పడిలేచిన మనసు... ప్రపోజల్ చెప్పబోయి జారిపడిన ప్రియుడు... వైరల్ వీడియో

తన ప్రేమను వ్యక్తం చేయడానికి అదే సరైన సమయం అనుకున్నాడు. ప్లాన్ చేసుకున్నాడు. చివరి క్షణంలో... జారి పడ్డాడు.

news18-telugu
Updated: July 11, 2020, 9:10 AM IST
పడిలేచిన మనసు... ప్రపోజల్ చెప్పబోయి జారిపడిన ప్రియుడు... వైరల్ వీడియో
పడిలేచిన మనసు... ప్రపోజల్ చెప్పబోయి జారిపడిన ప్రియుడు... వైరల్ వీడియో (credit - Facebook)
  • Share this:
"ప్రియా ఐలవ్యూ... మనం పెళ్లి చేసుకుందామా?" అని చెప్పడానికి... ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రయత్నిస్తారు. సరైన టైంలో, సరైన ప్రదేశంలో ఆ మాట చెప్పి... ప్రియురాలి మనసు దోచుకోవాలని అనుకుంటారు. ఇప్పటివరకూ ఎవరూ చెప్పని విధంగా చెప్పాలని కాసింత ప్రయత్నిస్తారు. మిచిగాన్‌లో లోగాన్ జాక్సన్ కూడా మంచి ప్లాన్ వేసుకున్నాడు. విశాల సముద్ర తీరాన ప్రపోజ్ చెయ్యాలనుకున్నాడు. తన ప్రియురాలు మారియా గుగ్లియోట్టాను గ్రాండ్ హెవెన్‌లోని బీచ్‌కి తీసుకొచ్చాడు. ఆమె సముద్రాన్ని చూస్తుండగా... ప్రపోజ్ చెయ్యడానికి దగ్గరకు వెళ్తూ... అక్కడి ఓ రాయిపై కాలు వేసి... జారి నీటిలో పడ్డాడు. వెంటనే తేరుకొని... అప్పుడు ప్రపోజ్ చేశాడు. వెంటనే ఆమె ఒప్పుకుంది. అక్కడున్న అంతా కేరింతలు కొట్టారు.

అతను జారి పడినప్పుడు... పెద్దగా గాయాలు కాలేదు. ఆ రింగ్ కూడా పోలేదు. అందువల్ల అతని ప్లాన్ డిజప్పాయింట్ కాలేదు. పడి లేచిన అతని మనసును స్వీకరిస్తూ... ముద్దుతో ముంచెత్తింది ఆమె. ఈ వీడియోని మారియా... తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో జులై 5న షేర్ చేసింది. ఆమె ఫ్రెండ్స్ ఇది చూసి... నవ్వుతూ... కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.


ఇదో ప్రత్యేకమైన ప్రపోజల్ అనీ... ఆమె కోసం పడి లేచాడని అంతా మెచ్చుకుంటున్నారు. ఈ ప్రపోజల్ వాళ్ల జీవితాంతం గుర్తుండిపోతుందని అంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 11, 2020, 9:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading