• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • FACT CHECK CENTRAL GOVERNMENT NOT GIVING RUPEES 3800 TO UNEMPLOYED YOUTH UNDER UNEMPLOYMENT ALLOWANCE TO JOBLESS CITIZENS HERE IS THE DETAILS MS

Fact Check: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నెలకు రూ. 3,800 ఇస్తుందా..? ఇందులో నిజమెంత..?

Fact Check: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నెలకు రూ. 3,800 ఇస్తుందా..? ఇందులో నిజమెంత..?

ప్రతీకాత్మక చిత్రం

Fact Check: 18 నుంచి 50 ఏళ్ల వయసున్న వారు ఈ పథకానికి అర్హులని.. వారికి వయసును బట్టి నిరుద్యోగ భృతి అందజేస్తారని సదరు సందేశంలో ఉంది. ప్రధానమంత్రి నిరుద్యోగ భృతి కింద ఈ పథకాన్ని ప్రారంభించినట్టు కూడా సదరు సందేశంలో పేర్కొన్నారు. మరి ఇందులో నిజానిజాలెంత..?

  • News18
  • Last Updated:
  • Share this:
    కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భత్యం కింద నగదును అందజేస్తుందని ఒక సందేశం వాట్సాప్ తో పాటు మిగిలిన సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో వైరల్ అవుతున్నది. 18 నుంచి 50 ఏళ్ల వయసున్న వారు ఈ పథకానికి అర్హులని.. వారికి వయసును బట్టి నిరుద్యోగ భృతి అందజేస్తారని సదరు సందేశంలో ఉంది. ప్రధానమంత్రి నిరుద్యోగ భృతి కింద ఈ పథకాన్ని ప్రారంభించినట్టు కూడా సదరు సందేశంలో పేర్కొన్నారు. అయితే మరి ఇందులో నిజానిజాలెంత..? నిజంగా కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని ఇస్తున్నదా..? ఇక్కడ చదవండి.

    ప్రధానమంత్రి నిరుద్యోగ భృతి పథకం కింద 18 నుంచి 50 ఏళ్ల వయసున్న వారికి రూ. 3,800 నిరుద్యోగ భృతిని ఇస్తున్నారనే సందేశం వాట్సాప్ లో వైరల్ గా మారుతున్నది. 18-25 ఏళ్ల మధ్య ఉన్నవారికి రూ. 1,500.. 25-30 ఏళ్ల మధ్య వయసున్నవారికి రూ. 2,000.. 31-35 ఏళ్ల లోపు ఉన్నవారికి రూ. 3,000.. 36-45 ఏళ్ల వయుసున్నవారికి రూ. 3,500.. 46 నుంచి 50 ఏళ్ల లోపు ఉన్న నిరుద్యోగులకు నెలకు రూ. 3,800 చొప్పున నిరుద్యోగ భృతి కల్పించనున్నట్టు సందేశాలు సామాజిక మాధ్యమాలలో చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఒక లింక్ ఇచ్చి.. దానిపై క్లిక్ చేస్తే దీనికి అప్లై చేసుకోవచ్చునని అందులో ఉంది.





    ఏదేమైనప్పటికీ ఇలాంటి వార్తల కథా కమామీషు తేల్చే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం దీని మీద ఫాక్ట్ చెక్ నిర్వహించింది. ఇలాంటి ప్రతిపాదనేదీ కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదని.. అసలు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని అమలు చేయడం లేదని పేర్కొంది. ఇది ఫేక్ న్యూస్ అని కుండబద్దలు కొట్టింది.

    పీబీఐ ట్విట్టర్ లో ఇలా రాసుకొచ్చింది.. ‘కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నెలకు రూ. 3,800 నిరుద్యోగ భత్యాన్ని ఇస్తుందనే సందేశం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారుతున్నది. కానీ ఇందులో నిజం లేదు. కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రకటనేమీ చేయలేదు..’ అని పేర్కంది.గతంలో కూడా ప్రధానమంత్రి నిరుద్యోగ భత్యం కింద రూ. 3,500 ఇస్తుందన్న న్యూస్ కూడా వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇది కూడా ఫేక్ న్యూస్ గానే నిలిచింది.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు