హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Fact Check - Indian Railway: అదానీ చేతికి భారతీయ రైల్వే? నిజమిదే.. మరి రైతు ఉద్యమంతో లింకేంటి..?

Fact Check - Indian Railway: అదానీ చేతికి భారతీయ రైల్వే? నిజమిదే.. మరి రైతు ఉద్యమంతో లింకేంటి..?

Twitter image

Twitter image

Fact Check - Indian Raiway: ఓ రైలు బోగీపై అదానీ(Adani) సంస్థ పోస్టర్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral)గా మారింది. దీంతో రైల్వేలను ఆ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తోందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

భారతీయ రైల్వేను ప్రైవేటు పరం చేస్తున్నారన్న అంశం కొంతకాలంగా దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు దీన్ని వ్యతిరేకిస్తుంటే.. మరికొందరు సమర్థిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ విషయంపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. తాజా ఓ వీడియోతో రైల్వేలను అదానీ సంస్థకు కేంద్రం ఇచ్చేస్తోందంటూ కొందరు నెటిజన్లు రాసుకొస్తున్నారు. ప్రస్తుతం ఇది వైరల్​ గా మారింది.

ఆదానీ సంస్థకు చెందిన ఫార్చ్యూన్ చక్కీ, ఆదానీ విల్​మర్​ కు  సంబంధింన అడ్వర్టై జ్ మెం పోస్టర్లు ఓ రైలుపై ఉండగా..​ ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఓ ఫే​స్ బుక్​ యూజర్​ పోస్ట్ చేసి.. “అదానీ పోర్టులు, అదానీ పవర్​, అదానీ కోల్​ ఇండియా, అదానీ రైల్వేస్​” అని పోస్ట్ చేశాడు. మరికొందరు సైతం ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు.

కాసేపటేకే ఈ వీడియో వైరల్ అవడంతో పాటు ట్విట్టర్ కు వేగంగా పాకింది. “రైల్వేల ఆస్తులు త్వరలో ప్రైవేటు సెక్టార్ కు అమ్మబోతున్నారు” అంటూ ఓ యూజర్ పోస్ట్ చేశాడు.  అయితే రైలు బోగీలపై ప్రకటనలు ఉండడం సహజమని, దీని ఆధారంగా రైల్వేను అమ్మేశారనడం తప్పుడు వార్త అని కొందరు అధికారులు స్పష్టం చేశారు.

గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ అదానీ ప్రకటనతో ఉన్న రైలు ఈ వీడియోను రైతుల ఉద్యమంతో లింక్ చేశారు. “అదానీ తాజా పిండి అడ్వర్టైజ్​ మెంట్​ను భారతీయ రైల్వేలపై చూడడం బాగా అనిపిస్తోంది. దీన్ని గమనిస్తే రైతుల ఉద్యమం సరైన దారిలోనే సాగుతోందని మనం కచ్చితంగా చెప్పగలం” అని ట్వీట్ చేశారు. మరికొందరు కూడా రైతుల ఉద్యమానికి మద్దతుగా కామెంట్లు చేస్తూ ఈ వీడియోను పోస్ట్ చేశారు.

కాగా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు 16 రోజుల నుంచి రహదారులపైనే ఉంటూ రైతులు ఉద్యమం చేస్తున్నారు. పలుసార్లు కేంద్రంతో చర్చలు జరిపినా సఫలం కాకపోవడంతో పోరుబాటను కొనసాగిస్తున్నారు. రోజురోజుకూ కర్షకులకు మద్దతు పెరుగుతోంది.

First published:

Tags: Fact Check, Indian Railway

ఉత్తమ కథలు