ఇండియన్ ఆర్మీకు భయపడి ఏడుస్తున్న చైనా సైనికులు.. వైరల్ వీడియో

ఏడుస్తున్న చైనా సైనికులు

భారత ఆర్మీ ధైర్య సాహసాలను చూసి చైనా సైనికుల వెన్నులో వణుకుపుడుతోందని అందులో పేర్కొన్నారు. భారత సరిహద్దుల్లో విధులంటేనే భయపడిపోతున్నారని పలు పత్రికలు వెల్లడించాయి.

 • Share this:
  భారత్, చైనా సరిహద్దుల్లో కొన్ని నెలలుగా యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దు వైపు దూసుకొస్తూ భారత సైన్యాన్ని నిత్యం రెచ్చగొడుతున్నారు చైనా జవాన్లు. ఎల్‌ఏసీకి సమీపంలో నిర్మాణాలు చేపట్టి కవ్వింపులకు పాల్పడుతున్నారు. ఐతే చైనా ఆర్మీకి అంతకు మించిన స్థాయిలో గట్టిగా సమాధానం చెబుతున్నారు భారత జవాన్లు. గత కొన్ని నెలలుగా నెలకొన్న పరిణామాలతో ఇరుదేశాలు పెద్ద ఎత్తున బలగాలను సరిహద్దుల్లో మోహరిస్తున్నాయి. లద్దాఖ్ తూర్పు ప్రాంతంలో పెద్ద మొత్తంలో వాహనాల రాకపోకాలు, సైన్యం కదలికలు కనిపిస్తున్నాయి. ఐతే ఇటీవల కొందరు చైనా సైనికులు లద్దాఖ్ సరిహద్దుకు బయలుదేరి వెళ్లారు. ఆర్మీ బస్సులో బార్డర్‌కు వెళ్తున్న క్రమంలో అందరూ ఏడ్చేశారు. సరిహద్దు దగ్గరపడుతున్న కొద్దీ వారికి కన్నీళ్లు ఆగలేదు. భారత్ సైన్యానికి భయపడిపడి పిరికితనంతో కన్నీళ్లు పెట్టుకున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


  ఆ వీడియో ఆధారంగా తైవాన్ మీడియా సంస్ధలను కథనాలను ప్రచురించాయి. భారత ఆర్మీ ధైర్య సాహసాలను చూసి చైనా సైనికుల వెన్నులో వణుకుపుడుతోందని అందులో పేర్కొన్నారు. భారత సరిహద్దుల్లో విధులంటేనే భయపడిపోతున్నారని పలు పత్రికలు వెల్లడించాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో కొత్తగా చేరిన యువకుల్లో మచ్చుకైనా కనిపించడం లేదని.. సరిహద్దులో విధులు వేసినందుకు బోరున విలపిస్తున్నారని తెలిపాయి. భారత సరిహద్దులోకి వెళ్తే.. తిరిగి ప్రాణాలతో తిరిగొస్తామా.. అన్న ఆందోళన వారి ముఖాల్లో కనిపిస్తోందని సెటైర్లు వేసింది తైవాన్ మీడియా. వారంతా వణుకుతున్న గొంతులతోనే తమ సైనిక గీతమైన ‘గ్రీన్‌ ఫ్లవర్స్‌ ఇన్‌ ద ఆర్మీ’ ని ఆలపించారని పేర్కొంది.

  సెప్టెంబరు 15న చైనా హుబే ప్రావిన్సులోని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి కొత్తగా ఎంపికైన యువతకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. వీరికి తూర్పు లద్ధాఖ్‌ సరిహద్దుల వద్ద పోస్టింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే వారు భారత సరిహద్దుకు వెళ్లేందుకు భయపడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే తైవాన్ మీడియా కథనాలను చైనీస్ మీడియా తోసిపుచ్చింది. భారత సైన్యానికి భయపడి వారు ఏడవలేదని.. కుటుంబాలను విడిచిపెట్టి దూరంగా వెళ్తున్నామన్న బెంగతోనే కన్నీళ్లు పెట్టుకున్నారని పేర్కొంది. ఏ దేశ సైనికులైనా ఇంటి నుంచి సరిహద్దుకు వెళ్తున్న క్రమంలో భావోద్వేగానికి లోనవుతారని వెల్లడించింది.
  Published by:Shiva Kumar Addula
  First published: