‘అర్జంట్ అందరికీ పంపండి’ అంటూ వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్...

అర్జంట్. అందరికీ పంపండి అంటూ ఓ ఫేక్ న్యూస్ తాజాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: February 19, 2020, 10:17 PM IST
‘అర్జంట్ అందరికీ పంపండి’ అంటూ వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్...
Fake Jobs: ఉద్యోగాల పేరుతో మోసాలు... అప్రమత్తంగా ఉండాలంటున్న ఎయిర్ ఇండియా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
అర్జంట్. అందరికీ పంపండి అంటూ ఓ ఫేక్ న్యూస్ తాజాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ రోజు రాత్రి 12.30 నుంచి 03.30 గంటల వరకు సెల్ ఫోన్లు, టాబ్లెట్స్, ఫోన్లు అన్నీ ఆపేసి శరీరానికి దూరంగా పెట్టాలంటూ ఓ వార్త బాగా సర్క్యులేట్ అవుతోంది. ‘ఈ రోజు రాత్రి 12.30 నుంచి 3.30 వరకు ఫోన్, సెల్యులార్, టాబ్లెట్ మొదలైనవి ఆపేసి, మీ శరీరం నుంచి దూరంగా ఉంచండి. సింగపూర్ టెలివిజన్ ఈ వార్తను ప్రకటించింది. దయచేసి మీ కుటుంబసభ్యులకు, స్నేహితులకు పంపండి. ఈ రాత్రి మన గ్రహం మీద 12.30 నుంచి 3.30 వరకు రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. కాస్మిక్ కిరణాలు భూమికి దగ్గరగా వెళ్తాయి. పరికరాలను మీ దగ్గరగా ఉంచొద్దు. ఇది మీకు భయంకరమైన నష్టాన్ని కలిగిస్తుంది. గూగుల్, నాసా, బీబీసీ వార్తలను తనిఖి చేయండి. మీకు ముఖ్యమైన వ్యక్తులకు ఈ సందేశాన్ని పంపండి.’ అంటూ ఓ మెసేజ్ వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్ట్


సాధారణంగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం లాంటి సందర్భాల్లో ఇలాంటి వార్తలు తరచుగా ప్రచారం అవుతూ ఉంటాయి. ఆ సమయాల్లో సహజంగా ప్రజల్లో ఉండే ఆందోళనలను దఋష్టిలో పెట్టుకుని ఇలాంటివి ఎక్కువగా వ్యాప్తిలోకి వస్తుంటాయి.
First published: February 19, 2020, 10:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading