బిడ్డను నవమాసాలు మోసి కనేది తల్లే అయినా తండ్రికి ఆ బిడ్డపైన అంతకు మించిన ప్రేమ, ఆప్యాయత ఉంటుంది. కన్నబిడ్డ కోసం ఓ తండ్రి చేసిన సాహసం ఇప్పుడు అందర్ని కంటతటి పెట్టిస్తోంది. మూడేళ్ల బిడ్డను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా తన నూరేళ్ల జీవితాన్ని త్యాగం చేశాడు. కట్టుకున్న భార్యను ఒంటరిని చేసి కన్నీరు మిగిల్చాడు. బిడ్డతో పాటు భర్త ఇద్దరూ దూరమైన ఆ అభాగ్యురాలి బాధ వర్ణనాతీతంగా మారింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. ఉత్తరప్రదేశ్(Uttar pradesh)మిర్జామురాద్(Mirzamurad)లో జరిగిన ఈసంఘటన ఇప్పుడు వైరల్ (Viral)అవుతోంది.
బిడ్డను కాపాడబోయి తండ్రి..
బీహార్‌కి చెందిన 32సంవత్సరాల హీరా రైన్ తన భార్య జరీనాతో పాటు మూడేళ్ల కూతురు, బావ ఫిరోజ్‌తో కలిసి ట్రైన్లో ఢిల్లీ నుంచి బిహార్‌కి బయల్దేరారు. ట్రైన్ ప్రయాణికులతో రద్దీగా ఉండటంతో జనరల్ కంపార్ట్మెంట్ పూర్తిగా నిండిపోయింది. అయితే జరీనా తన మూడేళ్ల కూతుర్ని పట్టుకొని ట్రైన్ డోర్ దగ్గర నిల్చుంది. ట్రైన్ వేగానికి రన్నింగ్‌లో ఉండగానే చిన్నారి పాప రైలులోంచి పడిపోయింది. తన బిడ్డను కాపాడుకోవాలనే కంగారులో హిరా రైన్ కదులుతున్న ట్రైన్లోంచి బయటకు దూకాడు. భర్త, కూతురు ఇద్దరూ రైలులోంచి బయట పడటంతో వెంటనే భార్య జరీనా చైన్ లాగి ట్రైన్‌ను ఆపింది.
డెత్ జర్నీ ..
ట్రైన్‌లోని తోటి ప్రయాణికులతో పాటు జరీనా, ఆమె సోదరుడు ఫిరోజ్ అందరు కిందపడిన వాళ్లను రక్షించేందుకు పరుగులు పెట్టారు. చిన్నారి స్పాట్లో మృతి చెందగా..హీరా రైన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచాడు.
మిన్నంటిని రోదనలు ..
అప్పటికే ఇద్దరూ ప్రమాదంలో మృతి చెందారు. ఈసంఘటన మిర్జామురాబాద్ పోలీస్ పరిధిలోని బహెడా హాల్ట్ సమీపంలో చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన ఈసంఘటనలో మృతదేహాలను పోస్టుమార్టం పూర్తి చేశారు. శవాలను అప్పగించేందుకు బంధువులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని ఇన్స్పెక్టర్ మీర్జామురాద్ రాజీవ్‌సింగ్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Train accident, Uttar pradesh