FATHER BUYS AN ENTIRE ICE CREAM VAN TO GIVE HIS KIDS WHY HERE IS THE FULL DETAILS GH VB
Ice-Cream Van: పిల్లల కోసం ఐస్ క్రీమ్ వ్యాన్ కొనుగోలు చేసిన తండ్రి.. ఎందుకో తెలుసా..?
పిల్లలకు కోసం తీసుకున్న ఐస్ క్రీం వ్యాన్ (Image credit : facebook)
Ice-Cream Van: అమెరికాఓహియోకు చెందిన జోయ్ వెజెనర్ తన పిల్లల్లో ఇద్దరు డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతుండగా.. వారి జీవనోపాధి కోసం ఏకంగా ఓ ఐస్ క్రీమ్ ట్రక్కే కొనుగోలు చేశాడు. డౌన్ సిండ్రోమ్ అనే అసహజ వ్యాధితో బారిన పడటంతో వారికి ఉద్యోగాలు దొరకడం కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. పూర్తి వివరాలివే..
పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంత కష్టమైనా పడతారు. తల్లిదండ్రులను వదిలేసినా పిల్లలు ఉన్నారు కానీ.. పిల్లలకు ఇబ్బందులు వచ్చాయని వారిని వదిలేసిన పేరేంట్స్ లేరనే చెప్పాలి. తాజాగా అమెరికాఓహియోకు చెందిన జోయ్ వెజెనర్ ఈ జాబితాలోకి వస్తాడు. తన పిల్లల్లో ఇద్దరు డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతుండగా.. వారి జీవనోపాధి కోసం ఏకంగా ఓ ఐస్ క్రీమ్ ట్రక్కే కొనుగోలు చేశాడు. డౌన్ సిండ్రోమ్ అనే అసహజ వ్యాధితో బారిన పడటంతో వారికి ఉద్యోగాలు దొరకడం కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికా ఓహియోలో ఉంటున్న జోయ్ వెజెనర్ కు 10 మంది పిల్లలు. వారిలో మేరీ కేట్, జోష్ డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారు. ఈ కారణంగా అందరిలా చదువు, ఉద్యోగం ఆ పిల్లలకు అంత సులభమైన విషయం కాదు. ఆర్థిక పరంగా సమస్యలను అధిగమించడంతో పాటు కమ్యునికేషన్, సామాజిక నైపుణ్యాలను వారిలో మెరుగుపరచాలని భావించిన జోయ్ ఓ నిర్ణయానికి వచ్చాడు. వినియోగదారులకు సర్వీస్ చేయడంతో పాటు పిల్లలకు జీవనోపాధి దొరుకుతుందని భావించి ఐస్ క్రీమ్ వ్యాన్ ను కొనుగోలు చేశాడు.
వారి కుటుంబమంతా మేరీ, జోష్‌కు అండగా నిలబడ్డారు. వీరిద్దరూ ఈ వ్యాపారాన్ని నడుపుతున్నారు. జోయ్ భార్య ఫ్రీదా ఈ బిజినెస్ కు 'స్పెషల్ నీట్ ట్రీట్' అనే పేరు పెట్టారు. ఇప్పటి వరకు 5 వేల ఐస్ క్రీమ్స్ విక్రయించామని, కస్టమర్ స్కిల్స్ కూడా నేర్చుకున్నామని జోష్ పేర్కొన్నారు. నీవు పెద్దయ్యాక ఏం చేస్తావని తన కుమార్తెనుఎప్పుడు అడిగినా సరే నేను కుటుంబం కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధమేనని చేబుతుంటుందని జోయ్ తెలిపారు. ఐస్ క్రీమ్స్ అమ్మాలనే ఆలోచన అప్పుడే వచ్చిందని, ఇది చాలా అద్భుతమైన ప్రయాణమని, తమ కుటుంబ వ్యాపారాన్ని రాబోయే కాలంలో విస్తరించనున్నామని స్పష్టం చేశాడు.
ఫండ్ రైజింగ్ కంపెనీలో వర్క్ చేసే జోయ్ ఈ ఐస్ క్రీమ్స్ వ్యాపారం చాలా బాగుందని, ఇతరులను ప్రభావితం చేయడం ఆనందంగాన్ని ఉందని తెలిపాడు. మీ సామర్థ్యాలు ఎలా ఉన్నా.. పని చేయాలని ఆలోచన ఉంటే ఇతరులకు ఆనందాన్ని పంచవచ్చని, వారితో ఇంటరాక్ట్ అవ్వచ్చని చెప్పాడు.జోయ్ కుటుంబం తమ సమీప ప్రాంతమైన లవ్ ల్యాండ్ లో ఐస్ క్రీమ్స్ విక్రయిస్తూ ఇంకా తమ సర్వీసును కొనసాగిస్తోంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.