Home /News /trending /

FATHER CARRIED THE DEAD BODY OF HIS 14YEAR OLD SON FOR 25 KILOMETERS IN UTTAR PRADESH VIDEO GOES VIRAL SNR

Viral Video : 14ఏళ్ల బాలుడి శవాన్ని 25కిలోమీటర్లు భుజంపై మోసుకెళ్లాడు .. ఇదిగో వీడియో

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Viral Video: 14సంవత్సరాల కొడుకు ట్రీట్‌మెంట్ పొందుతూ చనిపోయాడు. ఇంటికి తీసుకెళ్లడానికి తల్లిదండ్రుల దగ్గర డబ్బు లేదు. ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఏర్పాటు చేయలేదు. ఆ తల్లిదండ్రులు ఏం చేశారో ఈ వీడియో చూడండి.

దేశం అన్నీ రంగాల్లో దూసుకుపోతున్నప్పటికి పేద ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, వైద్య, ఆరోగ్య సేవల విషయంలో చాలా వెనుకబడిపోతోంది. ప్రభుత్వ సిబ్బంది లంచాలకు అలవాటు పడటం, ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోతే శవాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌(Ambulance)మార్చురీ వ్యాన్‌(Mortuary van) కూడా పేదవాడికి కరువైన పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో ఇలాంటి అమానవీయ ఘటన అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. బిడ్డ చనిపోయిన దుఖంలో ఉన్న తండ్రి శవాన్ని భుజంపై మోసుకొని సుమారు పాతిక కిలోమీటర్లు25 kilometers ఇంటికి తీసుకెళ్లిన వీడియో(Video)ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో విపరీతంగా వైరల్(Viral)అవుతోంది.

Viral video : ఇద్దరు కూతుళ్లపై తండ్రి అత్యాచారం .. బయటపెట్టినందుకు ఏం జరిగిందో ఈ వీడియో చూడండి


ప్రభుత్వ ఉద్యోగల నిర్లక్ష్యం ..
ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే దృశ్యం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని కర్చన పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దేహా గ్రామానికి చెందిన 14సంవత్సరాల కేశవ్ అనే బాలుడికి ఆరోగ్యం బాగోకపోతే తల్లిదండ్రులు భుజంపై మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే బాలుడి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతూ చనిపోయాడు కేశవ్. బిడ్డ చనిపోయాడన్న వార్తను డాక్టర్లు తల్లిదండ్రులకు చెప్పారు. చనిపోయిన బిడ్డను తిరిగ స్వగ్రామానికి తీసుకెళ్లడానికి ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్, మార్చురీ వ్యాన్‌ ఏర్పాటు చేయలేదు. కేశవ్ తల్లిదండ్రుల దగ్గర కూడా డబ్బులు లేకపోవడంతో చనిపోయిన బిడ్డను కేశవ్ తండ్రి భుజాన వేసుకొని దేహ గ్రామానికి బయల్దేరాడు.

25కిలో మీటర్లు శవాన్ని మోసిన పేరెంట్స్ ..
బాలుడు కేశవ్ మృతదేహాన్ని ప్రయాగ్‌రాజ్‌లోని ఎస్‌ఆర్‌ఎన్‌ ఆసుపత్రి నుంచి స్వగ్రామమైన దేహా వరకు అలాగే భుజంపై శవాన్ని మోసుకుంటూ తండ్రి రోడ్డుపై పరుగులు తీయడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. బిడ్డ చనిపోయిన దుఖంలో ఉన్న తల్లిదండ్రులు 14ఏళ్ల కొడుకును 25కిలోమీటర్లు మోసుకుంటూ తీసుకెళ్లారు. కేశవ్ తండ్రికి నీరసం వస్తే తల్లి కొద్ది దూరం బిడ్డ మృతదేహాన్ని మోస్తూ ఇంటికి చేరుకున్నారు. రోడ్డు మార్గంలో ఓ తల్లిదండ్రులు చనిపోయిన బిడ్డను మోసుకెళ్తుంటే జనం చోద్యం చూస్తుండిపోయారు తప్ప ఏ ఒక్కరూ సహాకరించలేదు. కనీసం అంబులెన్స్‌ ఏర్పాటు చేయలేదు.

మానవత్వం కరువైపోయింది..
పేదరికంతో పాటు తల్లిదండ్రుల నిస్సహాయస్థితి చూసిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వార్త వైరల్ అయింది. వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. 75ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కనీసం పేదవాడు చనిపోతే తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ కూడా ఏర్పాటు చేయలేని ధీనస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయా అంటూ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. యూపీలో యోగి సర్కారుకు ఇలాంటి దృశ్యాలు కనిపించడం లేదా అని విమర్శిస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Uttar pradesh, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు