హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: ఒక్క మామిడి చెట్టుకు 300రకాల మామిడి పండ్లు ..అద్భుతమైన చెట్టు వీడియో ఇదిగో

Viral Video: ఒక్క మామిడి చెట్టుకు 300రకాల మామిడి పండ్లు ..అద్భుతమైన చెట్టు వీడియో ఇదిగో

mango tree(Photo:Youtube)

mango tree(Photo:Youtube)

Viral Video:ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలో ఉన్న ఓ మామిడి తోటలో ఉన్న చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలోనే 300 కంటే ఎక్కువ రకాల మామిడి పండ్లు పండే ఏకైక చెట్టు అదే కావడం విశేషం.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

సమ్మర్ వచ్చింది. మామిడి పండ్ల సీజన్ ప్రారంభమైంది. కాని ఫలాల్లో రాజుగా చూసే మామిడిలో ఒక రకం కాదు. ఎన్నో రకాల పండ్లు మార్కెట్‌లో దొరుకుతాయి. ఆ విషయం అందరికి తెలుసు. కాని ఒకే చెట్టుకు వందల రకాల మామిడి కాయలు, పండ్లు కాస్తున్నాయంటే ఎవరైనా నమ్ముతారా..నమ్మాలి తప్పదు. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో అలాంటి మామిడి చెట్టును పెంచి పండ్లు అమ్ముతున్నాడు ఓ రైతు. అసలు ఒక చెట్టుకు 300రకాల(300 Types) మామిడి పండ్లు(Mangos) కాయడం ఏమిటో..ఆ చెట్టు ఎలా ఉందో ఈ వీడియో (Video)చూడండి.

మామిడి వృక్షం కాదు మహావృక్షం..

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి కొన్ని కిలోమీటర్ల దూరంలో, మలిహాబాద్ కూడలికి సమీపంలో ఓ మామిడి తోట ఉంది. నాలుగు ఎకరాల మామిడి తోటలో ఒక మామిడి చెట్ట ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలోనే 300 కంటే ఎక్కువ రకాల మామిడి పండ్లు పండే ఏకైక చెట్టు అది కావడం విశేషం. ఎలా అంటే ఆ చెట్టుకు కాసే ప్రతి మామిడి కాయ రంగు, రుచి, సైజులో పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మలిహాబాద్ నివాసి హాజీ కలీమ్ ఉల్లాఖాన్ అనే 83 ఏళ్ల వృద్దుడు ఈ చెట్టును ప్రస్తుతం సంరక్షిస్తున్నాడు.

ఒకే చెట్టుకు 300రకాల పండ్లు..

అరుదైన మామిడి పంట్లు కాస్తున్న ఒకే చెట్టును పెంచుతున్న రైతు హజీ కలీమ్ 17ఏళ్ల వయసులో మొక్కలు పెంచడం అలవాటు చేసుకున్నాడు. ఏడో తరగతి వరకు మాత్రమే చదువుకోవడంతో తండ్రితో నర్సరీలో పని చేస్తూ అంటుకట్టు విధానం ద్వారా ఒకే మొక్క నుంచి వేర్వేరు రకాల పండ్లు ఎలా ఉత్పత్తి చేయవచ్చనే విషయంపై పరిశోధన చేశాడు. మొదటి సారి అంటుకట్టు విధానం ద్వారా చెట్టును పెంచాడు. ఆ చెట్టుకు ఏడు రకాల మామిడి పండ్లు కాసాయి. కాని అతివృష్టి కారణంగా ఆ చెట్టు దెబ్బతినడంతో తర్వాత 1987లో మళ్లీ ఆ చెట్టును పని చేశాడు.

OMG: పళ్ళు తోముకోవడం, బట్టలు ఉతకడమే కాదు మూత్రంతో మరో ఆరు ప్రయోజనాలు ..షాకింగ్ న్యూస్

పద్మశ్రీ పురస్కారం..

ఆవిధంగా అదే చెట్టును అనేక సార్లు అంటుకట్టు విధానంతో పెంచుకుంటూ ఇప్పుడు మహావృక్షంగా మార్చాడు. ఈ అతిపెద్ద మామిడి చెట్టు నుంచే 300రకాల పండ్లు..కొన్ని వేల పండ్లు వస్తున్నాయి. ఈ అద్భుత చెట్టు రహస్యాన్ని తెలుసుకోవడానికి, జపాన్ బృందం కూడా ఇక్కడికి వచ్చి, వారి స్థలంలో ఈ చెట్టును పెంచే కళ గురించి వారి నుండి సమాచారం తీసుకుంది.ఇంతటి అద్భుతమైన చెట్టును సంరక్షిస్తున్నందుకు అతనిలోని అద్భుతమైన పని తీరును ప్రశంసిస్తూ 2008లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌చే పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

First published:

Tags: Mango, Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు