• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • FASTEST FINGER FIRST JNU COMPUTER OPERATOR HOLDS NINE GUINNESS RECORDS FOR TYPING SKILLS MK GH

Guinness records: ముక్కుతో కీబోర్డు టైపింగ్.. గిన్నిస్ రికార్డు సాధించిన జెఎన్‌యూ ఉద్యోగి

(ప్రతీకాత్మక చిత్రం)

వినోద్‌కుమార్ చౌద‌రి (41) న్యూఢిల్లీలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ విశ్వ‌విద్యాల‌యంలోని స్కూల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్సెస్ విభాగంలో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. అతడు విభిన్న రకాలుగా కీ బోర్డ్ టైపింగ్ చేయగలడు. ఒకసారి ముక్కుతో, మరోసారి క‌ళ్ల‌కు గంత‌ల‌తో, ఇంకోసారి నోటిక‌ర్ర‌తోనూ వేగంగా టైపు చేయ‌డంలాంటి ఫీట్ల‌తో వినోద్ గిన్నిస్ రికార్డు సాధించాడు.

  • Share this:
అసాధ‌ర‌ణ ప్ర‌తిభతో ఏకంగా తొమ్మిది సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు ఒక సాధారణ ఉద్యోగి. ముక్కుతో, క‌ళ్ల‌కు గంత‌ల‌తో, నోటి క‌ర్ర‌తోనూ వేగంగా టైప్ చేసి.. అతడు ఈ రికార్డులు సొంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. వినోద్‌కుమార్ చౌద‌రి (41) న్యూఢిల్లీలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ విశ్వ‌విద్యాల‌యంలోని స్కూల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్సెస్ విభాగంలో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. అతడు విభిన్న రకాలుగా కీ బోర్డ్ టైపింగ్ చేయగలడు. ఒకసారి ముక్కుతో, మరోసారి క‌ళ్ల‌కు గంత‌ల‌తో, ఇంకోసారి నోటిక‌ర్ర‌తోనూ వేగంగా టైపు చేయ‌డంలాంటి ఫీట్ల‌తో వినోద్ గిన్నిస్ రికార్డు సాధించాడు.

వినోద్‌కుమార్‌కి సామాజిక బాధ్య‌త, నిబ‌ద్ధ‌త ఉంది. అందుకే ఆయ‌న పేద, వికలాంగ పిల్లల కోసం త‌న ఇంటిలో ఓ కంప్యూటర్ సెంటర్ న‌డుపుతున్నారు. ఈ కంప్యూట‌ర్ సెంట‌ర్ గోడ‌లు వినోద్ సాధించిన గిన్నిస్ రికార్డుల‌తో క‌నిపిస్తుంటాయి. వినోద్‌కుమార్ చౌద‌రి గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డులో 19సార్ల‌కుపై గా ఎక్కాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నాడు. క్రికెట్ దేవుడు స‌చిన్‌పేరిట 19 గిన్నిస్ రికార్డులు ఉన్నాయి. వీటిని అధిగ‌మించాల‌నేది వినోద్ లక్ష్యం. గత ఏడాది కోవిడ్ కార‌ణంగా విధించిన లాక్డౌన్ లో ఒక్క నిమిషంలో వినోద్ చేతితో టెన్నిస్ బంతిని 205 సార్లు తాక‌డం ద్వారా తన తాజా రికార్డును సృష్టించాడు.

చిన్న‌ప్ప‌టి నుంచి ఆట‌లంటే వినోద్‌కుమార్ చౌద‌రికి ఎంతో ఇష్టం. కానీ ఆరోగ్య స‌మ‌స్య‌లు ఆయ‌న ఇష్టానికి ప్ర‌తిబంధకంగా మారాయి. దీంతో ఆట‌లు మీదున్న ఇష్టాన్ని మ‌రేదైనా విష‌యంపై కొన‌సాగించాల‌నే ఆలోచ‌న‌తో కంప్యూట‌ర్ టైపింగ్‌ను వేగంగా చేయ‌డంపై దృష్టిసారించాడు. చేతుల‌తోనే కాకుండా విభిన్నంగా టైపు చేయ‌డానికి వినోద్ కృషి చేశాడు. ఈ క్ర‌మంలో 2014లో వినోద్ ముక్కుతో 46.30 సెకన్లలో 103 అక్షరాలను టైప్ చేసి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు. ఇప్ప‌టిదాకా ముక్కుతో ఇంత త‌క్కువ స‌మ‌యంలో టైపు చేసిన‌వారు లేరు.

ఒక్క‌సారి గిన్నిస్‌బుక్ స‌ర్టిఫికెట్ పొందాక.. ఆ ప్రేర‌ణ‌తో మ‌రిన్ని రికార్డుల కోసం ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. దీంతో 2016 లో క‌ళ్ళ‌కు గంత‌లు క‌ట్టుకుని 6.71 సెకన్లలో వర్ణమాలలను వేగంగా టైప్ చేసినందుకు, అలాగే క‌ళ్ళ‌కు గంత‌లు లేకుండా వ‌ర్ణ‌మాల‌ల‌ను 6.09 సెకన్లలో వేగంగా టైప్ చేసిన గిన్నిస్ రికార్డుల‌ను సొంతం చేసుకున్నాడు.

ఇక వినోద్ మ‌రో అడుగు ముందుకేసి 2017లో నోటిలో క‌ర్ర‌తో 18.65 సెక‌న్ల‌లోనే అన్ని వ‌ర్ణ‌మాల‌ల‌ను టైప్ చేసి మ‌రో గిన్నిస్ ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. అదే ఫీట్‌ను 17.69 సెకన్లలో, ఆపై 2019 లో 17.01 సెకన్లలో సాధించి 2018 లో తన సొంత రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఇక 2019 లో వినోద్ ఏకంగా ఒక వేలితోనే అన్ని వ‌ర్ణ‌మాల‌ల‌ను కేవ‌లం 29.53 సెక‌న్ల‌లో టైప్ చేసి మ‌రో సారి గిన్నిస్‌లో చోటు సంపాదించాడు. స‌చిన్ టెండూల్క‌ర్‌లా గిన్నిస్‌లో 19కిపైగా రికార్డ‌లు స్థాపించ‌డ‌మే త‌న‌ ల‌క్ష్యం అని చెప్పే వినోద్‌కుమార్ చౌద‌రి ఇందుకోసం తాను స‌రికొత్త‌గా ఆలోచిస్తున్న‌ట్టు చెప్పాడు.
Published by:Krishna Adithya
First published: