• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • FEARING THE CORONA VACCINE HE CLIMBED THE TREE AS IF HE DID NOT WANT ME AND HIS WIFE VB

Man Climbs Tree: నాకు వద్దు.. నా భార్యకు కూడా వద్దంటూ అతడు చెట్టెక్కాడు.. అసలేమైందంటే..

Man Climbs Tree: నాకు వద్దు.. నా భార్యకు కూడా వద్దంటూ అతడు చెట్టెక్కాడు.. అసలేమైందంటే..

వ్యాక్సిన్ కు భయపడి చెట్టెక్కిన గ్రామస్తుడు (Image credit : Twitter)

Man Climbs Tree: ఆ గ్రామంలో కోవిడ్ టీకా శిబిరం కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. దీంతో ఓ వ్యక్తి భయపడి వ్యాక్సిన్ నాకు వద్దంటూ చెట్టు ఎక్కాడు. అతేకాకుండా తన భార్యకు కూడా వేయడానికి వీళ్లేదని భార్య ఆధార్ కార్డును తన వద్దే ఉంచుకున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    కరోనాను కట్టడి చేయాలంటే ప్రతీ ఒక్కరూ టీకా తప్పని సరిగా వేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. దీనికి అనుగుణంగానే ప్రభుత్వాలు కూడా నడుచుకుంటున్నాయి. వాటిలో భాగంగానే గ్రమాలకు వెళ్లి మరీ వైద్య అధికారులు కోవిడ్ టీకా శిబిరాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.  గ్రామాలు, తాండాలు ఇలా అన్ని చోట్లా ప్రజలకు వ్యాక్సీన్ వేస్తున్నారు. వ్యాక్సీనేషన్ కార్యక్రమం ఇంత ఉధృతంగా జరుగుతున్నా.. మరోవైపు వ్యతిరేక ప్రచారం కూడా అంతే స్థాయిలో జరుగుతోంది. టీకా వేసుకుంటే ఏదో జరిగిపోతుందని, ప్రాణాలే పోతాయంటూ దుష్ప్రచారం జరుగుతోంది. ఈ దుష్ప్రచారాన్ని నమ్మిన కొందరు ప్రజలు టీకా వేసుకునేందుకు ఆసక్తి కనబరచడం లేదు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి మధ్య ప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లాలోని పటాన్ కాలా గ్రామంలో వెలుగు చూసింది. కోవిడ్ వ్యాక్సీన్‌కు భయపడి ఓ వ్యక్తి చెట్టు ఎక్కాడు. గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముగిసే వరకు కిందకు దిగలేదు. చివరికి వ్యాక్సినేషన్ సిబ్బంది వెళ్లిపోయాక కిందకు వచ్చాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    వ్యాక్సినేషన్  కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారులు మధ్య ప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లాలోని పటాన్ కాలా గ్రామానికి టీకాలు వేసేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే గ్రామలోని ప్రతీ ఒక్కరూ టీకా వేసే ప్రదేశానికి చేరుకున్నారు. అందులో గ్రామస్తుడు కన్వర్ లాల్ కూడా వచ్చాడు. అక్కడ టీకా వేసే కార్యక్రమాన్ని చూశాడు. అతడికి ఎమని అని పించిందో ఏమో కానీ వ్యాక్సిన్ వేసుకోవడానికి రమ్మని పిలవగానే అతడు అక్కడే ఉన్న ఒక చెట్టు ఎక్కాడు. కానీ అతడితోపాటు వచ్చిన తన భార్య మాత్రం టీకా వేసుకునేందుకు ఓప్పుకుంది. కానీ అతడు తన భార్యకు కూడా టీకా వేయోద్దనే ఉద్దేశ్యంతో తన ఆధార్ కార్డును సైతం తీసుకొని చెట్టు ఎక్కాడు.

    తమకు ఏ టీకా అవసరం లేదని, టీకా తీసుకుంటే మరింత ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. అతడికి వైద్య సిబ్బంది ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఈ విషయం ఉన్నతాధికారులకు చేరింది. టీకా కార్యక్రమం అయిపోయాక గానీ కిందకు దిగలేదు. అయితే, వ్యాక్సీన్ తీసుకోవడానికి భయపడి చెట్టు ఎక్కిన వ్యక్తి వ్యవహారం ఉన్నతాధికారులకు చేరింది. ఖుజ్నర్ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజీవ్ గ్రామాన్ని సందర్శించి కన్వర్‌లాల్‌కు టీకా వల్ల ఎలాంటి భయం ఉండదని తెలిపాడు. టీకా పట్ల కన్వర్‌లాల్‌కు ఉన్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసి అతనికి, అతని భార్యకు త్వరలో టీకా వేస్తామని చెప్పారు.
    Published by:Veera Babu
    First published:

    అగ్ర కథనాలు