500 సార్లు వీర్యదానం చేసిన తండ్రి.. అమ్మాయిల జోలికి వెళ్లేందుకే భయపడిపోతున్న కొడుకు.. అసలు కథేంటంటే..

Zave Fors (Facebook Photo )

తన తండ్రి చేసిన వీర్య దానం వల్ల అతడికి ఊహించని కష్టం వచ్చి పడింది. ప్రస్తుతం యుక్తవయసులో ఉన్న అతడు ఎవరిని ప్రేమించాలన్నా భయపడిపోతున్నాడు. ఏ ఒక్క అమ్మయినైనా..

 • Share this:
  ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కష్టం. కష్టాలు లేని మనిషే ఈ ప్రపంచంలో ఉండడు. కటిక పేద వ్యక్తి అయినా, కోటీశ్వరుడయినా కష్టసుఖాల మాధుర్యాన్ని అనుభవించిన వాళ్లే. ఒక్కొక్కరు ఒక్కో తరహా కష్టంతో జీవనాన్ని సాగిస్తున్నవాళ్లే. అయితే ఓ వ్యక్తి మాత్రం విచిత్రమైన కష్టాన్ని ఎదుర్కొటున్నాడు. తన తండ్రి చేసిన ఓ దాతృత్వం వల్ల అతడికి ఊహించని కష్టం వచ్చి పడింది. ప్రస్తుతం యుక్తవయసులో ఉన్న అతడు ఎవరిని ప్రేమించాలన్నా భయపడిపోతున్నాడు. ఏ ఒక్క అమ్మయినైనా రొమాంటిక్ గా చూడాలంటేనే, అలా ఆలోచించాలంటేనే వణికిపోతున్నాడు. చివరకు పెళ్లి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటానంటూ వాపోతున్నాడు. అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో ఓ యువకుడు ఎదుర్కొంటున్న వింత సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  అగ్రరాజ్యం అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో జేవ్ ఫోర్స్ అనే యువకుడికి 24 ఏళ్ల వయసు. తన తోటి వాళ్లంతా డేటింగ్ యాప్స్ లో చేరి అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ డేటింగ్ కు వెళ్తోంటే తాను మాత్రం వాటి జోలికి వెళ్లడానికే భయపడిపోతున్నాడు. దీనికి కారణం వాళ్ల నాన్నే. అలాగని అతడేమీ వాడొద్దని కండీషన్ పెట్టలేదు. మనోడే తెగ టెన్షన్ పడిపోతున్నాడు. దానికి కూడా ఓ కారణం ఉందండోయ్. జేవ్ తండ్రి యుక్తవయసులో ఉన్నప్పుడు ఏకంగా 500 సార్లు వీర్యదానం చేశాడట. జేవ్స్ డేటింగ్ చేయాలన్నా, ఎవరినైనా ప్రేమించాలన్నా అతడి వయసుకు దగ్గర్లో ఉన్నవారినే ప్రేమించాలి. అదే అతడికి భయం కలిగిస్తోంది.
  ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో చార్టెడ్ అకౌంటెంట్.. రూ.3000 కోసం ట్రై చేస్తే.. ఏకంగా రూ.6,00,000 పోగొట్టుకున్నాడు.. అసలేం జరిగిందంటే..

  తాను ప్రేమించబోయే యువతులకు తన తండ్రే వీర్యదానం చేసిన వ్యక్తి అయితే పరిస్థితి ఏంటన్నదే అతడి భయం. తల్లులు వేరయినా జన్యుపరంగా తండ్రి తన తండ్రే అవుతాడు కదా అన్నదే అతడి డౌటు. అందుకే డేటింగ్ యాప్స్ జోలికే పోవడం లేదు. తన తండ్రి వీర్యదానం గురించి తెలిసి తన సోదరసోదరీమణులను కనిపెట్టేందుకు జేవ్ ప్రయత్నిస్తున్నాడు కూడా. ఇప్పటికే ఎనిమిది మందిని కనిపెట్టేశాడు. వారిలో ఒకరు తన స్కూల్లో తనతోపాటు చదివిన వ్యక్తే అవడం గమనార్హం.
  ఇది కూడా చదవండి: బావిలోంచి అరుపులు.. ఏంటా అని చూస్తే లోపల ఓ యువతి, ఓ యువకుడు.. అసలేం జరిగిందంటే..

  అంతేకాకుండా తన పక్కన ఉన్న రెండు అపార్ట్మెంట్లలో ఓ ఇద్దరు యువతులు తనకు సోదరీమణులు అవుతారని గుర్తించాడు. డీఎన్ఏ టెస్టుల ఆధారంగానే వారు తన సోదరసోదరీమణులు అవుతారన్న నిర్ణయానికి వచ్చాడు. అందుకే గుర్తు తెలియని అమ్మాయిలతో డేటింగ్ చేసి, ఆ తర్వాత వాళ్లు తన తండ్రి వీర్యదానం వల్ల పుట్టిన వాళ్లని తెలిసి బాధపడటం కంటే డేటింగ్ యాప్స్ కు దూరంగా ఉండటమే బెటర్ అన్నది అతడి వాదన. పెళ్లి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాననీ, ముందుగానే డీఎన్ఏ టెస్ట్ చేయిస్తానని కూడా జేవ్ చెబుతున్నాడు.
  Published by:Hasaan Kandula
  First published: