Fathers Day 2020 : ఈసారి ఒకే రోజు ఇంటర్నేషనల్ యోగా డే, ఫాదర్స్ డే వచ్చాయి. అదే సమయంలో సూర్య గ్రహణం కూడా ఉంది. ఏటా జూన్ మూడో ఆదివారం నాడు ఫాదర్స్ డే జరుగుతోంది. ఈసారి జూన్ 21న (నేడే) ఇది జరుగుతోంది. ఈ సందర్భంగా... సోషల్ మీడియాలో వైరస్ సెన్సేషన్ అయిన డాడీల గురించి తెలుసుకుందాం. ఎందుకు వారు సెన్సేషన్ అయ్యారో, ఎందుకు వారి గురించి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు చర్చించుకున్నారో తెలుసుకుందాం. జనరల్‌గా పిల్లలు తల్లితోనే ఎక్కువగా ఉంటారు. కానీ... తండ్రికి వారిపై ఉండే మక్కువ ఎక్కువే. అది బయటకు కనిపించని బంధం. మాటలకు అందని భావం. సరే... మనం సూపర్ డాడీల సంగతి తెలుసుకుందాం.
1. తల్లి లేని సమయంలో... కూతురికి బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన తండ్రి : తల్లి లేని సమయంలో... చిన్నారికి పాలు పట్టించేందుకు ఆ తండ్రి... తన షర్టులో పాల బాటిల్‌ను ఉంచుకొని... పాలు పట్టించాడు. దాంతో... ఈయన ఈ ఏడాది డాడ్ ఆఫ్ ది ఇయర్‌గా నెటిజన్లు ఎంపిక చేశారు.
He said
"Her mama gone and she wouldn’t take the bottle, so I had to trick her" 😂😂😂
2. బధిరుడైన తండ్రి ఏం చేశాడు : ఈ తండ్రికి మాటలు వినిపించవు. బధిరుడు. కానీ... కొత్తగా పుట్టిన కూతురితో మాట్లాడేందుకు ఆయన సైగలు చేశాడు. ఈ వీడియో ఎంతో మంది కంట నీరు తెప్పించింది. ఆయన సైగలకు అర్థం ఇది. డాడీ... నేను నీ డాడీని. ఐ లవ్యూ. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ కళ్లు చాలా అందమైన కలర్‌తో ఉన్నాయి. మెరుస్తూ గ్రీన్ కలర్‌తో. చాలా బాగున్నాయి. నీ నవ్వు భలే ఉంది. ఐ లవ్యూ. నువ్వు క్యూట్. అది వెచ్చటి పరుపు. ఐ లవ్యూ. ఐ లవ్యూ. నువ్వు అందంగా ఉన్నావు. క్యూట్.
This hearing-impaired father expressing love to his newborn daughter in sign-language is the definitely Twitter content I’m here for...💪😍😇😊🔥 pic.twitter.com/CEvINcmRaX
3.మమ్మీ పైజమాలో డాడీ ఉంటే : ఆ బిడ్డ ఏడుపు ఆపట్లేదు. దాంతో ఆ తండ్రి... బిడ్డ తల్లి ఫేస్ మాస్క్ వేసుకున్నాడు. అలాగే తల్లి ధరించే పైజమా వేసుకున్నాడు. తల్లిలా నటించాడు. అంతే బిడ్డ మొహంలో ఆనందం వెల్లివిరిసింది.
మమ్మీ పైజమాలో డాడీ ఉంటే (credit - instagram)
4.భార్య డెలివరీకి ఒక చేత్తో సాయం చేసిన భర్త : రిస్ బ్రౌన్కి ఈ పరిస్థితి వచ్చింది. డెలివరీ సమయంలో... అతని పార్ట్నర్ జేడ్ పక్కన లేడు. రిస్కి ఓ చెయ్యి లేదు. దాంతో ఒకే చేతితో... డెలివరీ చేయించాడు. డెలివరీ ఎలా చేయాలో ఫోన్ ద్వారా జేడ్‌ని అడిగి తెలుసుకున్నాడు. అతను చెప్పినట్లు చేశాడు. పుట్టిన పాపకు ఒక చేత్తోనే టవల్ చుట్టాడు. అందరూ అతన్ని మెచ్చుకున్నారు.
5. కూతురి సోషల్ మీడియాను తండ్రి రన్ చేస్తే : లార్రీ సంప్టర్... తన 15 ఏళ్ల కూతురికి సోషల్ మీడియాలో సాయం చేశాడు. తన కూతుర్ని ఆటపట్టిస్తున్న కుర్రాళ్లకు చెక్ పెట్టేందుకు ఆమె పర్మిషన్తో రెడు వారాలు సోషల్ మీడియా అకౌంట్లను తను రన్ చేశాడు. ఆ రెండు వారాల్లో అదిరిపోయే ఫొటోలు, కామెడీ వీడియోలను పెట్టి... కూతురి అకౌంట్‌ను వైరల్ చేశాడు. దాంతో... ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
A post shared by madelynn🍒 (@madelynn.ellagrace) on
6. పిల్లల కోసం తండ్రి డిన్నర్ పార్టీ : ఇంట్లో బోర్ కొట్టిన పిల్లల కోసం బెన్ మూరే ఈ డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఓ వెయిటర్‌లా డ్రెస్ వేసుకొని... తన కొడుకు, కూతురికి డైనింగ్ టేబుల్‌పై ఫుడ్ ఐటెమ్స్, కొవ్వొత్తులు, పువ్వులూ అన్నీ ఎరేంజ్ చేసి... నెటిజన్ల మనసు గెలుచుకున్నాడు.
ఇలా ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డేను వేర్వేరు దేశాల్లో మార్చి, మే, జూన్‌లో జరుపుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి... మీరు ఫాదర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు.. మీ ఫాదర్‌కి ఏం గిఫ్ట్ ఇస్తున్నారు.....
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.