Fact Check : ఆమె ఒకే కాన్సులో 17 మందికి జన్మనిచ్చిందా? నిజమేనా?

Fact Check : కౌరవులు వందమంది. అవి పురాణాలు. రియల్ లైఫ్‌లో ఒక మహిళ మాగ్జిమం ఆరేడుగురు పిల్లల్ని కనడం చూశాం. మరి 17 మందిని కన్న మహిళ ఎవరు?

Krishna Kumar N | news18-telugu
Updated: June 20, 2019, 9:51 AM IST
Fact Check : ఆమె ఒకే కాన్సులో 17 మందికి జన్మనిచ్చిందా? నిజమేనా?
ఆమె ప్రపంచ రికార్డ్ సృష్టించిందా? (image : FB / Richard Camarinta Dy)
Krishna Kumar N | news18-telugu
Updated: June 20, 2019, 9:51 AM IST
అమెరికాకు చెందిన ఈ మహిళకు ఒకే కాన్పులో 17 మంది పిల్లలు పుట్టారని, ఇది ప్రపంచ రికార్డ్ అని ఫేస్‌బుక్‌లో ఓ వార్త హల్ చల్ చేసింది. అది చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆమెకు అంత మంది ఎలా పుట్టారు, అంతమంది కడుపులో ఎలా పెరిగారు. ఆమె ఎలా తట్టుకోగలిగింది? అసలిది సాధ్యమేనా? ఒకవేళ పుడితే, అందరూ ఆరోగ్యంగానే ఎలా ఉంటారు? ఇలా ఎన్నో డౌట్లు పుట్టుకొచ్చాయి. ఇండియానాపోలిస్‌లోని కేథరిన్ బ్రిడ్జికి పుట్టిన పిల్లలు అంటూ వారి ఫొటోలు కూడా పెట్టడంతో... ఇది నిజమేనేమో అనుకున్నారు చాలా మంది. దానికితోడు... ఆ 17 మందికి ఏ పేర్లు పెట్టింది కూడా వివరాలు ఇవ్వడంతో... అది నిజమైన న్యూసే కావచ్చని అభిప్రాయపడుతూ ఆశ్చర్యపోయారు అంతా.



ఇండియాలోని యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూం (AFWA) ఈ వార్తను పరిశీలించింది. ఇదో నకిలీ వార్తగా తేల్చేసింది. ఆమెకు పుట్టింది ఒక బిడ్డే. ఫొటోను ఫొటోషాప్ ద్వారా మార్ఫింగ్ చేసి... నమ్మిస్తున్నారని తెలిపింది. అంతే కాదు... ఒరిజినల్ ఫొటో ఇదీ అని అసలు నిజాన్ని బయటపెట్టింది.

fact check,fact check of fake news,news,latest viral news,fake news,latest news,fact check lallantop,viral news,face check,modi fact check,political news,viral,breaking news,little faced mitt,national news,the five fox news,congress office viral video,fake news india,telugu news,mind the news,viral videos,fake news by it cell,sahar tabar facts,election news,mayawati news,latest congress news,army news,ఫాక్ట్ చెక్, ఫేక్ న్యూస్, వైరల్ న్యూస్,
ఫాక్ట్ చెక్‌లో తేలిన అంశం




అందువల్ల ఇది ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. సోషల్ మీడియా ఎంత మంచిదో అంత ప్రమాదకరమైనది కూడా. నెట్‌లో వచ్చే ప్రతి న్యూస్ నిజమైపోదు. జాగ్రత్తగా గమనించుకోకపోతే, ఫేక్ న్యూస్ ఉచ్చులో చిక్కే ప్రమాదం ఉంది.

 

ఇవి కూడా చదవండి :

చంద్రబాబుకి మరో షాక్... బీజేపీ లోకి ఆరుగురు టీడీపీ ఎంపీలు..?

IRCTC : రూ.20వేలతో అండమాన్ నికోబార్ చూసిరావచ్చు... రైల్వే ఆఫర్...


చెర్రీ ఫ్రీడమ్ పొందిన చైనా... మరి మనకెప్పుడు యాపిల్ ఫ్రీడమ్?


Video : అయ్యో పాపం... ఐదేళ్ల చిన్నారిపై కుక్కల దాడి...
First published: June 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...