HOME »NEWS »TRENDING »fearless mommy mouse rescues baby from snakes mouth went viral in social media ms

Viral: తల్లి ప్రేమ.. ధైర్యం ముందు ఎంతటి బలవంతులైనా దిగదుడుపే...

Viral: తల్లి ప్రేమ.. ధైర్యం ముందు ఎంతటి బలవంతులైనా దిగదుడుపే...
Image credits twitter

అమ్మ ప్రేమ గురించి ప్రపంచంలో లోకంలో ఎంతో మంది కవులు ఎన్నో గొప్పగా వర్ణించారు. తల్లి ప్రేమను వెలకట్టేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. తన పిల్లలు ఆపద సమయంలో ఉన్నప్పుడు వారిని కాపాడటంలో ఏ తల్లి అయినా చూపే తెగువ అనన్య సామాన్యమైనది.

  • News18
  • Last Updated: November 28, 2020, 20:23 IST
  • Share this:
    సృష్టిలో కమ్మనైనది అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమ గురించి ప్రపంచంలో లోకంలో ఎంతో మంది కవులు ఎన్నో గొప్పగా వర్ణించారు. తల్లి ప్రేమను వెలకట్టేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. తన పిల్లలు ఆపద సమయంలో ఉన్నప్పుడు వారిని కాపాడటంలో ఏ తల్లి అయినా చూపే తెగువ అనన్య సామాన్యమైనది. శత్రువు ఎంతటి బలవంతులైనా.. వారి నుంచి తన సంతానాన్ని కాపాడుకోవడంలో ఆమె పాత్ర కీలకమైంది. అది మనుషులకే కాదు. జంతువులకూ వర్తిస్తుంది. కోడి తన పిల్లలను పొదుగులో కాపాడుకుంటుంది. ఎవరైనా ఆ పిల్లలను ముట్టుకున్నారో.. ఇక వారి అంతు చూసేదాకా వదిలిపెట్టదు. పక్షులు కూడా అంతే. ఎంతో శ్రమకోర్చి తమ సంతానాన్ని కాపాడుకుంటాయి.

    తాజాగా ఒక ఎలుక.. తన బిడ్డను నోట కరుచుకుని ఎత్తుకుపోతున్న ఎలుకపై వీరోచితంగా పోరాడి దాని నుంచి బిడ్డను కాపాడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాము తన బిడ్డను తీసుకుపోతుంటే.. దాని వెనకాలే పరిగెత్తింది. పాము వెనకభాగంలో తరుముతూ దాని నుంచి బిడ్డను కాపాడింది.







    ట్విట్టర్ లో ఒక నెటిజన్ ఈ వీడియోను పోస్టు చేయగా.. దానిని నెటిజన్లు ఫిదా అవుతున్నారు.









    చాలా మంది ఐఎఫ్ఎస్ అధికారులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఎక్కడైనా తల్లి ప్రేమ, ధైర్యానికి మించింది మరోకటి లేదని కామెంట్స్ చేస్తున్నారు.
    Published by:Srinivas Munigala
    First published:November 28, 2020, 20:21 IST