Home /News /trending /

New Year 2021: రాత్రి మందెక్కువైందా..? ఈ సింపుల్ చిట్కాతో మత్తు వదిలించండి..

New Year 2021: రాత్రి మందెక్కువైందా..? ఈ సింపుల్ చిట్కాతో మత్తు వదిలించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

How To Cure HangOver after Party: పార్టీ ఎంజాయ్ చేయడం అటుంచి పొద్దున లేచిన తర్వాత హ్యాంగ్ ఓవర్ (Hangover) నరకం చూపించడం ఖాయం. హ్యాంగ్ ఓవర్ పెగ్గు వేస్తామంటారా..? అంతకన్న ముందు ఈ ఇంటి చిట్కాలు పాటించి రాత్రి మత్తును దించుకోండి...

  • News18
  • Last Updated :
    ప్రపంచమంతా కొత్త సంవత్సరపు వేడుకల్లో మునిగి తేలింది. కొత్త ఏడాదికి అంతా ఘన స్వాగతం పలికారు. ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం. కరోనా కారణంగా దాపురించిన దరిద్రం ఈ ఏడాదైనా వదలాలని.. అందరి జీవితాలు భాగుండాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక మందుబాబుల గురించి ప్రత్యేకించి చెప్పాలా..? మాములు సమయంలోనే వారిని ఆపడం కష్టం. ఇక ఇలాంటి గ్రాండ్ ఈవెంట్ల సమయంలో మద్యం ఏరులై పారాల్సిందే. కానీ పీకలదాకా తాకితే అది ప్రమాదమే. మన తాహతుకు మించి తాగిన మందు కూడా అరగకపోగా.. అనవసర రోగాలను తీసుకొస్తుందని మరిచిపోవద్దు.

    కాగా మందు తాగడం.. పార్టీ ఎంజాయ్ చేయడం అటుంచి పొద్దున లేచిన తర్వాత హ్యాంగ్ ఓవర్ (Hangover) నరకం చూపించడం ఖాయం. హ్యాంగ్ ఓవర్ పెగ్గు వేస్తామంటారా..? అంతకన్న ముందు ఈ ఇంటి చిట్కాలు పాటించి రాత్రి మత్తును దించుకోండి...

    నీళ్లు ఎక్కువగా తాగండి..
    రాత్రంతా తాగి తాగి ఉన్న వీరులారా.. పొద్దున లేవగానే మీ తల పట్టేయడం ఖాయం. అతిగా మందు తాగడం వల్ల అందులో విటమిన్లు, పోషకాలు అందక మీ బాడీ డీ హైడ్రేట్ అవుతుంది. పొద్దున లేచింది మొదలు ఎంత నీరు తాగితే అంత మంచిది.

    నిమ్మకాయ, తేనె రసం..
    ఉదయం లేవగానే కొన్ని నీళ్లు తాగని తర్వాత.. కొంత గ్యాప్ ఇచ్చి నిమ్మరసంలో చిటికెడంత తేనె కలిపి తాగండి. ఈ మిశ్రమంలో పొరపాటున కూడా చక్కెర కలపొద్దు. అది మొదటికే మోసం.

    నీరు ఎక్కువగా ఉండే పండ్లు...
    రాత్రి తాగింది మాములు మందా..? రెండు పెగ్గులు పడ్డాక.. అసలు ఏం తాగుతున్నామో.. ఎంత తాగుతున్నామో తెలియకుండా తాగే మహానుభావులు చాలా మందే ఉంటారు. వారికి ఉదయం లేవగానే తల పట్టేస్తుంది. ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే.. పుచ్చకాయలు, ద్రాక్షలు వంటి నీరు ఎక్కువగా ఉన్న పండ్లు తినండి. ఇవి మీ హ్యాంగ్ ఓవర్ నుంచి త్వరగా ఉపశమనాన్నిస్తాయి.

    బెల్లం..
    రాత్రి తాగిందంతా దిగాలంటే.. నువ్వుల గింజలకు బెల్లం కలుపుకుని తినండి. దాన్లో కొద్దిగా అల్లం వేసినా ఫలితం బాగుంటుంది.

    అరటి..
    ఫుల్లుగా తాగడం వల్ల మన బాడీలోఉండే పొటాషియం, మెగ్నిషియం స్థాయిలు పడిపోతాయి. వాటిని తిరిగి నింపడానికి రెండు అరటి పండ్లు తినండి.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: New Year 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు