స్వర్గీయ టిక్కు... కుక్కకు నెల మాసికం... ఇట్లు ప్రేమతో

Dog and Family : విశ్వాసానికి మారుపేరైన ఆ కుక్కకు నెల మాసికం జరిపింది ఆ ఫ్యామిలీ. కుక్కతో ఏర్పడిన అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 18, 2019, 2:48 PM IST
స్వర్గీయ టిక్కు... కుక్కకు నెల మాసికం... ఇట్లు ప్రేమతో
టిక్కూకి నెలమాసికం
  • Share this:
సొంత మనుషుల్నే సరిగా చూసుకోని రోజులు ఇవి. అలాంటిది ఆ ఫ్యామిలీ తమ ఇంట్లోని కుక్క చనిపోతే... దానికి కర్మ కాండలు జరిపి... నెల తర్వాత నెల మాసికం చేసి... పత్రికలో ప్రకటన కూడా ఇచ్చింది. నిజామాబాద్ జిల్లా... ముప్కాల్ మండలంలో... 14 ఏళ్ల కిందట 2005 నవంబర్ 3న పుట్టింది ఓ కుక్క పిల్ల. దాన్ని ఇంటికి తెచ్చుకున్నారు గద్దల సంజీవ్ కుటుంబ సభ్యులు. దానికి టిక్కు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వారి ప్రేమాభిమానాలకు అది ఇంట్లో సభ్యురాలిలా మారిపోయింది. వారి పట్ల ఎనలేని విశ్వాసాన్ని చూపూతూ... బతికినంతకాలం రక్షణ కల్పించింది. అలాంటి టిక్కూ... 14 ఏళ్ల తర్వాత... ఈ ఏడాది ఏప్రిల్ 17న ప్రాణాలు విడిచింది. కుక్క మరణాన్ని తట్టుకోలేకపోయారు కుటుంబ సభ్యులు. టిక్కూ అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ... కర్మకాండలు జరిపించారు. 10 రోజుల తర్వాత పెద్ద కర్మ నిర్వహించారు. మే 17న నెల మాసికం కూడా జరిపి... పత్రికలో ప్రకటన ఇచ్చారు.

viral news,viral videos,viral news today,viral,tamil news,daily news,dalit news,hd viral videos,viral video,news,top viral videos,x viral video,most viral videos,viral videos 2019,viral videos 2017,best viral videos,funny viral videos,bayi viral,x viral video hd,new viral video,latest news,abs-cbn news,philippine news,viral video 2017,new viral videos 2017,funny viral video,tamil viral video,కుక్క, వైరల్ న్యూస్, శునకం, జాగిలం, వైరల్ వార్త, సోషల్ మీడియా,
టిక్కూకి నెలమాసికం


కుక్కతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆ ఫ్యామిలీ ఇచ్చిన పత్రికా ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంత మంచి కుక్క ఆత్మకు శాంతి కలగాలని అందరూ కోరుకుంటున్నారు.

 

ఇవి కూడా చదవండి :

తల్లి నుంచీ తప్పిపోయిన బాతు పిల్లలు... ఆ కారు డ్రైవర్ ఏం చేశాడంటే...

వామ్మో మోతే... ఇక రైల్వే పట్టాలపై చెత్త వేస్తే భారీ ఫైన్...లగడపాటి సర్వే సిద్ధం... ఎగ్జిట్‌ పోల్స్ ఏం చెప్పినా...

చంద్రబాబుకి బూస్ట్ ఇస్తున్న సబ్బం హరి... టీడీపీ గెలుపుపై ఆయన విశ్లేషణ ఏంటంటే...

Bigg Boss 13 : బిగ్ బాస్ 13లో పసుపు చీర పోలింగ్ అధికారి..?

 
First published: May 18, 2019, 2:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading