news18-telugu
Updated: October 17, 2020, 12:35 PM IST
ప్రతీకాత్మక చిత్రం
సురక్షిత శృంగారానికి కండోమ్ ఎంతగానో సహకరిస్తుంది. అంతేకాదు.. ఎయిడ్స్, సుఖ వ్యాధులకు కూడా కండోమ్ అడ్డుకట్ట వేస్తోంది. అందుకే కండోమ్ వాడకం ఇటీవల పెరిగిపోయింది. మహిళలు వినియోగించే కండోమ్స్(ఫిమేల్ కండోమ్స్) కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఫిమేల్ కండోమ్స్ గురించి చాలా మంది తెలియదు. ఇవి మేల్ కండోమ్స్ కంటే చాలా పలుచగా ఉంటాయి. మేల్ కండోమ్‌లోని లేటెక్స్ మెటీరియల్ పడనివాళ్లు వీటిని వాడి చూడవచ్చు. మేల్ కండోమ్‌లాగానే వీటిలో కూడా ఫెయిల్యూర్ రేటు ఐదు నుంచి పది శాతం ఉంటుంది. సరిగ్గా వాడితే ఫెయిల్యూర్ రేటు తగ్గుతుంది. మేల్ కండోమ్‌తో పోలిస్తే వీటి ఖరీదు కూడా కాస్త ఎక్కువే. అయితే వీటివల్ల సుఖవ్యాధులను, అవాంఛిత గర్భాలను చాలా మేరకు నివారించవచ్చు.
అయితే ఇటీవల కాలంలో ఫిమేల్ కండోమ్స్ వాడకం పెరిగినట్టుగా తెలుస్తోంది. భవిషత్తులో ఈ వాడకం భారీగా పెరిగే అవకాశం ఉందని.. అధ్యయనంలో వెల్లడైంది. తాజాగా గ్లోబల్ ఫిమేల్ కండోమ్స్ మార్కెట్ 2020కి సంబంధి విస్తృతమైన వివరాలు సేకరించారు. ఈ నివేదికలో 2020 మరియు 2025 మధ్య కాలంలో గ్లోబల్ ఫిమేల్ కండోమ్ మార్కెట్ గణనీయమైన రేటుకు పెరుగుతుందని అంచనా వేయబడింది. 2020లో ఈ మార్కెట్ స్థిరమైన రేటుతో పెరుగుతోందని.. మరియు కండోమ్ ఉత్పత్తి చేసే కంపెనీలు వ్యూహాలను పెంచుకోవడంతో, మార్కెట్ అంచనా అంచనా వేసిన విధంగా ముందుకు సాగుతుందని తెలిపింది.
ఈ నివేదిక కోసం ఫిమేల్ కండోమ్స్ ఉత్పత్తి, సరఫరా మాత్రమే కాకుండా అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఫిమేల్ కండోమ్స్ మార్కెట్ ఎలా ఉంటుందనే విషయాన్ని ఇది అంచనా వేస్తుంది. 2020-2025 వరకు ఈ అమ్మకాలు ఉంటాయనే దానిపైనా సూచన కూడా చేస్తోంది. అలాగే ప్రాంతాల వారీగా సమగ్ర విశ్లేషణను అందజేసింది. అలాగే ప్రస్తుత మార్కెట్‌తో భవిష్యత్తులో అనుసరించాల్సిన మార్పులపై కూడా దృష్టి పెట్టింది. అలాగే కోవిడ్-19 ఫిమేల్ కండోమ్స్ మార్కెట్‌పై ఏ విధంగా ఉందనేది కూడా ఈ నివేదికలో విశ్లేషించారు.
ఫిమేల్ కండోమ్స్‌కు ప్రధాన ప్రాంతీయ మార్కెట్లుగా ఉన్న ఉత్తర అమెరికా(యూఎస్ఏ, మెక్సికో), యూరోప్(జర్మనీ, ఫ్రాన్స్, యూనైటైడ్ కింగ్డమ్, రష్యా, ఇటలీ), ఆసియా పసిఫిక్( చైనా, జపాన్, కొరియా, ఇండియా, నైరుతి ఆసియా, ఆస్ట్రేలియా), దక్షిణ అమెరికా(బ్రెజిల్, అమెరికా), మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా(సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్, దక్షిణ ఆఫ్రికా) గణంకాలను సేకరించారు.
Published by:
Sumanth Kanukula
First published:
October 17, 2020, 12:35 PM IST