హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: ఎలక్ట్రిక్ బైక్‌కు చార్జింగ్‌ పెడుతుండగా మంటలు - ప్రమాదంలో తండ్రి, కూతురు సజీవదహనం

OMG: ఎలక్ట్రిక్ బైక్‌కు చార్జింగ్‌ పెడుతుండగా మంటలు - ప్రమాదంలో తండ్రి, కూతురు సజీవదహనం

Tamil Nadu:ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్‌ పెట్టడం వల్ల తండ్రి, కూతురు మృతి చెందిన ఘటన వేలూరులో అందర్ని కలచివేసింది. రాత్రి నిద్రపోతున్న సమయంలో ఈఘటన జరగడంతో వాళ్లు అరుపులు, కేకలు వేసినప్పటికి స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మంటల్లో ఇద్దరూ సజీవదహనమయ్యారు.

ఇంకా చదవండి ...

ఎలక్ట్రిక్ వస్తువులు ఎంత సౌకర్యంగా పని చేస్తాయో..వాటితో అంతే ప్రమాదం పొంచి ఉంటుంది. ఎలక్ట్రిక్ వస్తువు ఏదైనా అధికంగా ఛార్జింగ్ పెడితే ప్రాణాలు పోయేంత ప్రమాదం తలెత్తుతుందని ఆ తండ్రీ కూతురికి తెలియలేదు. తమిళనాడు (Tamilnadu)వేలూరు (Vellore) జిల్లా అల్లాపురం (Allapuram)లో ఘోర విషాదం నెలకొంది. స్థానికంగా ఉంటున్న దురైవర్మ (Duraivarma)ఓ ఎలక్ట్రిక్ బైక్‌ని మూడ్రోజుల క్రితమే తిరువణ్ణమలై (Thiruvannamalai)జిల్లా పోలూరు సమీపంలోని ఓ ఎలక్ట్రిక్ బైక్‌ డీలర్‌షాపులో 95వేల రూపాయలతో కొనుగోలు చేశాడు. ఆ ఎలక్ట్రిక్ బైకే electric bikeఅతని పాలిట మృత్యుపాశంగా మారుతుందని ఊహించలేకపోయారు. బైక్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చి రాత్రి నిద్రపోయే ముందు ఛార్జింగ్(Charging)పెట్టి పడుకున్నారు. ఎలక్ట్రిక్ బైక్‌లోని బ్యాటరీలో మంటలు అంటుకొని టూవీలర్ పూర్తిగా దగ్దమైంది. కొత్త ఎలక్ట్రిక్ బైక్‌తో పాటు పక్కనే పార్క్ చేసిన పెట్రోల్‌తో నడిచే మరో బైక్‌కు మంటలు అంటుకోవడంతో ఇల్లంతా మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం రాత్రి వేళ జరగడంతో ఇంట్లో యజమానిలి తురైవర్మతో పాటు అతని 13సంవత్సరాల కూతురు మోహన ప్రీతి (Mohana Preethi)మంటల్లో కాలి సజీవన దహనమైపోయారు. స్థానికంగా ఈఘటన తీవ్రకలకలం రేపింది. నిద్రపోతున్న తండ్రి, కూతుళ్లు ఎలక్ట్రిక్ బైక్‌ కారణంగా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవడంతో గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు.

ఇద్దరి ప్రాణాలు బలితీసుకున్న కొత్త బైక్..

పొల్యూషన్ కంట్రోల్, పెట్రోల్‌ ధరల నుంచి సేఫ్‌గా బయటపడేందుకు ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసుకున్నాడు తురైవర్మ. బైక్ కొన్న 24గంటలు తిరగక ముందే అతనితో పాటు కుమార్తె ప్రీతి కూడా ప్రాణాలు పోగొట్టుకోవడం సంచలనం రేపింది. బైక్‌తో పాటు ఇంటికి మంటలు అంటుకోవడంతో తండ్రి, కూతురు ప్రాణభయంతో కేకలు వేశారు. ఇంటి చుట్టు పక్కల ఉన్న వాళ్లు సైతం మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. తండ్రి, కూతురిని కాపాడేందుకు రెస్క్యూ చేశారు. మంటలు ఇంటి చుట్టూ వ్యాపించడం, లోపలికి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో స్థానికులు కాపాడలేకపోయారు.

తమిళనాడు వేలూరులో ఎలక్ట్రిక్ బైక్‌ చార్జింగ్ పెడుతుండగా ప్రమాదం..మంటల్లో తండ్రి, కూతురు మృతి  |Father and daughter killed in fire while charging electric bike in Vellore Tamil Nadu
(ఎలక్ట్రిక్ బైక్‌ బ్యాటరీలో మంటలు..ఇద్దరు సజీవ సహనం)

నైట్‌ ఛార్జింగ్ పెట్టడమే ప్రమాదం..

వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలార్పేందుకు ప్రయత్నించేలోపే లోపలున్న దురైవర్మ, అతని కూతురు మోహన ప్రీతి అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఇద్దరి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Tamil nadu, VIRAL NEWS

ఉత్తమ కథలు