Home /News /trending /

FACEBOOK RELEASES NEW FEATURES FOR A FUN FILLED VIRTUAL DIWALI EXPERIENCE SU GH

Diwali Celebration: వర్చువల్ విధానంలో దీపావళి.. ఫేస్‌బుక్ జోడించిన ఈ నూతన ఫీచర్లతో సరికొత్తగా జరుపుకోండి

వర్చువల్ దీపావళి.. ఫేస్‌బుక్ నూతన ఫీచర్లు

వర్చువల్ దీపావళి.. ఫేస్‌బుక్ నూతన ఫీచర్లు

భారతీయ పండుల్లో కెల్లా ముఖ్యమైన పండుగగా జరుపుకునే దీపావళి సమీపిస్తుండటంతో అందరి ఇళ్లలో హడావుడి మొదలైంది. అయితే, ఈ ఏడాది కరోనా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇంట్లోనే లేదా వర్చువల్ విధానంలో పండుగ జరుపుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.

ఇంకా చదవండి ...
భారతీయ పండుల్లో కెల్లా ముఖ్యమైన పండుగగా జరుపుకునే దీపావళి సమీపిస్తుండటంతో అందరి ఇళ్లలో హడావుడి మొదలైంది. అయితే, ఈ ఏడాది కరోనా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇంట్లోనే లేదా వర్చువల్ విధానంలో పండుగ జరుపుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు పండుగ వేడుకలను సరికొత్తగా నిర్వహించుకునేందుకు ప్రముఖ సామాజిక మాధ్యమాలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ దీపావళి పండుగ కోసమే ప్రత్యేకంగా కొన్ని అవతార్లను సిద్దం చేసింది. ఈ ఏడాది కోవిడ్–19 విజృంభన నేపథ్యంలో ఇంట్లోనే ఉండి ఈ సరికొత్త అవతార్లతో వేడుకలు జరుపుకోండి. దీంతో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో వర్చువల్ విధానంలోనే సరదాగా పండుగను జరుపుకోవచ్చు.

దివాళీ ఎట్ హోం ఛాలెంజ్
కరోనా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా దీపావళి చేసుకోవాలనే ఉద్దేశంతో ‘DiwaliAtHomeChallenge’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను చేర్చింది. ఈ హ్యాష్ ట్యాగ్ను ఉపయోగించి మీ ఇంట్లో జరుపుకున్న దీపావళి వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఛాలెంజ్ విసురుతూ ట్యాగ్ చేయండి. తద్వారా వారు కూడా మీ ఛాలెంజ్ను స్వీకరించి వారి వేడులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తారు.

దియాస్ దీపావళి
వేడుకల్లో భాగంగా లైట్ బల్బులు, కొవ్వొత్తి హోల్డర్లు, దియాస్, లాంతర్లను ఉపయోగించి మీరు వెలిగించిన దీపాలకు సంబంధించిన ఒక వీడియో రూపొందించండి. దీన్ని ‘DIYDiwaliChallenge’ అనే హ్యాష్ట్యాగ్తో మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకొని వారికి ఛాలెంజ్ విసరండి. తద్వారా వారు కూడా మీ DIY ప్రాజెక్టులో పాలు పంచుకుంటారు.

హ్యాష్ట్యాగ్ ఎలా చేయాలి?
దీపావళి వేడుకల్లో భాగంగా ఫేస్‌బుక్ చేర్చిన హ్యాష్ట్యాగ్ను వివరిస్తూ “ మీరు కొత్త ఫేస్‌బుక్ పోస్ట్‌ను సృష్టించే ముందు మీ యాక్టివిటీని వివరిస్తూ చివర్లో 'ఛాలెంజ్' అనే పదంతో హ్యాష్‌ట్యాగ్‌ను రూపొందించండి. మీ ఛాలెంజ్ను ప్రారంభించడానికి ముందు “దీన్ని ప్రయత్నించండి” అనే బటన్‌పై క్లిక్ చేయండి. అంతేకాక, న్యూస్ ఫీడ్‌లో మీ ఛాలెంజ్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను జతచేయండి. ఈ ఛాలెంజ్ స్వీకరించడానికి గాను మీ ప్రియమైన స్నేహితులు, కుటుంబ సభ్యులను ట్యాగ్ చేసి నామినేట్ చేయండి. ” అని పేర్కొంది.

మీ అవతార్‌ను రూపొందించండి
దీపావళి వేడుకల్లో భాగంగా ఫేస్బుక్ దీపావళి నేపథ్య అవతార్లను పరిచయం చేస్తోంది. థీమ్‌తో సరిపోలడానికి మీరు మీ వ్యక్తిగతీకరించిన రంగురంగుల అవతార్‌ను రూపొందించుకోవచ్చు. మీ ఫోన్ నుండి అవతార్‌ను సృష్టించడానికి Android లేదా IOS లోని “క్రియేట్ పోస్ట్” కంపోజర్‌కు వెళ్లి “బ్యాక్‌గ్రౌండ్ కలర్” పై క్లిక్ చేసి దీపావళి నేపథ్యాన్ని ఎంచుకోండి. ఆ తర్వాత # శుభీ దీవాలి 2020 లేదా # దీపావళి 2020తో మీ ఫేస్బుక్ వాల్పై పోస్ట్ చేయండి.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Diwali 2020, Facebook

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు