ఈ ఇంటర్ నెట్ యుగంలో ఫేక్ గాళ్లు ఎక్కువయ్యారు. కొందరు అదే పనిగా తప్పుడు వార్తలు సృష్టించడం, దాన్ని వైరల్ చేసి ఆనందించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన న్యూస్ కు తగిన ఫేక్ వార్తలను తయారు చేయడం వీరి ప్రత్యేకత. తాజాగా ఇలాంటి మరో ఫేక్ వార్త ఇంటర్ నెట్లో హల్ చల్ చేస్తోంది. రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్‌పై ఆదానీ రైల్వే అని ఉండడం... దాని ధర రూ.50గా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఈ ఫ్లాట్‌ఫామ్ టికెట్ ఫొటో వైరల్‌గా మారింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ సాగుతోంది. రైల్వేను ఆదానీకి అమ్మేస్తే ప్లాట్‌ఫామ్ టికెట్ ధర పెరగడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అనేక మంది తమ ఆగ్రహాన్ని సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని కొంచెం లోతుగా పరిశీలిస్తే వైరల్ గా మారిన ఆ ఫొటో ఫేక్ అని తెలుస్తోంది.
పూణే జంక్షన్ పేరు మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ప్లాట్‌ఫామ్ టికెట్ ఈ ఏడాది అగస్టులోనూ ఇంటర్ నెట్లో చక్కర్లు కొట్టింది. కానీ అప్పుడు ఆ టికెట్ పై ఆదానీ రైల్వే అనే పేరు లేదు. ఆ సమయంలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి జన సంచారం తగ్గించడమే లక్ష్యంగా ఫ్లాట్ ఫాం టికెట్ ను రూ. 5 నుంచి రూ. 50కి పెంచారు.
पुणे जंक्शन द्वारा प्लेटफार्म टिकट का मूल्य ₹50 रखने का उद्देश्य अनावश्यक रूप से स्टेशन पर आने वालों पर रोक लगाना है जिस से सोशल डिसटेनसिंग का पालन किया जा सके।
रेलवे प्लेटफार्म टिकट की दरों को कोरोना महामारी के शुरुआती दिनों से ही इसी प्रकार नियंत्रित करता आया है। https://t.co/X2HuPC5HUg
— Spokesperson Railways (@SpokespersonIR) August 17, 2020
ఆ సమయంలోనూ అనేక మంది ఈ టికెట్ ధర పెంచడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే టికెట్ పై ఆదానీ రైల్వే అని ఉంచి కొందరు ఇంటర్ నెట్లో పెట్టడంతో వైరల్ గా మారిందని స్పష్టమైంది. ఇటీవల ఓ రైల్వే బోగీపై ఆదానీ సంస్థ పేరున్నట్లుగా ఉన్న వీడియో కూడా ఇంటర్ నెట్లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని అధికారులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fact Check, Indian Railways