పాల వ్యాపారం చేసేందుకు ఎవరైనా ఏం చేస్తారు.. ఆటోలు, ట్రాలీలు, ట్రక్కులపై వెళ్లి పాలు విక్రయిస్తుంటారు. కానీ ఓ రైతు మాత్రం పాల వ్యాపారం కోసం ఏకంగా హెలికాఫ్టర్ కొనేశాడు. ఇందుకోసం రూ. 30 కోట్లు ఖర్చు చేశాడు. వివరాలు.. మహారాష్ట్ర భీవండికి చెందిన రైతు జనార్దన్ భోయిర్ తన డెయిరీ బిజినెస్ కోసం పంజాబ్, హర్యానా, రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాలకు పలుమార్లు వెళ్లాల్సి వస్తోంది. అయితే అతడు వెళ్లే రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలకు ఎయిర్పోర్ట్ సదుపాయం లేదు. దీంతో జర్నీ కోసం అతడు చాలా సమయం కేటాయించాల్సి వస్తోంది. దీంతో జనార్ధన్ తన స్నేహితుడి సలహా మేరకు హెలికాఫ్టర్ కొనుగోలు చేశారు. "నా వ్యాపారం కోసం నేను తరుచూ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అందుకే నేను హెలికాఫ్టర్‌ను కొనుగోలు చేశాను. నా డెయిరీ వ్యాపారాన్ని, వ్యవసాయన్నిచూసుకోవడం నాకు చాలా అవసరం" అని జనార్దన్ చెప్పాడు.
ఈ హెలికాఫ్టర్ ఆదివారం రోజున హెలికాఫ్టర్‌తో జనార్ధన్ గ్రామంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఇక, ఆ గ్రామ పంచాయతీ సభ్యులు ఒకసారి హెలికాఫ్టర్‌లో రైడ్ చేసేందుకు జనార్దన్ ఆఫర్ ఇచ్చాడు. మార్చి 15న హెలికాఫ్టర్ తన చేతికి అందనుందని తెలిపాడు. ఇక, తన 2.5 ఎకరాల స్థలంలో రక్షణ గోడతో పాటు పాటు హెలీప్యాడ్ నిర్మించడానికి జనార్ధన్ ఏర్పాట్లు చేశాడు. అక్కడ హెలికాఫ్టర్ గ్యారేజ్‌తో పాటు, పైలట్ రూమ్, టెక్నీషియన్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఇక, జనార్ధన్‌కు 100 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్టుగా సమాచారం. వ్యవసాయం, డెయిరీ బిజినెస్‌తో పాటుగా అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. ఇక, భీవండిలో అనేక పెద్ద కంపెనీలు గిడ్డంగులు కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ఈ గిడ్డంగుల కోసం కంపెనీలు వాటి యజమానులకు పెద్ద మొత్తంలో అద్దె చెల్లిస్తారు. జనార్ధన్‌కు కూడా చాలా గిడ్డంగులు ఉండటంతో.. పెద్ద మొత్తంలో అద్దె లభిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmer, Maharashtra, MILK