీవుడ్లో కొందరు హీరోలకు ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అందులో ఒకరే విజయ్‌దేవరకొండ. అర్జున్‌సింగ్‌తో లవర్‌బాయ్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఈయంగ్ రౌడీ బాయ్ ఆ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగిపోయాడు. ఆ తర్వాత కూడా గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో లేడీస్ వీరాభిమానిగా మారిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు విజయ్‌దేవరకొండ రౌడీబాయ్ కాదు రియల్ హీరో అంటూ తెగ కాంప్లిమెంట్స్ షేర్ చేస్తున్నారు. లక్షల్లో లైక్‌లు కొడుతున్నారు.
ఇది చదవండి: చిరంజీవి గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఖరారు.. మెగా ఫ్యాన్స్ ఖుషీ..
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.