ఏరువాక పౌర్ణమి అంటే.. రైతులకు, దీనికి మధ్య సంబంధం ఏంటంటే..

వైశాఖ మాసం ముగిసి జేష్ఠం మొదలైన తరువాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటుఇటు అయినా జేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడకమానదు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 17, 2019, 10:02 AM IST
ఏరువాక పౌర్ణమి అంటే.. రైతులకు, దీనికి మధ్య సంబంధం ఏంటంటే..
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 17, 2019, 10:02 AM IST
తొలకరి పిలుపు.. రైతన్న మోము చిగురు.. పిల్ల కాలువల గెంతులాట.. పుడమి తల్లి పులకరింతకు సాక్ష్యమే ఏరువాక పౌర్ణమి. వ్యవసాయ పండుగ ప్రారంభంలో వచ్చే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమిగా పిలుస్తారు. నాగలి పట్టి.. హలాల దున్ని.. నాటు వేసే ఈ సందర్భం రైతన్నకు అతి కీలకం. ఈ సందర్భంలోనే పౌర్ణమి వస్తుంది కాబట్టి అది అన్నదాతలకు ఇష్టమైన పౌర్ణమి అయ్యింది. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తరువాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటుఇటు అయినా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడకమానదు. భూమి మెత్తబడక మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయ పనులకు ఇది శుభారంభం. ఏరువాక అంటే దుక్కిని ప్రారంభించడం. ఈ రోజు రైతులు వ్యవసాయ పనిముట్లను అన్నిటినీ కడిగి శుభ్రం చేసి పసుపు -కుంకుమ అద్ది పూజిస్తారు. పశువులను అలంకరిస్తారు. రైతులందరూ ఒకేసారి వ్యవసాయ పనులను ప్రారంభించే విధంగా ఏరువాకను వర్ణిస్తారు. జేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంచుమించు దేశమంతటా ఒకేలా ఉంటుంది. దేశంలో దాదాపు 80శాతం వర్షపాతం నైరుతి వల్లే కలుగుతుంది. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిని దేశమంతటా ఘనంగా జరుపుకుంటారు.

ఏరువాకను జ్యోతిష శాస్త్రవేత్తలు కృష్యారంభం, సస్యారంభం అని కూడా వ్యవహరిస్తారు. ఏరువాక పౌర్ణమిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పాటిస్తారు. పాడిపంటలకు, పొలం పనులకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకావద్దని కోరుకుంటూ ఈ ప్రక్రియను ఒక మహా యజ్ఞంగా పరిగణించి ఆచరిస్తారు. నాగేటి సాల్లల్లో సీత దొరికింది కాబట్టి సీతా యజ్ఞంగానూ భావిస్తారు.

మరో విశేషం ఏమిటంటే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు ఒడిశాలోని పూరీలో శ్రీ జగన్నాథ స్వామికి స్నానోత్సవం నిర్వహిస్తారు. జగన్నాథ, సుభద్ర, బలరాములకు స్నానవేదికపై స్నానం చేయించి, పదిహేను రోజుల పాటు విశ్రాంతి కోసం ఏకాంతంగా ఉంచుతారు. ఈ పదిహేను రోజులు భక్తులకు దర్శనం ఉండదు. స్వామివారికి ప్రతీకగా ఒక చిత్రపటాన్ని గర్భగుడి ముందు ఉంచుతారు. తిరిగి ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున స్వామి వారి దర్శనం భక్తులకు లభిస్తుంది.

First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...