Fact Check: సైకిల్‌పై వెళ్తున్న బాలుడిని పోలీసులు హెల్మెట్ అడిగారా?

హెల్మెట్ లేనందుకు పోలీసులు సైకిల్ సీజ్ చేశారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సైకిల్‌పై వెళ్తున్న బాలుడిని ఆపి ఎందుకు పోలీసు ప్రశ్నించాడో తమిళనాడు పోలీసు అధికారులు వివరణ ఇచ్చారు.

news18-telugu
Updated: September 17, 2019, 2:16 PM IST
Fact Check: సైకిల్‌పై వెళ్తున్న బాలుడిని పోలీసులు హెల్మెట్ అడిగారా?
సైకిల్ నడుపుతున్న విద్యార్థిని ప్రశ్నిస్తున్న పోలీసు
  • Share this:
హెల్మెట్ లేనందుకు సైకిల్‌ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. అయితే ఇందులో వాస్తవం లేదంటూ తమిళనాడు పోలీసులు వివరణ ఇచ్చారు. మోటార్ వాహన సవరణ బిల్లు మేరకు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై భారీ జరిమానాలు ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చాయి. నిబంధనలను ఉల్లంఘించి ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని ధర్మపురిలో వాహన తనిఖీలు చేపడుతున్న పోలీసులు...ఓ సైకిల్‌ని సీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. సైకిల్ నడుపుతున్న విద్యార్థి హెల్మెట్ వేసుకోలేదంటూ పోలీస్ సైకిల్‌ని సీజ్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు.

హెల్మెట్ వేసుకోలేదన్న కారణంతో ఫైన్ చెల్లించాలంటూ సైకిల్‌ను పోలీసులు సీజ్ చేశారన్న కథనాల్లో వాస్తవం లేదని పోలీసులు స్పష్టంచేశారు. రెండు చేతలను వదిలేసి ప్రమాదకరమైన రీతిలో ఆ విద్యార్థి సైకిల్ నడపుతున్నందున పోలీసు...ఆ విద్యార్థిని ఆపి ప్రశ్నించినట్లు తెలిపారు. దాదాపు గంట పాటు తమ దగ్గర సైకిల్‌ను ఉంచుకున్న పోలీసులు...ఆ తర్వాత విద్యార్థికి తగిన కౌన్సెలింగ్ చేసి సైకిల్ ఇచ్చి పంపినట్లు వివరణ ఇచ్చారు.



First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...