మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారంటారు. కానీ అలాంటి వారి అడ్రస్ పట్టుకుని అవసరమైనప్పుడు ప్రజల్లోకి పంపడాన్ని పెద్ద వ్యూహంగా మార్చుకుంటున్నారు ప్రపంచ నేతలు. ఆశ్చర్యంగా ఉన్నా రాజకీయాల్లో ఇది కూడా ఓ ట్రెండే (political trend). ఇప్పటికే సద్దాం హుసేన్, వ్లాదిమిర్ పుతిన్ (Putin body double), ట్రంప్ (Trump body double)వంటివారు ఇలాంటి ట్రిక్కులు ప్లే చేసినట్లు మనం చాలానే చూశాం. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం కనుక కమలా హారిస్ (Kamala Harris body double)కూడా దీన్నే ఫాలో అవుతున్నారని నెటిజన్స్ భావిస్తున్నారు.
కమలాను పోలిన మహిళ
అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న కమలా హారిస్ ఓవైపు ప్రచారపర్వంలో దూసుకుపోతూనే మరోవైపు అచ్చు తనలాగే ఉన్న మరో మహిళను (Fake Kamala Harris) ప్రచార పర్వంలోకి దించినట్లు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Is this a Kamala Harris Body Double ?
It sure look like it ?
What do y’all think? pic.twitter.com/fYmhrtuHNf
— Terrence K. Williams (@w_terrence) November 1, 2020
ట్రంప్ సొంత జిల్లాలోనే..
అధ్యక్షుడు ట్రంప్ సొంత జిల్లా అయిన ఫ్లోరిడాలో ఆదివారం మధ్యహ్నం ఉన్నట్టుండి ఓటర్లతో సందడి చేస్తున్న కమలా హారిస్ ఫుటేజీలు చూసిన వారంతా ఈమె నిజమైన కమలా కాదని తేల్చేస్తున్నారు. అంతేకాదు కమలాకు ఈమెకు మధ్య పోలికలు చాలానే ఉన్నప్పటికీ చాలా తేడాలు కూడా ఉన్నాయని పట్టి చూపిస్తున్నారు. ఇక దీనిపై డెమాక్రాట్లు, రిపబ్లికన్స్ మధ్య వాడివేడి ట్వీట్ల పరంపర సాగుతోంది. మొత్తానికి వైరల్ గా మారిన ఈ వీడియో ఇప్పుడు అమెరికాలో రచ్చ రచ్చ చేసేస్తోంది. మియామీ సిటీలో కమలా హ్యారిస్ (Kamala in Miami) అంటూ హ్యాష్ ట్యాగ్ ఉద్యమం (#KamalaBodyDouble )సాగుతోంది.
Why is Kamala Harris using a body double?@realDonaldTrump @dbongino #KamalaBodyDouble pic.twitter.com/eXRJFsm9Dg
— Edward Baker (@Edward_767) November 1, 2020
అక్కడ కూడా ఇది ట్రెండే..
మనదేశంలో ఎన్నికలనగానే మోడీ, మన్మోహన్, జయలలిత, ఎమ్జీఆర్, కరుణానిధి, మాయావతి, లాలూ, రాహుల్, కేసీఆర్, జగన్ వంటి ఎంతోమంది లీడర్లను పోలినవారు రంగంలోకి దిగి ప్రచారంలో మరింత ఉత్సాహం నింపుతారు. విదేశాల్లోనూ ఈ ట్రెండ్ ఇటీవలి కాలంలో తెగపుంజుకుంటోంది. మెలేనియా ట్రంప్, హిల్లరీ క్లింటన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా గతంలో పలు సందర్భాల్లో తమను పోలిన వారిని ప్రజలపై ప్రయోగించారని అంతర్జాతీయ మీడియా తేల్చింది. దీంతో కమలా కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతూ ప్రచారంను ఉధృతంగా చేస్తున్నారన్నమాట.
3 దేశాల్లోనూ ఆమెపైనే చర్చ
నవంబరు 3న జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, జో బిడెన్ మధ్య నువ్వా-నేనా అన్న రీతిలో హోరాహోరీగా పోటీ నెలకొనగా, ప్రిలిమినరీ ఫలితాల్లో మాత్రం ట్రంప్ పై బిడెన్ పైచేయి సాధించినట్టు సర్వేలు అంచనా వేస్తున్నాయి. భారతీయ మూలాలున్న కమలా హారిస్ జయాపజయాలపై అటు అమెరికన్లు, ఇటు భారతీయులు మరోవైపు జమైకన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
కమలా తల్లిది మన దేశం కాగా తండ్రిమాత్రం నైజీరియాకు చెందినవారు కనుక సహజంగానే భారత్-నైజీరియా రెండు దేశాల్లోనూ ఇప్పుడు కమలా హారిస్ జయాపజయాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే కమలా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైతే అమెరికా చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైనట్లే. మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలు, తొలి బ్లాక్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్, ఫస్ట్ ఏషియన్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ గా కమలా సరికొత్త రికార్డు సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నారన్నమాట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Donald trump, Kamala Harris