Kisan Credit Card: రైతులకు అలర్ట్... రుణాలు చెల్లించకపోతే ఈ చిక్కులు తప్పవు

Kisan Credit Card loans | కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ తీసుకున్నారా? ఇంకా రుణం చెల్లించలేదా? ఆగస్ట్ 31 లోగా లోన్ చెల్లించకపోతే ఈ చిక్కులు తప్పవు.

news18-telugu
Updated: July 15, 2020, 12:15 PM IST
Kisan Credit Card: రైతులకు అలర్ట్... రుణాలు చెల్లించకపోతే ఈ చిక్కులు తప్పవు
Kisan Credit Card: రైతులకు అలర్ట్... రుణాలు చెల్లించకపోతే ఈ చిక్కులు తప్పవు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతదేశంలోని 7 కోట్ల మంది కిసాన్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు అలర్ట్. గడువు లోగా రుణాలు చెల్లించకపోతే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఆగస్ట్ 31 లోగా రుణాలు చెల్లిస్తే రైతులు 4 శాతం వడ్డీ చెల్లిస్తే చాలు. కానీ గడువు దాటిందంటే 7 శాతం వడ్డీ చెల్లించాలి. అంటే అదనంగా 3 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. సాధారణంగా రుణాలు చెల్లించడానికి గడువు మార్చి 31 వరకే ఉంటుంది. మార్చి 31 లోగా రుణాలు చెల్లించిన రైతులు తర్వాతి సీజన్‌కు లోన్స్ తీసుకోవచ్చు. చాలావరకు రైతులు గడువులోగా రుణాలు చెల్లించి మళ్లీ కొత్త లోన్స్ తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల బ్యాంకుల దగ్గర వీరికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు సులువుగా లోన్ లభిస్తూ ఉంటుంది. కానీ ఈసారి కరోనా వైరస్ సంక్షోభం, లాక్‌డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం గడువును మే 31 వరకు పొడిగించింది. కరోనా వైరస్ సంక్షోభం కొనసాగుతూ ఉండటంతో మరోసారి గడువును ఆగస్ట్ 31 వరకు పొడిగించింది. అంటే మొత్తం 5 నెలలు గడువు పొడిగించింది. అప్పట్లోగా కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించే రైతులు కేవలం 4 శాతం వడ్డీ చెల్లిస్తే చాలు.

Loan: ష్యూరిటీ లేకుండా రైతులకు రుణాలు... ఎలా తీసుకోవాలంటే

SBI Rules: ఎస్‌బీఐలో డబ్బులు డ్రా చేయడానికి రూల్స్ ఇవే

ఉదాహరణకు ఓ రైతు కిసాన్ క్రెడిట్ కార్డుపై రూ.3 లక్షల లోన్ తీసుకున్నాడనుకుందాం. దానికి 9 శాతం వడ్డీ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 2 శాతం సబ్సిడీ ఇస్తుంది కాబట్టి 7 శాతం వడ్డీనే వర్తిస్తుంది. అయితే గడువు లోగా రుణాలు చెల్లించే రైతులకు మరో 3 శాతం వడ్డీ తగ్గుతుంది. ఈ లెక్కన రైతులకు 4 శాతం వడ్డీనే వర్తిస్తుంది. గడువు లోగా లోన్స్ చెల్లించకపోతే 7 శాతం వడ్డీ వర్తిస్తుంది. భారతదేశంలోని రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా రైతులు తక్కువ వడ్డీకే లోన్ తీసుకోవచ్చు. దీని వల్ల మార్కెట్‌లో ఎక్కువ వడ్డీకే అప్పులు చేయాల్సిన అవరం లేదు. అంతేకాదు... ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.1.60 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.
Published by: Santhosh Kumar S
First published: July 15, 2020, 12:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading