అమ్మ మనల్ని 9 నెలలు మోసి.. ఈ ప్రపంచంలోకి తీసుకొని వస్తుంది.. కానీ ఆ తర్వాత జీవితంలో ఎదిగేవరకు మన బాధ్యతలు మోసేది నాన్న. అందుకే జీవితంలో అమ్మ తర్వాతి స్థానం నాన్నదే. ప్రపంచాన్ని మనకి చూపించే నాన్నకు.. మన జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మన జీవితంలో తప్పటడుగులు వేస్తే.. వాటిని సరిదిద్దుతూ మనం పైకి రావాలాని ఆశించే వ్యక్తి నాన్న. ప్రేమతో చెప్పినా.. కొన్ని సార్లు కొప్పడిన, మరికొన్ని సార్లు కఠినంగా వ్యవహరించిన అదంతా మన మంచి కోసమే. మన విజయాలే.. తన గెలుపుగా మురిసిపోతుంటాడు నాన్న. అయితే చాలా మంది నాన్నతో సమయం గడపటం ఇటీవలి కాలంలో చాలా వరకు తగ్గుతుంది. అలాంటివారు ఈ ఏడాది ఫాదర్స్ డేకి.. నాన్నతో సమయం గడిపేందుకు ప్లాన్ చేసుకోండి. ఫాదర్స్ డే రోజున నాన్నకు గుర్తుండిపోయే విధంగా సెలబ్రేట్ చేయండి.
ప్రతి ఏడాది జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటామనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ మూడో ఆదివారం.. అంటే 20వ తేదీన ఫాదర్స్ డే జరుపుకోబోతున్నాం. మరోవైపు ఆ మరుసటి రోజే యోగా డే కూడా వస్తోంది. వరుసగా వస్తున్న ఈ రెండు స్పెషల్ డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇక, ఫాదర్స్ డే రోజున.. కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకునే కొన్ని ఐడియాలను ఇప్పుడు చూద్దాం.
అవుట్ డోర్లో ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలంటే..
ప్రస్తుతం కరోనా కారణంగా అవుట్ డోర్లో ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలంటే ప్రత్యేకమైన ప్లానింగ్ తప్పనిసరి. మనం ఎంచుకునే ప్రదేశంలో స్థానికంగా ఉన్న నిబంధనలు ఏమిటో తెలుసుకోవాలి. బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించడం అస్సలు మర్చిపోవద్దు. ప్రస్తుత పరిస్థితుల్లో దూర ప్రాంతాల్లోని ప్రదేశాలకు వెళ్లకుండా.. దగ్గరి ప్రదేశాలను ఎంచుకోవడం ఉత్తమం. ఒక వేళ ఇంటి ఆవరణలోనే ఎక్కువ స్థలం ఉంటే సెలబ్రేషన్స్‌కు అదే బెస్ట్ ప్లేస్.
1. యోగా డే కూడా మరుసటి రోజే కాబట్టి.. పార్క్‌కు నాన్నతో కలిసి వెళ్లేటప్పడు యోగా మ్యాట్ కూడా తీసుకెళ్లండి. నాన్నతో కలిసి వర్కౌట్ ఎంజాయ్ చేయండి.
2. లాంగ్ రైడ్ కోసం సైకిల్స్ తీసుకెళ్లండి.. ఇది ఓ రకంగా పిల్లలకు నాన్నతో బంధాన్ని పెంచడంతో పాటు, మరో వైపు ఆరోగ్యకరమైన వ్యాయమం.
3. మీకు ఫిషింగ్ అంటే ఇష్టమైతే.. ఒక్క రోజు ముందుగానే ప్లాన్ చేసుకోండి. నాన్నతో కలిసి ఫిషింగ్ చేయండి.
4. మధ్యాహ్నం వేళ నాన్న, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆరుబయట వంట చేయండి. ఇది ఒక చిరస్మరణీయ అనుభవాన్ని కలిగిస్తుంది
5.కరోనా సమయంలో రద్దీ ప్రాంతాలను ఎక్కువగా తిరగకుండా.. ఫాదర్స్ డే రోజు ఓ చోట క్యాంపింగ్ చేయండి. ఇది చాలా మంచి అనుభూతిని ఇస్తుంది.
ఇంట్లోనే ఫాదర్స్ డే సెల్రబేట్ చేయండి ఇలా..
ఫాదర్స్ డేను ఇంట్లోను జరుపుకోవడం కూడా చాలా సరదాగా ఉంటుంది. రోజు మొత్తం ఇంట్లోనే ఉన్న కూడా.. దానిని ప్రత్యేకంగా ప్లాన్ చేయండి.
1. ముందుగా ఇష్టమైన స్నాక్స్‌ను, రుచికరమైన ఫుడ్స్ సిద్దం చేసుకోండి.
2. చెస్, స్క్రాబుల్.. ఇలాంటి వాటిలో మీ నాన్నకు ఇష్టమైన ఆటను ఆయనతో కలిసి ఆడేందుకు ప్లాన్ చేసుకోండి. అలాగే మీ నాన్నకు నచ్చిన సినిమాలు గానీ, ఇతర యాక్టివిటీలను చేసేందుకు అన్ని సమకూర్చుకోండి.
3. మీ కుటుంబ సభ్యులు అంతా వీటిలో పాల్గొనేలా చూసుకోండి.. అప్పుడే ఫాదర్స్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవచ్చు.
4. మీ నాన్న సాయంతో కుటంబ వంశ వృక్షాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే చిన్నతనంలో మీరు ఎంత అల్లరి చేశారో.. మీ నాన్నను అడిగి తెలుసుకోండి. అలాగే మీ నాన్న బాల్యం గురించి విశేషాలను తెలుసుకోండి.
5. సాయంత్రం పూట మ్యూజిక్‌తో గానీ, ఇతర ఏదైనా యాక్టివిటీతో గానీ ఎంజాయ్ చేయండి.. మీ నాన్న ఇష్టమైన వాటికి సంబంధించి ఏదైనా సర్ఫ్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చేలా కూడా ప్లాన్ చేసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.