హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Fact Check: రూ. 500 నోట్లలో ఫేక్ నోట్లు ఉన్నాయని సరికొత్త ప్రచారం.. నిజమెంతా?

Fact Check: రూ. 500 నోట్లలో ఫేక్ నోట్లు ఉన్నాయని సరికొత్త ప్రచారం.. నిజమెంతా?

రూ. 500 నోట్లు

రూ. 500 నోట్లు

సోషల్ మీడియాలో జరిగే ప్రచారంతో అసలు నిజమోదో, అబద్ధమెదో తెలియక చాలా ఇబ్బందుకు పడాల్సి వస్తోంది. సోషల్ మీడియాను కొన్నిసార్లు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పప్పులో కాలేసిన సందర్భాలు ఉన్నాయి.

సోషల్ మీడియాలో జరిగే ప్రచారంతో అసలు నిజమోదో, అబద్ధమెదో తెలియక చాలా ఇబ్బందుకు పడాల్సి వస్తోంది. సోషల్ మీడియాను కొన్నిసార్లు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పప్పులో కాలేసిన సందర్భాలు ఉన్నాయి. వందల సంఖ్యలో పోస్టుల్లో ఏదిని నమ్మాలో, ఏదిని నమ్మకూడదో కూడా తెలియక నెటిజన్లు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో జరిగిన తప్పుడు ప్రచారంపై క్లారిటీ వచ్చిన.. కొంతకాలం తర్వాత మళ్లీ అవే పోస్టులు వైరల్ మారుతున్నాయి. ఇలాంటి ఓ సమాచారం తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటో చుద్దాం..

గతేడాది రూ. 500 నోటకు సంబంధించి ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. కొత్తగా రూ. 500 వచ్చిన వెంటనే దుండగులు.. పెద్ద ఎత్తున ఫేక్ నోట్లు చలామణిలోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. రెండు రకాల రూ. 500 రూపాయల ఫొటోలు షేర్ చేశారు. అందులో రూ. 500 నోటుకు సంబంధించి మహత్మా గాందీ బొమ్మకు దగ్గరగా గ్రీన్ లైన్ ఉన్న నోటును, గాంధీ బొమ్మకు దూరంగా గ్రీన్ లైన్ ఉన్న ఫొటోలు ఉన్నాయి. వాటిలో గాంధీ బొమ్మకు గ్రీన్‌లైన్ దగ్గరిగా ఉన్నది నకిలీ నోటు అని.. అందుకే ఎవరి వద్ద నుంచైనా రూ. 500 నోటు తీసుకోవాలని బలంగా చెప్పారు. 2017లో కూడా ఇదే రకమైన ప్రచారం జరిగింది.

అయితే అప్పట్లోనే ఈ వార్తపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. పీఐబీ తన ఫ్యాక్ట్ చెక్‌లో అది తప్పుడు ఆ వార్త అని తేల్చింది. ఆ ఫొటోలోని రెండు నోట్లు కూడా వర్జినల్ నోట్లేనని చెప్పింది. ఆ ఫొటోలోని రెండు నోట్లు కూడా చెలామణిలో ఉన్నవేనని స్పష్టం చేసింది. ఇక, వాస్తవానికి రూ. 500 నోట్లలో కొన్నింట్లో గాంధీ బొమ్మకి గ్రీన్ లైన్ స్ట్రిప్ దగ్గరగా, మరికొన్నింటిలో దూరంగా ఉంటుంది. కానీ మరోసారి ఆ ప్రచారం తెరమీదకు వచ్చింది. పలు సోషల్ మీడియా వేదికల్లో గతంలో చేసిన పోస్టులనే పలువురు ఫార్వర్డ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి ఫేక్ వార్తలు చూసిన వారు నిజమని నమ్మి తమ వద్ద కూడా ఫేక్ నోట్లు ఉన్నాయని భావించే అవకాశం ఉంటుంది. అలాగే ఇతరులు ఫేక్ నోటుగా ప్రచారం జరుగుతున్న నోట్లు ఇచ్చినప్పుడు వివాదం తలెత్తే ప్రమాదం లేకపోలేదు. అందుకే సోషల్ మీడియాలో జరిగే ఇలాంటి ప్రచారాలను గుడ్డిగా నమ్మకపోవడమే మేలు.

First published:

Tags: Fact Check

ఉత్తమ కథలు