బోల్ట్ రికార్డ్ బ్రేక్ చేసిన కన్నడిగ.. 9.55 సెకన్లలోనే 100 మీటర్లు

బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తగల గౌడకు మంచి శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్‌లో మెడల్స్ తీసుకురావడం ఖాయమని.. ఆ దిశగా ప్రభుత్వాలు సహాయసహకారాలు అందించాలని కన్నడిగులు కోరుతున్నారు.

news18-telugu
Updated: February 14, 2020, 3:03 PM IST
బోల్ట్ రికార్డ్ బ్రేక్ చేసిన కన్నడిగ.. 9.55 సెకన్లలోనే 100 మీటర్లు
కంబళ పోటీల్లో శ్రీనివాస గౌడ
  • Share this:
ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే వ్యక్తి ఉసేన్ బోల్ట్..! జమైకాకు చెందిన ఈ పరుగుల వీరుడు చిరుత కంటే వేగంగా పరుగెత్తగలడు. 9.58 సెకన్లలో 100 మీటర్లు పరిగెత్తి రికార్డు సృష్టించాడు. ఐతే రన్‌మెషీన్‌ ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తే వ్యక్తి మన ఇండియాలో ఉన్నాడు. అవును.. కర్నాటకకు చెందిన ఓ యువకుడు ఉసేన్ బోల్ట్ రికార్డును బద్దలుకొట్టాడు. కర్నాటక సంప్రదాయ క్రీడ కంబళ పోటీల్లో గేదెలతో బురద పొలాల్లో పరుగులు పెట్టి.. 30 ఏళ్ల కంబళ చరిత్రను సైతం తిరగరాశాడు.

ఇటీవల కర్నాటకలో జరిగిన కంబళ పోటీల్లో కంబళ జాకీ (గేదెలు, ఎద్దులను నియంత్రించే వ్యక్తి) శ్రీనివాస గౌడ్ (28) రికార్డు సృష్టించాడు. కేవలం 13.62 సెకండ్లలోనే 142.50 మీటర్లు పరుగులు తీశాడు. అదే 100 మీటర్లకు లెక్కిస్తే.. కేవలం 9.55 సెకండ్లు మాత్రమే. గతంలో 100 మీటర్లను 9.58 సెకన్లలో పూర్తిన రికార్డు ఉసేన్ బోల్ట్ పేరిట ఉంది. ఈ లెక్కన 0.03 సెకన్ల ముందే శ్రీనివాస్ గౌడ ఈ ఫీట్ అందుకున్నట్లు భావించాలి.

ఐతే వాస్తవానికి కంబళ రికార్డును స్ప్రింట్‌తో సరిపోల్చకూడదు. ఎందుకంటే స్ప్రింట్‌లో వ్యక్తులు మాత్రమే పరుగెత్తతారు. కానీ కంబళలో రెండు గేదెలతో పాటు వాటి జాకీ పరుగెత్తుతాడు. ఈ స్పీడ్ అందుకున్న ఘనత గేదెలకే చెందినప్పటికీ.. వెనకాల నుంచి జాకీ తరమడం వల్లే ఆ వేగం అందుకుంటాయని.. అలాటంప్పుడు ఆ క్రెడిట్ జాకీకే దక్కుతుందంటున్నారు కన్నడిగులు. శ్రీనివాస గౌడను ఆకాశాతికెత్తుతూ.. ఫ్యూచర్ ఒలింపిక్ స్టార్‌గా కొనియాడుతున్నారు.

నాకు కంబళ అంటే చాలా ఇష్టం. నా రెండు గేదెలకే ఈ ఘనత దక్కుతుంది. అవి చాలా పరుగెత్తాయి. నేను కేవలం నడిపించానంతే.
శ్రీనివాస గౌడకంబళ అనేది దక్షిణ కన్నడ, ఉడుపి, తుళునాడు తీర ప్రాంతంలో ప్రతి ఏడాది నిర్వహించే సంప్రదాయ క్రీడ. కంబళ ఆటలో పోటీదారుడు (బఫెలో జాకీ) బురద నీటిలో తమ రెండు గేదెలు లేదా ఎద్దులతో పరుగెడతాడు. ఎవరైతే గేదెలను వేగంగా పరుగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారే విజేతలు. కర్ణాటకలో వ్యవసాయం చేసే గౌడ సామాజిక వర్గం వారు కంబళ పోటీల్లో ఎక్కువగా పాల్గొంటారు.

శ్రీనివాస గౌడ 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. కుటుంబంలో ఆర్థిక సమస్యల కారణంగా చదువు ఆపేసి పనులు చేసేవాడు. ప్రస్తుతం భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు శ్రీనివాస గౌడ. గత ఐదేళ్లుగా కంబళ పోటీల్లో పాల్గొంటున్నాడు. ఐతే బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తగల గౌడకు మంచి శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్‌లో మెడల్స్ తీసుకురావడం ఖాయమని.. ఆ దిశగా ప్రభుత్వాలు సహాయసహకారాలు అందించాలని కన్నడిగులు కోరుతున్నారు.
First published: February 14, 2020, 3:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading