డాక్టర్ కాబోయి ఫ్యాషన్ స్టైలిస్ట్ అయిన ప్రియాంక సహజానంద

Priyanka Sahajananda : ఫ్యాషన్ స్టైలిస్ట్ అయిన ప్రియాంక సహజానంద... తన అద్భుతమైన కాస్ట్యూమ్స్‌తో టాలీవుడ్ సెలబ్రిటీలను కట్టిపడేస్తున్నారు.

news18-telugu
Updated: January 24, 2020, 12:11 PM IST
డాక్టర్ కాబోయి ఫ్యాషన్ స్టైలిస్ట్ అయిన ప్రియాంక సహజానంద
ప్రియాంక సహజానంద కాస్ట్యూమ్స్ (credit - insta - impriyankasahajananda)
  • Share this:
Priyanka Sahajananda : ప్రియాంక సహజానంద ఇప్పుడీ పేరు టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. గతేడాది తెలంగాణలో ది బెస్ట్ ఎమర్జింగ్ సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా అవార్డ్ పొందిన ప్రియాంక... నిజానికి ఏపీలోని అనంతపురం నుంచీ వచ్చి... హైదరాబాద్‌లో సెటిలైన యువతి. ఓవైపు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ... మరోవైపు... టాలీవుడ్ సెలబ్రిటీలకు... అదిరిపోయే కాస్ట్యూమ్స్ ఇస్తూ... అందరి మెప్పూ పొందుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 2లో వర్క్ చేసిన ప్రియాంక... అప్పట్లోనే... కొంతమంది కంటెస్టెంట్లకు కాస్ట్యూమ్స్ సెట్ చేశారు. అవి నచ్చడంతో... క్రమంగా ఆమె పేరు టాలీవుడ్‌లో అందరికీ చేరింది. చిత్రమేంటంటే... ఇంటర్ తర్వాత విదేశాలకు వెళ్లి... సైకాలజీ కోర్స్ చేసి... ఆ తర్వాత మెడిసిన్ చేసిన ప్రియాంక... తిరిగి ఇండియా వచ్చి... తన వాళ్లను వదిలేసి విదేశాల్లో ఉండటం కష్టమని భావించారు. అందువల్లే ఇండియాలో సెటిల్ అయ్యేందుకు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్‌ని ఎంచుకున్నారు. ఇప్పుడు అదే ఫీల్డ్‌లో అద్భుతాలు చేస్తూ... అందరి ప్రశంసలూ అందుకుంటున్నారు.

ప్రస్తుతం... నభా నటేష్, నిధి అగర్వాల్, పాయల్ రాజ్‌పుత్, సురభి, సుమ, పూర్ణ, కాజల్ అగర్వాల్, వితికాషెరు, వరుణ్ సందేశ్, హంసా నందిని... ఇలా చాలా మంది టాలీవుడ్ ముద్దుగుమ్మలకు అదిరిపోయే కాస్ట్యూమ్స్ ఇస్తున్నారు ప్రియాంక. ఎక్కడా అసభ్యత లేకుండా... చూడటానికి ఎంతో బ్రైట్ లుక్‌తో, మోడ్రన్ స్టైల్స్‌తో ఆకట్టుకుంటున్నాయి ఆమె ఇస్తున్న డిజైన్స్.


ఫ్యాషన్ ఇండస్ట్రీలో అందరికీ అవకాశాలు ఉంటాయంటున్న ప్రియాంక... ఇందులోకి వచ్చేవారు క్రియేటివ్‌గా ఆలోచించాలనీ, రోజూ ఏదో ఒకటి కొత్తగా చెయ్యాలని చెబుతున్నారు. ఫ్యాషన్‌పై ప్యాషన్ ఉంటే... కచ్చితంగా ఈ ఇండస్ట్రీ నచ్చుతుందని వివరించారు.డాక్టర్ కాబోయి యాక్టర్ అవ్వడం సహజం. ప్రియాంక మాత్రం డాక్టర్ కాబోయి ఫ్యాషన్ స్టైలిస్ట్‌గా మారారు. ఐతే... ఇదేమంత ఈజీ కాదంటున్నారామె. మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెబుతున్నారు. ముఖ్యంగా రెండు ఫీల్టులూ వేర్వేరు కావడంతో... ఎడ్జస్ట్ అవ్వడానికి కొంత టైమ్ పట్టిందంటున్నారు. ఢీ, 10 టీమ్ లీడర్, సిక్స్ సెన్స్, బిగ్ బాస్ 11, స్ప్లిట్స్ విల్లా, MTV రోడీస్ ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్‌కి ఆమె ఇప్పుడు కాస్ట్యూమ్స్ డిజైన్స్ చేస్తున్నారు. ఆమెకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుందామా.
First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు